Jump to content

హెచ్‌-4 వీసా అంశంపై ప్రజాభిప్రాయం కోరుతాం వెల్లడించిన అమెరికా


JANASENA

Recommended Posts

వాషింగ్టన్‌: హెచ్‌-4 వీసాల రద్దుపై పునరాలోచించాలనే యోచనలో ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్‌-4 వీసాలపై కఠిన నిబంధనలను విధించారు. అయితే ట్రంప్ నిర్ణయంపై ఇటు అమెరికాలోని ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్‌ సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో దీనిపై ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాలపై ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లిన నిపుణులకు అత్యంత సన్నిహితులు అంటే భార్య లేదా భర్త, 21 ఏళ్లలోపు పిల్లలకు హెచ్‌-4 వీసాలు ఇస్తారు.

ఇప్పటివరకు ఈ వీసాపై ఉన్న రద్దు పట్ల ప్రజాభిప్రాయాన్ని కోరతామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే యూస్‌ సిటిజెన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సేవల(యూఎస్‌సీఐఎస్‌) విభాగంతో చర్చలు జరిపినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించే యోచనలో ఉన్నట్లు కార్పొరేట్‌ సంస్థలు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే డీహెచ్‌ఎస్‌ లిఖిత పూర్వక లేఖలను రాసి పంపింది. 2019 జనవరిలోపు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈ కొత్త ప్రతిపాదన వర్క్‌ పర్మిట్లు ఉన్న సుమారు 70,000 హెచ్‌-4 వీసాదారులపై ప్రభావం చూపనుంది.

దీనిపై యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఎల్‌ ఫ్రాన్సిస్‌ సిస్నా మాట్లాడుతూ.. ‘హెచ్‌-4 వీసాలపై తమ అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజలకు, ఆ వీసాదారులకు అవకాశం కల్పిస్తాం. దీనిపై వారి వ్యాఖ్యలను నిర్భయంగా తెలియజేయవచ్చు. హెచ్‌-4వీసాలపై ఇలాంటి పరిమితులను విధించినందు వల్ల సుమారు లక్షమంది నైపుణ్యం గల మహిళలు ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఇది వారికే కాదు వారి కుటుంబానికి కూడా ప్రతికూల అంశమే. అంతేకాకుండా దీని వల్ల అమెరికా ప్రభుత్వం పట్ల కూడా ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం లేకపోలేదు’ అని తెలిపారు.

Link to comment
Share on other sites

Just now, Sachin200 said:

Edche sagam Mandi Desi gallu vuntaru Ani na strong feeling 

Chance vunte evariki vallaki h4 ok , chance lekapothe teeseyedam antam 

idi eenadu lo vesadu baa, but I searched in google asalem new ledu denigurinchi.

Link to comment
Share on other sites

1 minute ago, megadheera said:

H4 Visa or H4 EAD? Basic knowledge lekunda rasadu evado. All rules go through public comments section. Dantlo veedu cheppedento?

H4 EAD, 70K is the count reflecting....evado love da gadu rasi vuntandu :giggle:

Link to comment
Share on other sites

1 minute ago, megadheera said:

H4 Visa or H4 EAD? Basic knowledge lekunda rasadu evado. All rules go through public comments section. Dantlo veedu cheppedento?

Eenadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...