Jump to content

TRS


chinnarayudu

Recommended Posts

  • Replies 146
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • chinnarayudu

    105

  • Imperial_09

    20

  • chilakottudu

    3

  • Nasavunensastha

    3

1. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఆంధ్రోడు ఆపిండా.!!
2. దళితులకు 3ఎకరాలు ఇస్తావుంటే ఆంధ్రుడు ఆపిండా!!
3. కేజీ to పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తుంటే ఆంధ్రోడు ఆపిండా!!
4. లక్ష కొలువులు భర్తీ చేస్తూ.. ఇంటికొక ఉద్యోగం ఇస్తుంటే ఆంధ్రోడు ఆపిండా!!
5. ఇంటిటికి నీరు ఇస్తావుంటే ఆంధ్రోడు ఆపిండా!!
6) మైనార్టీ, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇస్తావుంటే ఆంధ్రోడు ఆపిండా!!
7) హైదరాబాద్ లో అంబేద్కర్ స్టడీ సర్కిల్, బంజార భవన్, క్రిస్టియన్ భవన్, జర్నలిస్టు భవన్ కడుతుంటే ఆంధ్రోడు ఆపిండా!!
8> హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేసి అమరవీరుల స్మ్రుతివనం కడుతుంటే ఆంధ్రోడు ఆపిండా!!

9) పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తుంటే
కరీంనగర్ ను లండన్ గా మారుస్తుంటే
వరంగల్ ను డల్లాస్ చేస్తుంటే
ఆంధ్రోడు ఆపిండా!!

10) మహిళలకు మంత్రి పదవి ఇచ్చి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఆంధ్రోడు ఆపిండా!!

వీటన్నింటికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేక..
ఆంధ్రోడు మీద నిందలువేసి తెలంగాణ ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి సిద్ధమయిన కేసీఆర్

విడిపోయీ అన్నదమ్ములుగా ఉందామని చెప్పి..విద్వెషాలు రెచ్చగొట్టే కేసీఆర్ని తరిమిగొట్టండి

Link to comment
Share on other sites

*కోర్ట్ ల చేతిలో 4 ఏళ్లలో ఏకంగా 40 సార్లు గూబగుయ్యి మనిపించుకున్న కె సి ఆర్... థూ.. నీ బ్రతుకుజెడ అనాలనిపిస్తుందా !*
--------------------------------------------------------------------
1. 1956 నాటి స్థానికత ఆధారంగా 'ఫాస్ట్ పధకం' చెల్లదు, తెలంగాణా భారత్ లో అంతర్భాగం అని హై కోర్ట్ చెప్పింది.

2. GHMC ఎన్నికల వాయిదా చెల్లదు, డిసెంబర్ 31 లోగా జరిపించాలి అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

3. సమగ్ర సర్వేలో ప్రాంతాల వివరాలు, స్థానికతను తొలగించాలి అని తెలంగాణాకు వ్యతిరేకంగా హైకోర్ట్ తీర్పు..

4. ఫోన్ టాపింగ్ కేసులో కాల్ డేటా, కాల్ రికార్డు లను హైకోర్ట్ కు సమర్పించాలి అని హైకోర్ట్ చెప్పింది, మొదట టాపింగ్ చేయలేదని, తరువాత కోర్ట్ లో చేశామని ఒప్పుకున్నారు.

5. తెలంగాణాలో నెంబర్ ప్లేట్స్ ను TS కు మార్చాలని జీ ఓ వేస్తె, మళ్ళీ రిజిస్ట్రేషన్ అనే జీ ఓ చెల్లదు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

6. ఇంటర్ బోర్డు ఖాతాల స్తంభన కేసులో తెలంగాణా ప్రభుత్వానికి తలంటు. యధాతధ స్తితి తీర్పు ఇచ్చిన హైకోర్ట్.

7. రేవంత్ రెడ్డి బెయిల్ కేసులో హైకోర్ట్ లోను, సుప్రీం కోర్ట్ లోనూ కెసిఆర్ కు చుక్కెదురు.

8. ఆరుగురు పార్లిమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

9. ఆంధ్ర స్థానికత వున్న విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయడం చెల్లదు, వారిని ఉద్యోగాలలోకి తీసుకోవాలి అన్న హైకోర్ట్..

10. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ విషయంలో తెలంగాణా వాదన తప్పు అని హైకోర్ట్ చెప్పింది. ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పింది. ఎ పి లో స్టడీ సెంటర్స్ ను ఈ యూనివర్సిటీ కర్పస్ ఫండ్స్ తో నడపమని తీర్పు.

11. ఆంధ్రకు ప్రత్యేక హైకోర్ట్ విషయంలో, కొత్త హైకోర్ట్ పెడితే ఆంధ్రలోనే పెట్టాలి, అప్పటిదాకా వుమ్మడి కోర్టే అని స్పష్టం చేసింది, అప్పటిదాకా హైకోర్ట్ విభజన కుదరదు అని చెప్పింది.

12. ముత్తయ్య బెయిల్ కేసులో జడ్జ్ ను మార్చమని కెసిఆర్ స్టీఫెన్ సన్ తో కేసు వేయించాడు. దానిని హైకోర్ట్ కొట్టి వేసింది.

13. తప్పుగా డిజైన్ చేసిన తెలంగాణా రాజముద్రను వెంటనే మార్చమని హైకోర్ట్ ఆదేశించినది..

14. గురుకుల్ ట్రస్ట్ కు వేరే చోట భూమి కేటాయించాలి అని పాత తీర్పును సవరించడానికి హైకోర్ట్ ఒప్పుకోలేదు.

15. హైదరాబాద్ లో ఎ పి ఎన్ జి ఓ లకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నిచిన కెసిఆర్ ప్రభుత్వ చర్యను హైకోర్ట్ నిలిపివేసింది.

16. వేరే పార్టీలో గెలిచి తెరాసలో చేరిన ఎం ఎల్ ఎ ల అనర్హత పై హైకోర్ట్ స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది, అయినా తీసుకోలేదు.

17. ఆంధ్ర స్థానికత పేరుతో తొలగించిన 250 మంది నీటి పారుదల శాఖ ఉద్యోగులను, హైకోర్ట్ లో కేసు ఓడిపోయే స్తితిలో రాజీకి వచ్చి మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకుంది, ఇది 371–డి కి విరుద్దం అని తీర్పు చెప్పింది.

18. జ్యుడిషియల్ ఆఫీసర్స్ నియామకాలను రాష్ట్రాల వారీగా భర్తీ చేయాలి అని తెలంగాణా కోర్ట్ కు వెళ్ళింది, కానీ ఈ కేసు వీగిపోయింది. నియామకాలు యధావిదిగానే రోస్టర్ పద్ధతిలో జరుగుతాయి అని చెప్పింది.

19. మల్లన్న సాగర్ భూసేకరణకు ఉపయోగిస్తున్న GO. 123 చట్ట విరుద్దం, రైతులు కోరితే భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలి అని హై కోర్ట్ తీర్పు. దీనివలన రైతులకు భూసేకరణ చట్టం కన్నా తక్కువ విలువ వస్తుంది అని చెప్పింది.

20. నిమ్జ్ – మెదక్ కేసులో కూడా జీ ఓ 123 చట్ట విరుద్దం, ఇది భూసేకరణ చట్టంలో అన్ని క్లాజులను సంతృప్త పరచడం లేదు అని GO 123 ని రద్దు చేసింది.

21. పోలీస్ ట్విన్ టవర్స్ నిర్మాణంపై హైకోర్ట్ అడ్డుకట్ట వేసింది.

22. పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్ ల అనుమతులపై కృష్ణా అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

23. రేవంత్ రెడ్డి పై కుట్ర కేసులో.. ముత్తయ్య పై కేసు కొట్టివేత.

