Jump to content

ఆ పిల్లోడిని అలా రాయమంది నేనే.. నేనే...


chakram_fruit

Recommended Posts

 

భాక్రానంగల్ ఆనకట్ట గురించి రాయమని ఒక పరీక్షలో ప్రశ్న అడిగారు..

ఓ విద్యార్థి ఇలా రాశాడు..

బాక్రానంగల్ సట్లేజ్ నదిపై కలదు..

సట్లేజ్ నది పంజాబ్ లో ఉంది..

పంజాబ్ లో సర్దార్లు ఉంటారు..

సర్దార్ పటేల్ కూడా ఒక సర్దారే..

పటేల్ ని ఉక్కు మనిషి అని అంటారు..

ఉక్కును టాటా కంపెనీ చేస్తోంది..

టాటాను చేతులతో చెప్తారు..

పరిపాలన పాలకుల చేతిలో ఉంటుంది..

జవహర్ నెహ్రూ కు పాలన ఎవరో బాగా తెలిసినవాళ్లు నేర్పారు..

జవహర్ నెహ్రూను పిల్లలు చాచా అని పిలుస్తారు..

చాచాగారికి గులాబీ ఇష్టం..

గులాబీలను 3 విధాలుగా వాడుతుంటారు. అవి శరబత్ రూపంలో, పూల రూపంలో, గుల్కన్ లో..

గుల్కన్ చాలా తియ్యగా ఉంటుంది..

చక్కెర కూడా చాలా తియ్యగా ఉంటుంది..

చక్కెర అంటే చీమలకు చాలా ఇష్టం..

ఏనుగు కు చీమలంటే భయం..

లండన్ ఏనుగులు చాలా పెద్దవి..

లండన్, జర్మనీ పక్కపక్కనే ఉంటాయి..

జర్మనీలో యుద్ధాలు జరుగుతుంటాయి..

వాటిని ఇంగ్లీషులో వారని అంటారు..

వారాలు 8, అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఇంకోటి పోలవారం..

వరల్డ్ వారు చాలా భయంకరంగా ఉంటుంది..

సింహం కూడా భయంకరంగా ఉంటుంది..

సింహం చూస్తే ఎవరికైనా మనసులో భయం వేస్తుంది..

మనసు చాలా చంచలం..

చంచల ఇప్పుడు నా వెనక కూర్చుని ఉంది..

చంచల హిందీ హీరోయిన్ మధుబాల చెల్లెలు..

ముఘల్ ఏ అజమ్ సినిమా లో మధుబాలది చాలా శక్తివంతమైన పాత్ర..

శక్తి మన పిడికిలి లో ఉంది..

పంజాబీలు పిడికిలి బిగించారు అంటే కొట్లాటకు సిద్ధంగా ఉన్నామని అర్థం..

పంజాబీలు పంజాబ్ లో ఉంటారు..

పంజాబ్ లోనే సట్లేజ్ నది ఉంది..

బాక్రానంగల్ ఆనకట్ట సట్లేజ్ నదిపై ఉంది..

పాపం ఇది చదివిన టీచర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు...

ఆ టీచర్ ని పరామర్శించిన విజనరీ బాబు ఆ టీచర్ తో ఏమన్నాడో తెల్సా...

"ఆ పిల్లోడిని అలా రాయమంది నేనే.. నేనే..." అని అన్నాడు.. 😝😝😝😝😝

-Forwarded as received

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...