Jump to content

నకిలీ సైట్‌తో రవాణాశాఖకు టోపీ!


kevinUsa

Recommended Posts

ఉన్నతాధికారులకు ఫిర్యాదు

ఈనాడు, అమరావతి, కర్నూలు బీ క్యాంపు-న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ వెబ్‌సైట్‌ మాదిరే కొందరు అక్రమార్కులు నకిలీ వెబ్‌సైట్‌కు రూపమిచ్చి వాహనదారుల నుంచి సొమ్ములు కొల్లగొట్టారు. దీనిపై రవాణా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రవాణా శాఖ సేవలన్నింటినీ వాహనదారులకు ఆన్‌లైన్‌ ద్వారా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. లైసెన్సులు, వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, పన్నుల చెల్లింపు తదితరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు, సంబంధిత రుసుముల చెల్లింపునకు వీలు కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు ఇదే తరహాలో ఉండే నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించారు. కొందరు వాహనదారులు దీన్ని నమ్మి సొమ్ములు చెల్లించినా రసీదులు రాకపోవడంతో మోసపోయామని గుర్తించి రవాణాశాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేలమంది తమ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇలా చెల్లించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటి నకిలీ సైట్‌ల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వాటి సమాచారాన్ని తమకూ, పోలీసుకూ తెలియజేయాలని రవాణా శాఖాధికారులు సూచిస్తున్నారు.

నకిలీ వెబ్‌సైట్‌ చిరునామా: rtoonline.com
ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన వెంటనే పెద్ద రోడ్డు చిత్రం కనిపిస్తుంది. ఆప్లై ఆన్‌లైన్‌ అండ్‌ రిసీవ్‌ ఆల్‌ డాక్యుమెంట్స్‌ బై పోస్టు అని ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఇది పూర్తి నకిలీ వెబ్‌సైట్‌. దీనిలో ఎలాంటి చెల్లింపులు చేసినా అవి రవాణా శాఖకు చేరవు.

రవాణా శాఖ వెబ్‌సైట్‌ చిరునామా:
aprtacitizen.epragathi.org
ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు రవాణా మంత్రి అచ్చెన్నాయుడు చిత్రాలు కనిపిస్తాయి. పై భాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారిక చిహ్నం ఉంటుంది. దాని పక్కన ఆంగ్లంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రవాణా శాఖ అని ఉంటాయి. ఇది మాత్రమే నిజమైన వెబ్‌సైట్‌. చెల్లింపులన్నీ దీని ద్వారానే చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Link to comment
Share on other sites

Quote

నకిలీ వెబ్‌సైట్‌ చిరునామా: rtoonline.com
ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన వెంటనే పెద్ద రోడ్డు చిత్రం కనిపిస్తుంది. ఆప్లై ఆన్‌లైన్‌ అండ్‌ రిసీవ్‌ ఆల్‌ డాక్యుమెంట్స్‌ బై పోస్టు అని ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఇది పూర్తి నకిలీ వెబ్‌సైట్‌. దీనిలో ఎలాంటి చెల్లింపులు చేసినా అవి రవాణా శాఖకు చేరవు.

site ni down chepinchochu kada ee gola badulu. 

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

rto online ani google lo search chesthe first result ide coming 

Dhaniki konni techniques untayi , Google just a search engine .. adhi based on keywords display chesthadhi anthe

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Dhaniki konni techniques untayi , Google just a search engine .. adhi based on keywords display chesthadhi anthe

thanks vnkl, aina idi ne mark thrd kadu

Link to comment
Share on other sites

Just now, JollyBoy said:

avi elagu fake untayi kada 

Kani idhi toomuch... trinity enterprises ani edho undhi . Janalaki konchem kuda doubt raledha?

govt officials bomma lekunda site ela undhi ani ayina...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...