Jump to content

బాలకృష్ణ ఇంటి ముందు దేవిశ్రీ నిరసన


chedugudu_chidambaram

Recommended Posts

04475528EAG10A.JPG

మలికిపురం: ప్రేమ కోసం ఓ యువతి పోరాటానికి దిగింది. తనను ప్రేమించిన వ్యక్తితోనే తన పెళ్లి జరగాలంటూ తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని బత్తేలంక గ్రామానికి చెందిన కొల్లు దేవిశ్రీ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే.. దేవీశ్రీ, అదే గ్రామానికి చెందిన పెసింగి బాలకృష్ణ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అడగ్గా.. అందుకు బాలకృష్ణ నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 4న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆమె తల్లిదండ్రులు బాలకృష్ణపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలు రాజీ ప్రయత్నాలు చేశాయి. అయినా దేవిశ్రీని వివాహం చేసుకొనేది లేదని యువకుడు తేల్చి చెప్పడంతో అతడి ఇంటి వద్ద నిరసనకు దిగింది. దీంతో బాలకృష్ణ, అతడి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న సఖినేటిపల్లి ఎస్సై పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని దేవిశ్రీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమించిన వాడితో తన పెళ్లి జరిగే వరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేసింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, గ్రామస్థులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...