Jump to content

Gannavaram to Dubai flights by March end

psycopk

Recommended Posts

దుబాయ్‌ కల నెరవేరుతోంది
 
త్వరలోనే ప్రారంభించేందుకు యత్నాలు
సింగపూర్‌ సర్వీసు మాదిరిగానే ప్రయోగం
ఈనాడు, అమరావతి

amr-gen1a_57.jpg

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవాలనేది ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ. కనీసం దుబాయి, సింగపూర్‌ దేశాలకైనా తొలుత సర్వీసులను ఆరంభించాలంటూ చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ఎట్టకేలకు సింగపూర్‌కు గత నెల నుంచి ఆరంభమైన సర్వీసులతో ఆ కల తీరింది. వారంలో   రెండు రోజులు సర్వీసులు నడుస్తున్నాయి. వాటికి రద్దీ సైతం ఉంటోంది. త్వరలో ఆ మిగతా కల కూడా నెరవేరబోతోంది. దుబాయికి సైతం సర్వీసులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. విమానయాన సంస్థలతో మాట్లాడి దుబాయికి సర్వీసును ఆరంభించేందుకు అవసరమైన చర్యలను తాజాగా చేపడుతోంది. దీంతో మరో ఒకటి రెండు నెలల్లో దుబాయి విమానం గాలిలోనికి ఎగరబోతోంది.

గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి అంతర్జాతీయ సర్వీసు ఆరంభమైతే.. ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరబోతోంది. చుట్టుపక్కల నాలుగు జిల్లాలకు చెందిన అంతర్జాతీయ ప్రయాణికులు.. నేరుగా దుబాయికి వెళ్లి.. అక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు ప్రధానంగా ఉపకరించే అంశమిది. దుబాయి విమానం ఏర్పాటు కోసం ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం నడుస్తున్న సింగపూర్‌ సర్వీసు మాదిరిగానే.. దుబాయికి సైతం తొలుత వారంలో రెండు రోజులు సర్వీసులు ప్రారంభించాలనేది ఆలోచన. దీనికోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు సైతం పెద్దఎత్తున మద్దతు లభించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ), అంగీకారం తెలిపే విమానయాన సంస్థల మధ్య ఒప్పందం కుదరబోతోంది. దీనికి సంబంధించిన టెండర్లను సైతం ఈ నెలాఖరులో పిలవనున్నారు. టెండర్లలో పాల్గొనే విమానయాన సంస్థలు తెలిపే అంగీకారం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం సింగపూర్‌కు సర్వీసులు నడుపుతున్న ఇండిగో సంస్థ, లేదంటే మరో విమానయాన సంస్థను ఎంపిక చేసి.. దుబాయికి సర్వీసులను ఆరంభించనున్నారు.

ప్రపంచంలో ఎక్కడికైనా..
దుబాయికి సర్వీసులు ఆరంభమైతే.. ప్రపంచంలోని ఏ మూలకైనా తేలికగా చేరుకునే సౌకర్యం ఇక్కడి వారికి అందుబాటులోనికి వస్తుంది. గన్నవరం నుంచి నేరుగా దుబాయికి చేరుకుని.. అక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయేలా ప్రపంచమంతటికీ దుబాయితో అనుసంధానం ఉంది. పైగా.. దుబాయిలో చదువుకునేందుకు సైతం పెద్దఎత్తున విద్యార్థులు ఇక్కడి నుంచి వెళుతున్నారు. వారితోపాటూ పర్యాటకంగా చూపి వచ్చేందుకు ఏటా వేల మంది దుబాయికి వెళ్లి వస్తున్నారు. ఇలాంటి వారందరికీ దుబాయి సర్వీసు ఆరంభమైతే.. చాలావరకూ కష్టాలు తీరినట్టే. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలికవసతులు సిద్ధంగా ఉన్నాయి. గతంలో మాదిరిగా.. వాయిదాలు వేయాల్సిన పనిలేదు. ఒకసారి ఒప్పందం కుదిరిన వెంటనే ఎంపికైన విమానయాన సంస్థ నేరుగా టిక్కెట్ల విక్రయాన్ని ఆరంభించుకోవచ్చు. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ సహా అన్ని వ్యవస్థలూ ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశారు.

Link to comment
Share on other sites

Quote

Looks like Singapore Flight is running with 90% occupancy.

Don't know in what world it is calculated as 90% occupancy out of 180 seats

ప్రయాణికుల రద్దీ ఇలా.. 
సింగపూర్‌ నుంచి గన్నవరం వచ్చే సర్వీసుల్లో డిసెంబరు నాలుగో తేదీన 170మంది, ఆరున 165, 11న 177, 13న 168మంది ప్రయాణికులు వచ్చారు. అదే సమయంలో విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4న 86, 6న 42, 11న 86, 13న 68 మంది వెళ్లారు. జనవరి నెలారంభం నుంచి అనూహ్యంగా ఇటునుంచి రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు జనవరి 1న 180, 3న 178, 8న 153, 10న 155 మంది ప్రయాణికులు వెళ్లారు. సింగపూర్‌ నుంచి జనవరి 1న 81, 3న 88, 8న 80, 10న 128మంది ప్రయాణికులు విజయవాడకు వచ్చారు. అమెరికా, చైనా, జపాన్‌, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, ఉక్రెయిన్‌, జర్మనీ లాంటి దేశాలకు వెళ్లేవాళ్లంతా గన్నవరం నుంచి నేరుగా సింగపూర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి తేలికగా వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయే వీలుంది. ఇలాంటి వారంతా ప్రస్తుతం సింగపూర్‌ సర్వీసును వినియోగించుకుంటున్నట్టు ముత్తవరపు మురళీకృష్ణ తెలిపారు.

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

@Android__Halwa bro. Help me in understanding this bcom lo physics maths. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...