24. తెలంగాణా డిస్కం లు ఆంధ్రకు బదిలీ చేసిన 1200 మంది ఆంధ్ర ప్రాంత తెలంగాణా విద్యుత్ ఉద్యోగుల బదిలీ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్దం అని హైకోర్ట్ తీర్పు చెప్పింది.

25. తెలంగాణా సాంస్కృతిక సమితిలో నామినేషన్ ద్వారా ఎంపిక చేసిన 500 కళాకారుల నియామకం చెల్లదు, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేయాలి అని హైకోర్ట్ చెప్పింది.

26. తెలంగాణా అసెంబ్లీలో స్పీకర్ – తెరాస – కెసిఆర్ కుమ్ముక్కు అయ్యి అనర్హత వేటు వేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎం ఎల్ ఎ లపై అనర్హతను హై కోర్ట్ కొట్టి వేసింది.

27. 21 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై హై కోర్ట్ స్టే విధించింది, ఇది నిరుద్యోగుల హక్కులను హరించడమే అని చెప్పింది.

28. బి సి జనగణన లేకుండా పంచాయితీ ఎన్నికలు జరపకూడదు అని హైకోర్ట్ చెప్పింది.

29. విద్యా సంస్థల ప్రవేసాలలో స్పోర్ట్స్ కోటాను హైకోర్ట్ రద్దు చేసింది.

30. ఎ పి ఉన్నత విద్యామండలి కేసులో తెలంగాణా ప్రభుత్వం చెబుతున్న ఎక్కడి ఆస్తులు అక్కడే అనే వాదనను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది, విద్యా మండలి & 10 షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో వున్నా ఆస్తులను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి అని తీర్పు ఇచ్చింది.

31. GO 39 ద్వారా ఫార్మర్ కో ఆర్డినేషన్ కమిటీకి రూ. 500 కోట్లు ఇవ్వడానిని తప్పు పట్టి హైకోర్ట్ ఆ GO ను కొట్టివేసింది, ఇది స్థానిక సంస్థలను బలహీన పరచడం కోసమే అని చెప్పింది.

32. గెజిట్ నోటిఫికేషన్ లేని, జోనల్ విభజన జరగని 31 జిల్లాల ప్రాతిపదికన ఇచ్చిన DSC నోటిఫికేషన్ చెల్లదు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది, పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలి అని చెప్పింది.

33. ఎనిమిది మంది వైస్ ఛాన్సలర్ ల నియామకాన్ని హైకోర్ట్ కొట్టివేసింది.

34. మైనారిటీ మెడికల్ కాలేజీలో సీట్ల కోటా నిష్పత్తిని (A,B,C) మెడికల్ కాలేజీలకు అనుగుణం గా తెలంగాణా ప్రభుత్వం మార్చడాన్ని హైకోర్ట్ కొట్టివేసింది.

35. స్థానికత ఆధారంగా ఫీజు రీఇమ్బుర్స్మెంట్ ను హై కోర్ట్ నిలిపివేసింది..

36. సింగరేణి సంస్థలో వారసత్వ నియామకాలను హైకోర్ట్ నిలిపివేసింది.

37. గచ్చిబౌలి బయో డైవర్సిటి పార్క్ దగ్గర నిర్మితం అవుతున్న ఫ్లై ఓవర్ పై హై కోర్ట్ స్టే విధించింది..

38. ఏకీకృత సర్వీస్ లపై సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది..

39. బైసన్ పోల్ గ్రౌండ్ లో కొత్త సచివాలయం నిర్మాణంపై హైకోర్ట్ యదాతధ స్థితి కొనసాగించమని తీర్పు.

40. ధర్నా చౌక్ పై తెలంగాణా ప్రభుత్వం సంవత్సరకాలంగా ఎందుకు మౌనంగా వుంది అని హై కోర్ట్ ప్రశ్నించింది.

 
 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...