Jump to content

Chandranna bharatam

manadonga

Recommended Posts

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగాలంటే, దుర్యోధనుడి మదం అణచాలంటే కృష్ణుడొకడు ఖచ్చితంగా కావాలి. అలా అని వాడు ప్రతిరొజూ దుర్యోధనుడి పాలనాకేంద్రమైన హస్తినలో కనిపించడు. తన చిన్న యాదవరాజ్యంలో తానుంటాడు. ఓ లక్క ఇల్లు దహనానికి కుట్ర జరిగినప్పుడో, ఒక వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడో ప్రత్యక్షమవుతాడు. ఒక జరాసంధుడ్ని వధించడమెలాగో చూపిస్తాడు. ధృతరాష్ట్రుడి ఉక్కుకౌగిలినుండి తప్పించుకోడమెలానో నేర్పిస్తాడు. దుర్యోధనుడి బలహీనత ఊరువుల్లో ఉందని తెలియజేసి ఖచ్చితంగా ఆ తొడల్నే విరగ్గొట్టిస్తాడు.   

ఇంతా చేసి కృష్ణుడు బలవంతుడా లేక దుర్యోధనుడా ? నిస్సందేహంగా దుర్యోధనుడే. వాడు శారీరకంగా, ఆర్ధికంగా, అధికారికంగా బలవంతుడు. మానసికంగా మూర్ఖుడు. పైగా ఛప్పన్నదేశాల మహారాజులూ తలమోడ్చి కప్పం కట్టే సామ్రాట్టు. అందువల్ల వాడికి తోడుగా భక్తికో, భయానికో ఒక పదకొండు అక్షౌహిణుల సైన్యం కూడా పోగవుద్ది. వాడితో సరిసమానులైన బలవంతులు లేరా అంటే భీముడి పేరు, అర్జునుడి పేరు, ఇంకో నాలుగైదు పేర్లూ వినబడతాయిగానీ వాళ్ళందరినీ కలిపే ఒక ఆలంబన కావాలి. వాడే కృష్ణుడు. వాడు పాండవులకి తోడుగా చక్రం తిప్పాడు, పాండవులకే కాదు, వాళ్ళ పిల్లలకి కూడా బలమైన రాజ్యాలతో పెళ్ళిసంబంధాలు కుదిర్చాడు, పాండవుల నెట్‌వర్క్, నెట్‌వర్త్ పెంచాడు. మేనల్లుడైన అభిమన్యుడికి విరాటరాజు కూతురు ఉత్తరతో పెళ్ళి చేసి యుద్ధానికి వెళ్ళేముందు పాండవుల బలం పెంచాడు. ఉత్తరకుమారుడు ( రాహుల్) యుద్ధానికి పెద్దగా పనికిరాడేమోగానీ వాడి వెనక ఉన్న సైన్యం పనికొస్తుంది. అదే రాజనీతి.  ఇలా కృష్ణుడు అండగా ఉన్నాడు కాబట్టే అప్పటిదాకా వనవాసం, అజ్ఞాతవాసం చేసిన పాండవుల వెనక కూడా ఏడు అక్షౌహిణుల సైన్యం పోగయింది.  

ప్రస్తుతం జరుగుతున్నదీ భారతమే. జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమే. ఈ భారతంలో కాలధర్మంతో యుద్ధానికి ముందే భీష్ముడు(వాజపేయి) నేలకొరిగాడు. నిరంతరం దుర్యోధనుడి చేతిలో అవమానాలకి గురయిన ద్రోణుడు(అద్వాని) ఎప్పుడో అస్త్రసన్యాసం చేశాడు. కర్ణుడి పాత్రే లేదు. దుర్యోధనుడ్ని అంటిపెట్టుకుని ఉన్నవాడేమో శకుని(అమిత్ షా). దుర్యోధనుడి సభలో కొత్తగా ప్రవేశించిన విదూషకులే (జీవీయెల్, రామ్మాధవ్, కన్నా తదితరులు) అధికార ప్రతినిధులు, వ్యూహకర్తలు, మంత్రులు, సైన్యాధ్యక్షులు. పట్టాభిషేకం జరిగిన రోజున్న బలం లేదిప్పుడు వీడికి.    

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ ! కృష్ణుడు మళ్ళీ రంగంలోకి దిగాడు. దుర్యోధనుడ్ని వేసేద్దామా ?

Link to comment
Share on other sites

1 hour ago, manadonga said:

nikrustudi la unnadu..veedu krishnudenti?sFun_duh2

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...