Jump to content

త్వరలోనే లక్ష గృహాలకు సామూహిక గృహప్రవేశాలు


JANASENA

Recommended Posts

11143302011APCM-BABUA.JPG

అమరావతి: ఏపీలో ప్రతి కుటుంబానికి అన్నివసతులతో సొంత ఇల్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఇకపై ప్రతి బుధవారం పట్టణ గృహనిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. గృహనిర్మాణశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చిన్న పాటి అంశాలను కూడా క్లిష్టం చేయడం సరైందికాదన్నారు. ప్రతిఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. పట్టణ గృహనిర్మాణం ఒక స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టు లేదన్నారు. ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు రుణం, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటు అన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చామన్నారు. ప్రతి అంశానికి నిర్దిష్టమైన గడువును నిర్దేశించి, గడువులోపల పనులు పూర్తిచేయాలని సూచించారు. రుణాల మంజూరును బ్యాంకర్లు వేగవంతం చేయాలని.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పట్టణాలలో లక్ష గృహాలకు సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. బ్యాంకర్లు, డెవలపర్లు, అధికారుల పనితీరును విశ్లేషిస్తానని సీఎం చెప్పారు. ఇళ్ల మంజూరు, లబ్దిదారుల ఎంపిక, ప్లాన్ల తయారీ, పనుల పురోగతిని సమీక్షించాలని అధికారులకు ఆయన సూచించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...