Jump to content

ఏపీ సహా 5రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా


snoww

Recommended Posts

ఏపీ సహా 5రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా

0738334BRK-SUPREM1.JPG

దిల్లీ: మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఈరోజు దిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలపై జరిమానా విధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును సీరియస్‌గా తీసుకోవడం లేదని దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, జమ్ముకశ్మీర్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఒక్కో రాష్ట్రానికి రూ.లక్ష జరిమానా విధించింది. ఈ పథకం అమలు, పరిశుభ్రత పాటించే అంశాలకు సంబంధించి సమీక్ష చేయడానికి ఆన్‌లైన్‌ లింక్‌ రూపొందించడంలో విఫలమయ్యారని కోర్టు ఈ జరిమానా వేసింది. ఆన్‌లైన్‌ లింక్‌ రూపొందించాలని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే జమ్ముకశ్మీర్‌ తరఫున హాజరైన న్యాయవాదుల కౌన్సిల్‌ తాము ఆన్‌లైన్‌ లింక్‌ రూపొందించామని, కానీ అది పనిచేయడం లేదని తెలిపింది.

జరిమానా మొత్తాన్ని నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీలో డిపాజిట్ చేయాలని జస్టిస్‌ దీపక్‌ గుప్త, జస్టిస్‌ హేమంత్‌ గుప్తలతో కూడిన ధర్మాసనం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత ఉంటుందని తెలిపింది. మధ్యాహ్న భోజన పథకం దేశంలో ఎంతో మంది చిన్నారులకు ఉపయోగపడుతోందని అయితే పలు రాష్ట్రాలు దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ధర్మాసనం పేర్కొంది. పిల్లల వివరాలు సరిగ్గా అందడం లేదని, ఆహార ధాన్యాలు మాయమవుతున్నాయని, పాఠశాలలకు సరిగ్గా చేరడం లేదని, దీని వల్ల పిల్లలకు ఈ పథకం ప్రయోజనం సరిగ్గా కలగడంలేదని పలు పిటిషన్లు దాఖలైనట్లు తెలిపింది. పథకం అమలు కోసం సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ కొన్ని రాష్ట్రాల నుంచి సరైన సహకారం అందడం లేదని ధర్మాసనం పేర్కొంది.

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

fund diversion superstar CBN akariki santi poragalla madhyanam bhojanam paisal  ni kuda diver chesi vuntadu

 

Ratstra prayojanala kosam... pillallo obesity ane topic pina monna united nations ki poyinapudu got briefed anta... as a remedy afternoon meals stopped anta...

Link to comment
Share on other sites

Abbo laksha rupale ippudu ma bolli babu ippudu kendram nayavanchana diksha ani shuru chestam idi anyayam asale deficit la unna state ippatikippudu laksha rupayalu ekkadikeli tevali oka pani chestam aamoda broadcasting abn channel la isuka ralu ammakaniki pedtam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...