Jump to content

అమరావతిలో మరో 7 ఫైవ్‌స్టార్‌ హోటళ్లు


snoww

Recommended Posts

అమరావతిలో మరో 7 ఫైవ్‌స్టార్‌ హోటళ్లు 
19-01-2019 00:56:35
 
636834820889391255.jpg
  •  వెంకటపాలెంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు
  •  సీఆర్‌డీఏ అధికారుల సమీక్షలో చంద్రబాబు
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఎన్ని హోటళ్ల గదులొస్తే రాజధానిలో అంత త్వరగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విమానయాన సేవలు, కళాశాలలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లే కొత్త నగరాల భవితవ్యాన్ని నిర్దేశించే వనరులన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో 7 ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు భూకేటాయింపు ధృవీకరణ లేఖలు అందించారు. జీవీ ఎస్టేట్‌ అండ్‌ హోటల్స్‌ (వివెంటా), ఓంశ్రీ భావనసాయి ఎల్‌ఎల్‌పీ (వెస్ట్‌ఇన్‌), సదరన్‌ ట్రావెల్స్‌ (మారియెట్‌), కాంథారి హోటల్స్‌ (ఫార్చ్యూన్‌), అంబికా అగరబత్తీస్‌ అరోమా (రెజెంటా ఇన్‌), స్ప్లెండర్‌ ల్యాండ్‌ బేస్‌ (జింజర్‌), స్వాగత్‌ మోటార్స్‌ (కీస్‌ సెలెక్ట్‌) ఇందులో ఉన్నాయి. దీంతో రాజధానిలో నిర్మాణమయ్యే హోటళ్ల సంఖ్య 16కు చేరింది. రాజధానిలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌)ను గ్యాస్‌, వాటర్‌, విద్యుత్‌, రోడ్‌, ఫైబర్‌గ్రిడ్‌ తరహాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ (డీసీఎస్‌) ఏర్పాటు అంశంపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఒక ఉన్నతస్థాయి బృందం కొద్దిరోజుల కిందట ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ఉన్న దుబాయ్‌ మెట్రోలోను, అబుదాబిలోని ఎతిహాద్‌ టవర్స్‌లోనూ ఈ వ్యవస్థను ఇప్పటికే వీరు విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 40 వేల టన్నుల సామర్థ్యంతో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న డీసీఎస్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థగా నిలుస్తుందని చెప్పారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి తెలిపారు.
 
1.4 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ పార్కు..
రాజధాని గ్రామమైన వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు నిర్మాణాన్ని చేపట్టాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 1,41,000 చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాతో చేపట్టే ఐటీ పార్కులో 10 లక్షల చదరపు అడుగుల వరకు ఆఫీసు స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఇందులో సగ భాగం వాణిజ్యపరమైన కేటాయింపులకు పోను, మిగిలిన సగభాగాన్ని దిగ్గజ సంస్థల కోసం అందుబాటులో ఉంచుతామని సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ కోసం ఫోస్టర్‌ ఫ్లస్‌ పార్టనర్స్‌ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. హ్యాపీనెస్ట్‌ సిరీస్‌లో భాగంగా రెండో ప్రాజెక్టు చేపట్టాలన్న ప్రతిపాదనపై సమావేశం ఆమోదం తెలిపింది. ఐనవోలు దగ్గర మొత్తం 1704 ప్లాట్లు, 12 బ్లాకులుగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రాజధానిలో 150 ఎకరాల్లో నిర్మాణ రంగ నగర నిర్మాణాన్ని చేపట్టేందుకు సమావేశంలో ప్రాథమిక అనుమతి లభించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీ్‌షచంద్ర, సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

7 minutes ago, Spartan said:

7 star

శుక్రవారం సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో 7 ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు భూకేటాయింపు ధృవీకరణ లేఖలు అందించారు. జీవీ ఎస్టేట్‌ అండ్‌ హోటల్స్‌ (వివెంటా), ఓంశ్రీ భావనసాయి ఎల్‌ఎల్‌పీ (వెస్ట్‌ఇన్‌), సదరన్‌ ట్రావెల్స్‌ (మారియెట్‌), కాంథారి హోటల్స్‌ (ఫార్చ్యూన్‌), అంబికా అగరబత్తీస్‌ అరోమా (రెజెంటా ఇన్‌), స్ప్లెండర్‌ ల్యాండ్‌ బేస్‌ (జింజర్‌), స్వాగత్‌ మోటార్స్‌ (కీస్‌ సెలెక్ట్‌) ఇందులో ఉన్నాయి. దీంతో రాజధానిలో నిర్మాణమయ్యే హోటళ్ల సంఖ్య 16కు చేరింది.

