Jump to content

అమెరికాలో భారతీయుడి మోసం


snoww

Recommended Posts

అమెరికాలో భారతీయుడి మోసం 

 

400 మందికిపైగా ఖాతాదారుల నుంచి రూ.5.6 కోట్లు వసూలు

వాషింగ్టన్‌: అమెరికాలో ఆర్థిక మోసాలకు పాల్పడిన ఆరోపణలపై ఓ భారతీయుడు అరెస్టయ్యాడు. రూ.5.6 కోట్లకుపైగా డబ్బును బాధితుల నుంచి అతడు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. మోసపోయినవారిలో అత్యధికులు భారత సంతతి ప్రజలే కావడం గమనార్హం. కిశోర్‌ బాబు అమ్మిశెట్టి 2013లో విద్యార్థి వీసాపై అమెరికాలో ప్రవేశించాడు. అతడి వయసు 30 ఏళ్లు. 2014లోనే అతడి వీసాను కొట్టివేశారు. అమెరికా బ్యాంకులు అందించే తాత్కాలిక ‘జమ’ పథకాన్ని అతడు దుర్వినియోగం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు అభియోగపత్రం దాఖలు చేశారు. గత నెల 25న అతణ్ని అరెస్టు చేశారు. కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో మేజిస్ట్రేట్‌ జడ్జి ముందు బుధవారం ప్రవేశపెట్టారు. 
మోసం ఇలా.. 
పోలీసుల అరోపణల ప్రకారం.. ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో విక్రయాలు జరిపేవారిని, ఇళ్లు అద్దెకు ఇచ్చేవారిని కిశోర్‌ తొలుత సంప్రదించేవాడు. సామగ్రి కొనుగోలు చేసేందుకు, అద్దెకు దిగేందుకు తనకు ఆసక్తి ఉన్నట్లు చెప్పేవాడు. నగదు జమ చేస్తానని చెప్పి వారి నుంచి బ్యాంకు ఖాతాల సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించేవాడు. ‘పీర్‌-టు-పీర్‌’ విధానంలో నేరుగా డబ్బు బదిలీ చేస్తానని కూడా చెప్పేవాడు. అనంతరం ