Jump to content

రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి


snoww

Recommended Posts

రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి
కేసీఆర్‌
10080815BRK142-KCR.JPG

హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన తొలి సమీక్ష నిర్వహించారు. మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌తో పాటు పలువురు అధికారులు, ఇంజినీర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎక్కడా అలసత్వం, జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. సీతారామ, శ్రీరామ సాగర్ పునరుజ్జీవం పథకం పనులు మందకొడిగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు. అందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు రెండు రోజుల పాటు నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని ఈ సమావేశంలో సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలను, పంపుహౌజ్‌లను మంగళవారం సందర్శించనున్నారు. అనంతరం మరో రోజు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులను కూడా పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగాలని.. వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదని.. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజ్‌ల నిర్మాణాల్లో వేగం పెరగాలన్నారు.

మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన రూ.11వేల కోట్ల నిధుల సేకరణ పూర్తయిందని.. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం తగదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు చేస్తున్న గుత్తేదార్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులను మే నాటికి పూర్తి చేస్తామని గుత్తేదార్లు హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

Link to comment
Share on other sites

4 hours ago, AverageDesiGuy said:

Why is Harish anna not in this meeting?

may be because of this

సీఎం వద్దే నీటిపారుదల, రెవెన్యూ? 
నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రెవెన్యూ శాఖ నిర్వహించిన మహమూద్‌ అలీకి ఇప్పటికే హోంశాఖను కేటాయించారు. నీటిపారుదల శాఖను తన వద్దే ఉంచుకొని ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ప్రాజెక్టులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని శనివారం జరిగిన నీటిపారుదల సమీక్ష సమావేశంలోనూ స్పష్టంచేసినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

4 hours ago, AverageDesiGuy said:

Why is Harish anna not in this meeting?

 

29 minutes ago, snoww said:

may be because of this

సీఎం వద్దే నీటిపారుదల, రెవెన్యూ? 
నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ముఖ్యమంత్రి తన వద్దనే ఉంచుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రెవెన్యూ శాఖ నిర్వహించిన మహమూద్‌ అలీకి ఇప్పటికే హోంశాఖను కేటాయించారు. నీటిపారుదల శాఖను తన వద్దే ఉంచుకొని ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ప్రాజెక్టులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని శనివారం జరిగిన నీటిపారుదల సమీక్ష సమావేశంలోనూ స్పష్టంచేసినట్లు తెలిసింది.

Another fake news...

Don’t forget Harish Rao hasn’t been appointed as a minister in the new govt yet, so official meeting kabatti attend avvaledemo.

Link to comment
Share on other sites

9 minutes ago, reality said:

 

Another fake news...

Don’t forget Harish Rao hasn’t been appointed as a minister in the new govt yet, so official meeting kabatti attend avvaledemo.

lets hope so.

Harish Rao deserves irrigation ministry for all the hardwork he did. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...