Jump to content

స్టాలిన్‌తో చంద్రబాబు కీలక భేటీ


snoww

Recommended Posts

స్టాలిన్‌తో చంద్రబాబు కీలక భేటీ 08053008TAM123A.JPG

చెన్నై: భాజపాయేతర రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అంశంలో భాగంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరి వెళ్లిన చంద్రబాబు నేరుగా స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు డీఎంకే నేతలు ఘనస్వాగతం పలికారు. భాజపాయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న కృషిని స్టాలిన్‌ ఇటీవల స్వాగతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో స్టాలిన్‌తో పాటు డీఎంకే ముఖ్య నేతలు కనిమొళి, టీఆర్‌ బాలు, రాజా పాల్గొన్నారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, ఎంపీ సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.

08054708TAM123B.JPG

ఇటీవల దిల్లీ పర్యటనలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తన ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గురువారం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ, తదితర నేతలతో సమావేశమయ్యారు. ఇదే క్రమంలో ఈ రోజు చెన్నైకి బయల్దేరి వెళ్లారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో గంట పాటు చర్చించనున్నట్టు సమాచారం. తాజా రాజకీయాలతో పాటు, ఇతరత్రా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Quote

చంద్రబాబు వెంట మంత్రులు యనమల, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, ఎంపీ సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు ఉన్నారు.

motham government ni theesukoni vellalsindi inka ee uppara meeting ki 

inka Amaravati construction ayyinatte 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...