Jump to content

Gannavaram to Dubai flights by March end


psycopk

Recommended Posts

2 hours ago, AndhraneedSCS said:

Emirates flight kakapothe malli bokke ga US nundi velladaniki

 

Atlanta nunchi Dubai ki oka flight epinchandi 

Air india have codeshare with emirates 

indigo ki ledu 

Ippudu naku idi vunna leka poyina ok 

chicago delhi fligjt ki vijayawada estension saripoddi 

okappudu delta vundedhi atlanta dubai 

janalu leka cancel ayyindi 

Link to comment
Share on other sites

4 minutes ago, manadonga said:

Air india have codeshare with emirates 

indigo ki ledu 

Ippudu naku idi vunna leka poyina ok 

chicago delhi fligjt ki vijayawada estension saripoddi 

okappudu delta vundedhi atlanta dubai 

janalu leka cancel ayyindi 

Direct Vijayawada ayithey better Delhi antey no use in terms of time

Link to comment
Share on other sites

2 hours ago, AndhraneedSCS said:

Singapore flight occupany entha untundo evarikaina telusa?

Looks like Singapore Flight is running with 90% occupancy. No cost to AP government for this flight. Hopefully, this will boost Dubai flight prospects 

 

 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

Looks like Singapore Flight is running with 90% occupancy. No cost to AP government for this flight. Hopefully, this will boost Dubai flight prospects 

 

 

Singapore lo manollu antha mandi unnara. 90% occupancy every flight is no joke

Dubai padithe pakka 100%... No Hyd inka

Link to comment
Share on other sites

Only 2 flights a week currently. Maybe they will expand the service frequency as people book travel ahead of time and this service managed to get 90% occupancy since the beginning.

 

not sure, how much of it is holiday period (Christmas, new year, Pongal)

Link to comment
Share on other sites

ఆరెండే.. అడ్డంకి
 

కోడ్‌ షేరింగ్‌ లేకపోవడంతో ఇబ్బందులు
సింగపూర్‌ వీసాలు వస్తే మరింత రద్దీ
గన్నవరానికి భారీగా అంతర్జాతీయ డిమాండ్‌
ఈనాడు అమరావతి

amr-gen2a_44.jpg

గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించడానికి అంతర్జాతీయ ప్రయాణికులు అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం వారానికి రెండు సర్వీసుల చొప్పున ఇక్కడి నుంచి సింగపూర్‌కు వెళుతున్నాయి. అదే సమయంలో అటునుంచి సైతం రెండు సర్వీసులు వస్తున్నాయి. ఈ సర్వీసుల టిక్కెట్లకు మంచి డిమాండ్‌ ఉంటోంది. అయితే.. ఇంకా కొన్ని సమస్యలు అంతర్జాతీయ ప్రయాణికులను వేధిస్తున్నాయి. దాంతో ఇక్కడ వాస్తవంగా ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రయాణికులు రాకపోకలు సాగించడం లేదు. గన్నవరం నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రస్తుతం సింగపూర్‌కు సేవలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కోడ్‌ షేరింగ్‌ వ్యవస్థ ఇండిగోకు లేదు. అంతర్జాతీయ ప్రయాణికులను ఇది ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికితోడు సింగపూర్‌ వీసాల సమస్య కూడా ఉంది. సింగపూర్‌ విమానాశ్రయంలో ఆన్‌అరైవల్‌ వీసాలను ఇవ్వడం లేదు. దీంతో వీసా కోసం దరఖాస్తు చేసుకుని కొంతకాలం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ రెండింటి వల్లే.. ప్రస్తుతానికి డిమాండ్‌ భారీగా ఉన్నా.. గన్నవరం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పరిమితంగా ఉంటోంది. గతం కంటే అనూహ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. వాస్తవ డిమాండ్‌తో పోలిస్తే.. ఇది చాలా తక్కువ.

గన్నవరం నుంచి సింగపూర్‌కు సర్వీసులు నడుపుతున్న ఇండిగో సంస్థకు ఇతర విమానయాన సంస్థలతో కోడ్‌ షేరింగ్‌ ఒప్పందం లేదు. ఎయిరిండియా మాదిరిగా కోడ్‌ షేరింగ్‌ ఉంటే.. ఎమిరేట్స్‌, సిల్క్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిరేసియా వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో ఒప్పందం ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా ఏ దేశానికి వెళ్లాలన్నా లగేజీని గన్నవరంలోనే ఇచ్చేసి, ఇక్కడే బోర్డింగ్‌ పాస్‌ తీసుకుంటే సరిపోతుంది. సింగపూర్‌ విమానాశ్రయంలో దిగి.. లగేజీ, బోర్డింగ్‌ పాస్‌తో సంబంధం లేకుండా నేరుగా వెళ్లి మరో సర్వీసును అందుకుని.. ఆయా దేశాలకు చేరుకోవచ్చు. గమ్యస్థానం చేరాక.. మళ్లీ లగేజీని తీసుకుని వెళ్లిపోవచ్చు. విమానయాన సంస్థల మధ్య ఆమేరకు ఒప్పందం ఉండి.. లగేజీని మార్చుకుంటాయి. ఇండిగోకు కోడ్‌షేరింగ్‌ అనుమతి లేకపోవడంతో ప్రస్తుతం సింగపూర్‌ విమానాశ్రయంలో దిగి అక్కడ మళ్లీ లగేజీ, బోర్డింగ్‌ పాస్‌ తీసుకుని వెళ్లాలి. ఇది.. అంతర్జాతీయ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించే అంశం. అందుకే.. ఇప్పటికీ చాలామంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళుతున్నారు.

కోడ్‌ షేరింగ్‌ ఉన్న సర్వీసులొస్తే.. : కోడ్‌ షేరింగ్‌ అనుమతి ఉన్న విమానయాన సంస్థల సర్వీసులు ప్రారంభమైతే.. గన్నవరం నుంచి ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతుంది. అప్పుడు వారానికి రెండు సర్వీసులు ఏమాత్రం చాలవు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీకి రోజూ సర్వీసులు నడిపినా సరిపోయేంత డిమాండ్‌ ఉంటుంది. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌లో విమానం ఎక్కే ముందే.. తమ లగేజీని అప్పగించేస్తున్నారు. మళ్లీ వాళ్లు తమ గమ్యస్థానం చేరాకే దానిని తీసుకుంటున్నారు. మధ్యలో మరో దేశంలో దిగి విమానం మారి.. వెళ్లాల్సి వచ్చినా.. లగేజీతో సంబంధం లేకుండా వెళ్లిపోతున్నారు. కోడ్‌షేరింగ్‌ ఒప్పందం ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థల సర్వీసులు ఇక్కడి నుంచి ఆరంభమైతేనే.. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...