Link to comment
Share on other sites

1704 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్‌-2

 

సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో సీఆర్‌డీఏ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్‌-1కి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో.... ఇప్పుడు హ్యాపీనెస్ట్‌-2 పేరుతో మరో ప్రాజెక్టు చేపట్టనుంది. ఐనవోలు సమీపంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో సీఆర్‌డీఏ 1704 ఫ్లాట్లు నిర్మిస్తుంది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో ఐటీ పార్కు నిర్మాణానికి, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌కి అనుబంధంగా అడ్వకేట్‌ బ్లాక్‌ నిర్మాణానికి, పరిపాలన నగరానికి సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించిన ప్రణాళిక లేఅవుట్‌కి ఆమోదముద్ర వేశారు. 150 ఎకరాల్లో నిర్మాణరంగ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు సంబంధించి రూపొందించిన క్వాలిటీ కంట్రోల్‌ మాన్యువల్‌ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 
హ్యాపీనెస్ట్‌-2 ప్రాజెక్టుని సీఆర్‌డీఏ 16.05 ఎకరాల్లో చేపడుతుంది. మొత్తం 12 అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లు ఉంటాయి. రూ.1150 కోట్లతో 23 అంతస్తులుగా నిర్మిస్తారు. 1290, 1590, 1890, 2190 చ.అడుగులు విస్తీర్ణంలో నాలుగు కేటగిరీల ఫ్లాట్లు ఉంటాయి. 
రాజధానిలో ఐదు నక్షత్రాల హోటళ్లు రెండు, నాలుగు నక్షత్రాల హోటల్‌ ఒకటి, మూడు నక్షత్రాల హోటళ్లు మూడు ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి భూ కేటాయింపు పత్రాలు (ఎల్‌ఓఏ) అందజేశారు. వీటితో కలిపి ఇంతవరకు భూకేటాయింపులు జరిపిన హోటళ్ల సంఖ్య 16కి చేరింది. చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని హోటల్‌ గదులు వస్తే అంత త్వరగా రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని తెలిపారు. 
రాజధాని అమరావతిలో గ్యాస్‌, వాటర్‌, విద్యుత్‌, ఫైబర్‌ గ్రిడ్‌ తరహాలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. దీనిని 40 వేల టన్నుల సామర్థ్యంతో ప్రతిపాదించామని, ఇది దేశంలోనే రెండో అతి పెద్దదిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. 
వెంకటపాలెం సమీపంలో రూ.448 కోట్లతో 15 అంతస్తులతో 14.21 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన ఐటీ పార్కుని నిర్మిస్తారు. వాణిజ్యపరమైన అవసరాలకు, దిగ్గజ ఐటీ సంస్థలకు అందుబాటులో ఉంచుతారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 
రాజధానిలో తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నిర్మిస్తున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనానికి అనుబంధంగా రూ.23.15 కోట్లతో అడ్వకేట్‌ బ్లాక్‌ నిర్మిస్తారు. 140ఛాంబర్లు, 16 దుకాణాలు ఉంటాయి. 
నిర్మాణరంగానికి అవసరమైన యంత్రాలు, సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాలు, సేవలు వంటివన్నీ ఒకే చోట లభించేలా నిడమర్రులో రూ. వెయ్యి కోట్ల అంచనాతో 150 ఎకరాల్లో నిర్మాణ నగరాన్ని నిర్మించనున్నారు. 
రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల్ని చూసేందుకు ప్రస్తుతం రోజుకి 4 వేల మంది చొప్పున వస్తున్నారని, శనివారం నుంచి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి పి.నారాయణ వెల్లడించారు. నిత్యం 10వేల మంది సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషనర్‌ శ్రీధర్‌ వివరించారు.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నివారణకు గ్రీన్‌ ఛానల్‌ 
రాజధానిలో మౌలిక వసతుల పనులు చేస్తున్న సంస్థలకు బిల్లుల చెల్లింపునకు గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటు చేయాలని, జాప్యం లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Link to comment
Share on other sites

ABN Version :

Quote

అమరావతిలో మరో 7 ఫైవ్‌స్టార్‌ హోటళ్లు 

Eenadu version :

Quote

రాజధానిలో ఐదు నక్షత్రాల హోటళ్లు రెండు, నాలుగు నక్షత్రాల హోటల్‌ ఒకటి, మూడు నక్షత్రాల హోటళ్లు మూడు ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి భూ కేటాయింపు పత్రాలు (ఎల్‌ఓఏ) అందజేశారు. 

 

Link to comment
Share on other sites

1 minute ago, tacobell fan said:

CC @boeing747 uncle road side bits antundhi deenike na

Taco ga, last week I was there. Venkatapalem and penumaka side chusa but acre min 3+cr cheptunnaru..me and a friend kalsi oka 40cents teeskundam ani plan if it comes at 1cr+..but kudarla, now shifting towards kuragallu and surroundings

Link to comment
Share on other sites

1 minute ago, boeing747 said:

Taco ga, last week I was there. Venkatapalem and penumaka side chusa but acre min 3+cr cheptunnaru..me and a friend kalsi oka 40cents teeskundam ani plan if it comes at 1cr+..but kudarla, now shifting towards kuragallu and surroundings

Yes, go towards Nekallu or Kuragallu, you will get it. I can share numbers if you want to talk.

Link to comment
Share on other sites

2 minutes ago, boeing747 said:

Taco ga, last week I was there. Venkatapalem and penumaka side chusa but acre min 3+cr cheptunnaru..me and a friend kalsi oka 40cents teeskundam ani plan if it comes at 1cr+..but kudarla, now shifting towards kuragallu and surroundings

kurrugaaa 

montain house lo 60 acres 1.5 million anta

kontaavaa ? Sacramento ki SFO ki madyalo ... 

Link to comment
Share on other sites

Just now, tacobell fan said:

Yes, go towards Nekallu or Kuragallu, you will get it. I can share numbers if you want to talk.

Thanks bro, will definitely ask when i need any help...right now couple of sources thru veltunna

Link to comment
Share on other sites

1 minute ago, Undavalli said:

world trade centre kuda vastondi antadu

Ankul, nuvu supreme Court lo case esav ga, that AP and TG split sarigga avvaledu, assembly lo pass avaledu ani...ekkadidaka vachindi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...