Jump to content

అత్యుత్తమ వైద్యసేవల్లో మూడో స్థానంలో తెలంగాణ, ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌


snoww

Recommended Posts

ఆరోగ్యమస్తు

 

అత్యుత్తమ వైద్యసేవల్లో మూడో స్థానంలో తెలంగాణ, ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌
తొలి రెండు స్థానాల్లో నిలిచిన కేరళ, తమిళనాడు
నీతి ఆయోగ్‌ నివేదికలో వెల్లడి

26hyd-story2a_2.jpg

తెలుగు రాష్ట్రాలు వైద్య ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యానికి గుర్తింపు లభించింది. అత్యుత్తమ వైద్యసేవల్లో ముందు వరుసలో నిలిచిన తొలి 9 రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానాన్ని దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టంచేసింది. మరోవైపు తొలి తొమ్మిది స్థానాల్లో ఐదింటిలో దక్షిణాది రాష్ట్రాలే నిలవడం విశేషం.

వైద్య ఆరోగ్య రంగంలో 65కిపైగా పాయింట్లు సాధించిన రాష్ట్రాలను అత్యుత్తమ సేవలందిస్తున్నవిగా గుర్తించారు. 92 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో, 77 పాయింట్లతో తమిళనాడు రెండో స్థానంలో.. 73 పాయింట్లతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి.  పంజాబ్‌(71), కర్ణాటక(69), ఆంధ్రప్రదేశ్‌(68) రాష్ట్రాలు వరుసగా 4, 5, 6 స్థానాలు సంపాదించాయి. ఆ తర్వాత వరుసలో మణిపూర్‌(67), పశ్చిమబెంగాల్‌(66), గోవా(65) గుర్తింపు పొందాయి. మరో 10 రాష్ట్రాలు లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచాయి. 2030 నాటికి ప్రస్తుత పరిస్థితిలో పురోగమన దిశగా మార్పు సాధించాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్‌ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. తాజా నివేదికలో ఆయా సమాచారాన్నంతా పొందుపర్చింది.

* తమిళనాడులో ప్రతి లక్ష జనాభాకు 426.04 మంది ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉండగా.. ఏపీలో ఆ సంఖ్య 405.49గా నమోదైంది. తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు సుమారు 400కిపైగానే వైద్యసిబ్బంది ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.

26hyd-story2b.jpg26hyd-story2c.jpg

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ
గత నాలుగున్నరేళ్లలో వైద్యఆరోగ్య రంగాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ పేరిట పలు పథకాలను కేంద్రం అమలుచేస్తోంది. ముఖ్యంగా మాతాశిశు సంక్షేమానికి, క్షయ, హెచ్‌ఐవీ వంటి అంటువ్యాధుల నిర్మూలనకూ, జీవనశైలి వ్యాధులను అరికట్టడానికి పెద్దమొత్తంలో కేంద్రం నిధులను మంజూరుచేస్తోంది. తెలంగాణ, ఏపీలకు సుమారు రూ.1000 కోట్లకు పైగానే నిధులను కేటాయిస్తోంది. ఆయా పథకాల్లో రాష్ట్ర వాటా 40 శాతం కాగా, కేంద్రం వాటా 60 శాతం. ఇవి కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా మాతాశిశు సంక్షేమానికి పెద్దపీట వేసింది. తెలంగాణలో కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఆడశిశువు పుడితే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలను అందజేస్తోంది. గైనకాలజిస్టులు, మత్తుమందు వైద్య నిపుణులు, పిల్లల వైద్యుల నియామకాలపైనా దృష్టిసారించింది. ఫలితంగానే తెలంగాణ మెరుగైన స్థానం దక్కించుకోగలిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే నీతిఅయోగ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే తెలుగు రాష్ట్రాలు కూడా ఆ దిశగా కార్యాచరణ అమలు చేయాల్సి ఉంటుంది.

26hyd-story2d.jpg* దేశం మొత్తమ్మీద ప్రతి లక్ష జనాభాకు ప్రభుత్వ వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎం తదితర వైద్య సిబ్బంది సగటున 221 మంది ఉండగా.. కేరళలో మాత్రం 762.13 మంది ఉండడం విశేషమే. అందుకే ఇక్కడ ప్రసూతి మరణాలు దేశంలోనే అతి తక్కువగా ప్రతి లక్ష ప్రసవాలకు 46గా నమోదయ్యాయి.

* కేరళ తరహాలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియామకాలపై దృష్టిపెడితే.. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడం తెలుగు రాష్ట్రాలకు కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

26hyd-story2e.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...