Jump to content

భార్య సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తే.. భర్త కాళ్లు విరగొట్టాడు!


Piracy Raja

Recommended Posts

636824751896974374.jpg

నేటి ఆధునిక యుగంలో మోడ్రన్ ట్రెండ్ బాగా విస్తరిస్తోంది. అలంకరణ విషయంలో కొత్త కొత్త ఫ్యాషన్‌ పుట్టుకొస్తోంది. అందరికంటే తాము విభిన్నంగా కనిపించాలనుకునే వాళ్లు, ఇతరులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకునే వాళ్లు వింత వింత ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే తన వస్త్రధారణతో భర్తకు స్వీట్ షాక్ ఇవ్వాలని భావించిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఫలితంగా భర్త చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రి పాలైంది.
 
 
పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ.. భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటోంది. ఓ రోజు తన భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుని.. స్నేక్ ప్రింటెడ్ లెగ్గింగ్స్ వేసుకుంది. భర్త ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆ లెగ్గింగ్స్ వేసుకుని బెడ్‌పై హాయిగా నిద్రపోయింది. బయటకు కనిపించేలా కాళ్లు చాపి, ముఖానికి మాత్రం దుప్పటి కప్పుకొంది. ఇంటికి వచ్చి నిద్రిస్తున్న భార్యను చూసిన భర్తకు గుండె జారినంత పనైంది. భార్య నిద్రిస్తున్న బెడ్‌పై రెండు పాములు ఉన్నాయని భావించి కంగారుపడ్డాడు. చప్పుడు కాకుండా బయటకు వెళ్లి బేస్‌బాల్ బ్యాట్ తీసుకొచ్చి పాము తలపై(భార్య కాళ్లు) బలంగా కొట్టాడు. దీంతో భార్య కెవ్వున కేక పెట్టింది. అది చూసి.. పామును చూసి భార్య అరుస్తుందేమో అనుకుని మరింత బలంగా కొట్టడం ప్రారంభించాడు. పాము కాదని, లెగ్గింగ్స్ అని భార్య చెప్పడంతో తేరుకుని కొట్టడం ఆపేశాడు. ఈ పరిణామానికి భార్యపై కోప్పడాలో.. కొట్టిన దెబ్బలకు జాలి పడాలో తెలియక, రక్తం కారుతున్న భార్యను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు, ఆమె కాలికి తీవ్రమైన గాయాలవడంతో కట్టుకట్టారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పీసీఐఏ(పాకిస్థానీ కమ్యునిటీ ఇన్ ఆస్ట్రేలియా) ఫేస్‌బుక్ పేజీలోని ఈ పోస్టును అనేకమంది షేర్ చేశారు. తమదైన శైలిలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, JAPAN said:

vaadiki adhi leggings ani telisi kavalane kotti vuntadu

ilanti chance andariki vasthe bagundu

@3$%@3$%

avi nijamga snake la unnayi pic lo

night time dirrct ga chuste inka anthe

Link to comment
Share on other sites

47 minutes ago, Piracy Raja said:

636824751896974374.jpg

నేటి ఆధునిక యుగంలో మోడ్రన్ ట్రెండ్ బాగా విస్తరిస్తోంది. అలంకరణ విషయంలో కొత్త కొత్త ఫ్యాషన్‌ పుట్టుకొస్తోంది. అందరికంటే తాము విభిన్నంగా కనిపించాలనుకునే వాళ్లు, ఇతరులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకునే వాళ్లు వింత వింత ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే తన వస్త్రధారణతో భర్తకు స్వీట్ షాక్ ఇవ్వాలని భావించిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఫలితంగా భర్త చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రి పాలైంది.
 
 
పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ.. భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటోంది. ఓ రోజు తన భర్తకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుని.. స్నేక్ ప్రింటెడ్ లెగ్గింగ్స్ వేసుకుంది. భర్త ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆ లెగ్గింగ్స్ వేసుకుని బెడ్‌పై హాయిగా నిద్రపోయింది. బయటకు కనిపించేలా కాళ్లు చాపి, ముఖానికి మాత్రం దుప్పటి కప్పుకొంది. ఇంటికి వచ్చి నిద్రిస్తున్న భార్యను చూసిన భర్తకు గుండె జారినంత పనైంది. భార్య నిద్రిస్తున్న బెడ్‌పై రెండు పాములు ఉన్నాయని భావించి కంగారుపడ్డాడు. చప్పుడు కాకుండా బయటకు వెళ్లి బేస్‌బాల్ బ్యాట్ తీసుకొచ్చి పాము తలపై(భార్య కాళ్లు) బలంగా కొట్టాడు. దీంతో భార్య కెవ్వున కేక పెట్టింది. అది చూసి.. పామును చూసి భార్య అరుస్తుందేమో అనుకుని మరింత బలంగా కొట్టడం ప్రారంభించాడు. పాము కాదని, లెగ్గింగ్స్ అని భార్య చెప్పడంతో తేరుకుని కొట్టడం ఆపేశాడు. ఈ పరిణామానికి భార్యపై కోప్పడాలో.. కొట్టిన దెబ్బలకు జాలి పడాలో తెలియక, రక్తం కారుతున్న భార్యను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు, ఆమె కాలికి తీవ్రమైన గాయాలవడంతో కట్టుకట్టారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పీసీఐఏ(పాకిస్థానీ కమ్యునిటీ ఇన్ ఆస్ట్రేలియా) ఫేస్‌బుక్ పేజీలోని ఈ పోస్టును అనేకమంది షేర్ చేశారు. తమదైన శైలిలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

He used the chance for his complete advantage. Now he can happily blame it on his wife.. smart ass🤣🤣

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...