Jump to content

Some terrific life lessons from CBN himself


psycopk

Recommended Posts

While i agree with what he says, i personally cannot work like that man. Very disciplined eating, life style and time management...Too ambitious. Life is worth chilling every now and then. %$#$

At the same time, i don't wanna be chilling too much like KCR either @3$%

For me, YSR is in between. Family, friends and professional balance.  

Link to comment
Share on other sites

3 minutes ago, Pichekkistha said:

While i agree with what he says, i personally cannot work like that man. Very disciplined eating, life style and time management...Too ambitious. Life is worth chilling every now and then. %$#$

At the same time, i don't wanna be chilling too much like KCR either @3$%

For me, YSR is in between. Family, friends and professional balance.  

Image result for brahmi gifs

Link to comment
Share on other sites

32 minutes ago, DaleSteyn1 said:

what i am saying i invented phn ,i invented laptop i am technology 

Latest ... I also invented Weather monitoring technology which can control oceans , stop cyclones , Count number of electricity poles which will fall etc

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Latest ... I also invented Weather monitoring technology which can control oceans , stop cyclones , Count number of electricity poles which will fall etc

భారత వాతావరణ విభాగం(ఐఎండీ) కంటే తన టెక్నాలజీయే గ్రేట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు నాయుడి మానసికస్థితి బాగాలేక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ‘ చంద్రబాబు నాయుడు తన  టెక్నాలజీతో భవిష్యత్తులో తుపాను ఎక్కడ వస్తుందని చెప్పడమే కాకుండా కరెంట్‌ స్థంబాలు ఎన్ని ఒరుగుతాయి, ఎన్ని చెట్లు విరుగుతాయి, ఎన్ని ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయని ముందే చెబుతారట. తుపాన్లను కంట్రోల్‌ చేయడం కోసం తీరం వెంబడి గోడ కడతారంట. పెథాయ్‌ వల్ల భూగర్భ జలాలు పెరిగాయంట. అయ్యో చంద్రబాబు గారు.. మానసిక రుగ్మతలన్నీ ఓకేసారి తిరగబడ్డాయా ఏంటి? ఇలా మాట్లాడితే అమెరికాలోని మెంటల్‌ హస్పిటల్‌లో చేర్పిస్తారు’  అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.(ఐఎండీ కంటే.. నా టెక్నాలజీనే గ్రేట్‌)

చంద్రబాబు నాయుడు మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని తాను అందుబాటులోకి తెచ్చానని గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఫెథాయ్‌ తుపాను యానాం- తుని మధ్య తీరం దాటుతుందని తాను తెచ్చిన టెక్నాలజీ వల్లే సాధ్యమైందని ఊదరగొట్టారు. అంతే కాకుండా ఓ అడుగు ముందుకేసి భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో చెప్పడమే కాదు, ఎన్ని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో కూడా చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్నారు.

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

Latest ... I also invented Weather monitoring technology which can control oceans , stop cyclones , Count number of electricity poles which will fall etc

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కంటే తన టెక్నాలజీయే గ్రేట్‌ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇస్రోతో కలిసి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చానని చెప్పారు. తాను తెచ్చిన అవేర్‌ వ్యవస్థ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందన్నారు. పెథాయ్‌ తుపాను కాకినాడ – ఒంగోలు మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేయగా, తాను తెచ్చిన టెక్నాలజీ యానాం – తుని మధ్య అని చెప్పగలిగిందన్నారు. పెథాయ్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెంలోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న నిర్వాసితులను పరామర్శించారు.

ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘భవిష్యత్తులో తుపాన్లు ఎప్పుడు వస్తాయి? వాటి తీవ్రత ఎలా ఉండబోతుంది? ఎక్కడ తీరం దాటుతుందో చెప్పడమే కాదు. ఎన్ని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లు కూలిపోతాయి? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏ మేరకు నష్టం వాటిల్లబోతుందో కూడా చెప్పగలిగే స్థాయిలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. కోనసీమలో 22 ఏళ్ల క్రితం వచ్చిన తుపాను మొదలుకొని లైలా, హుద్‌హుద్, ఇటీవల తిత్లీ వరకూ అన్ని భారీ తుపాన్లనూ సాంకేతిక పరిజ్ఞానంతో తాను ఎదుర్కొన్నానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో తుపాను వచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు.  

ప్రమాణ స్వీకారానికి హాజరైతే తప్పేంటి?
రాష్ట్రాన్ని తుపాను చుట్టుముట్టిన సమయంలో కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. తాను జైపూర్‌ వెళ్లినా తన మనసంతా కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలపైనే ఉందన్నారు. ‘కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగినప్పుడు అదే జిల్లాలో ఉన్నారు. శ్రీకాకుళంలో తిత్లీ తుపాను వచ్చినప్పుడు పక్కనే విజయనగరం జిల్లాలో ఉన్నారు. అప్పుడు బాధితులను పరామర్శించడానికి వెళ్లని ప్రతిపక్ష నేతలు నన్ను విమర్శించడమా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా కోసం అడగరు, పోరాడరు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్‌ప్లాంట్, పెట్రో కెమికల్‌ కారిడార్‌ కోసం మాట్లాడరు. కరువు, తుపాన్లు వస్తే కేంద్రం డబ్బులివ్వకపోయినా పల్లెత్తు మాట అనరు. నన్ను మాత్రం విమర్శిస్తుంటారు. మొన్న హుద్‌హుద్‌.. నిన్న తిత్లీ.. నేడు పెథాయ్‌ తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నాం. ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా అడ్డుకున్నాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధాని పదవిపై తనకు ఆశలు లేవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఆ ఆలోచన కూడా లేదని చెప్పారు.

తుపాను సమయంలో నేలకొరిగిన చెట్లను తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకున్న యంత్రాంగాన్ని, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ కుమార్‌తోపాటు విశాఖ, తూర్పు గోదావరి కలెక్టర్లు ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట పాల్గొన్నారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...