Jump to content

అవి‘నీటి’ తిమింగలం


snoww

Recommended Posts

అవి‘నీటి’ తిమింగలం
31-12-2018 03:00:00
 
636818219975940836.jpg
  • మొదటి జీతం 10 వేలు... ఆస్తులు 110 కోట్లు
  • ఆర్‌డబ్ల్యూఎస్‌లో జూనియర్‌ ఉద్యోగి అవినీతి ఆర్జన
  • కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరిన వైనం
  • వెండి కంచాల్లో భోజనం... మెడ నిండా బంగారం
  • ఖరీదైన ఫోన్లలో అందమైన అమ్మాయిల ఫొటోలు
  • బీరువాల్లో కొత్త నోట్ల కట్టలు, ఖరీదైన వాచీలు
  • 85.62 ఎకరాల పొలం, 19 చోట్ల స్థలాలు, ఫ్లాట్లు
  • బస్తాల కొద్దీ నాణేలతో లక్ష్మీ పూజకు ముహూర్తం
  • ఏసీబీ సోదాలతో అక్రమాస్తుల గుట్టు రట్టు, అరెస్ట్‌
 
బంగారు ఆభరణాలు... చేతికి లక్షన్నర విలువైన గడియారం.. అత్యంత ఖరీదైన బంగళా.. బీరువాల్లో కొత్తనోట్ల కట్టలు.. భోజనానికి వెండి కంచాలు.. ఇంట్లోనే ‘మినీ థియేటర్‌’.. చివరికి బాత్‌రూమ్‌ల్లోనూ సొగసైన అద్దాలు.. ఖరీదైన సెల్‌ఫోన్లు.. వాటి నిండా అందమైన అమ్మాయిల ఫొటోలు.. తనతో పాటు తనకు సహకరించేవారు సేద తీరేందుకు 80లక్షలతో నిర్మించిన ఫామ్‌హౌస్‌.. ఓ చిరుద్యోగి భారీ అక్రమార్జన లెక్కలివి..
 
 
అమరావతి/ఏలూరు క్రైం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగంలో చేరిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కోట్లకు పడగలెత్తాడు. రూ.10వేలు మెదటి జీతంగా తీసుకొని పదేళ్లలోపే రూ.110కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. అవినీతి సొమ్మును వెండి కంచాల్లో భోంచేస్తోన్న ఆయన ఇంట్లో సోదాలకు వెళ్లిన ఏసీబీ బృందాలు బీరువాల్లో లభించిన కొత్తనోట్ల కట్టలు చూసి ఆర్‌బీఐలో ఏదైనా గదిలోకి వచ్చామా అని అనుమానించే స్థాయికి అడ్డగోలుగా సంపాదించాడు. లక్ష్మీదేవి తన ఇంట్లోనే తాండవం చేయాలనుకున్న ఈ ఉద్యోగి ఆమెను మరింత ప్రసన్నం చేసుకోవడానికి బస్తాలతో చిల్లర కాయిన్లు తెచ్చి పూజకు ముహూర్తం కూడా ఖరారు చేశాడు. ఈలోపే ఏసీబీ అధికారులు దాడిచేయడంతో జైలు పాలయ్యాడు.
 
 
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పు విప్పర్రుకు చెందిన రాంపల్లి సత్యఫణి దత్తాత్రేయ దివాకర్‌(34) అవినీతి బాగోతం ఇది. దివాకర్‌ తండ్రి మరణించడంతో కారుణ్య నియామకంలో 2009 జూన్‌ 15న చింతలపూడిలోని ఆర్‌డబ్ల్యుఎస్‌ సబ్‌ డివిజన్‌ పంచాయతీరాజ్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఏలూరు సూపరింటెండెంట్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై వచ్చి 2017 అక్టోబరు వరకు పనిచేశాడు. అక్కడి నుంచి దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లిపోయాడు. ఈ పనిచేసిన కాలంలోనే దివాకర్‌ అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. జిల్లాలోని పాలంగి, భీమోలు, వేల్పూరు, తణుకు, జంగారెడ్డిగూడెం, కంతేరులో అతని పేరిట, అతడి బంధువుల పేరిట ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
 
 
స్వాధీనం చేసుకున్న అక్రమాస్తులు ఇవీ...
దివాకర్‌ పేరుమీద, అతని బంధువుల పేర్ల మీద 19 ఇళ్ల స్థలాలు, నివాసగృహం, ఫామ్‌హౌస్‌, 2వ్యాపార భవనాలు, 3ఫ్లాట్లు, 85.62ఎకరాల వ్యవసాయ భూములు, ఇంట్లో 6.25లక్షల నగదు, 60వేల విలువైన విదేశీ కరెన్సీ, 3లక్షల బ్యాంకు నిల్వ, అరకేజీ బంగారం, 2లక్షల విలువైన 5కేజీల వెండి వస్తువులు, 2 ఓక్స్‌ వ్యాగన్‌ కార్లు, ఇన్నోవా, క్రెటా, ఇండిగో కార్లు ఒక్కోటి చొప్పున, హోండా యూనీకార్న్‌ మోటారు బైక్‌, హోండా యాక్టివా స్కూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవికాకుండా తణుకులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పాలంగిలోని ఐడీబీఐ బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్టు గుర్తించారు.
 
Link to comment
Share on other sites

1 hour ago, Ara_Tenkai said:

devuda... antha chinna job lo kuda antha sampadinchocha?? evadikoo binami ayyi untadu...

 

19 minutes ago, Kool_SRG said:

Emi chesukuntaru ra ayya intha inka aasaki hadhu antu ledhu.. Eedchi petti tanthe 35 ellu levu ithaniki damn

Antha chinna Vayasu lo Antha Chinna job lo antha sampadinchadu kabatte dorikipoyadu ... gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

4 minutes ago, kevinUsa said:

 ela chesado chepute kabaye Govt emp will learn kada 

 

konni days lo bail meeda bayataki vasthadu , konni months lo malli ade job lo rejoin ayyi , inkonni years lo promotion kooda koodathadu , and also andariki explain kooda chesthadu. 

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

konni days lo bail meeda bayataki vasthadu , konni months lo malli ade job lo rejoin ayyi , inkonni years lo promotion kooda koodathadu , and also andariki explain kooda chesthadu. 

agreed 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...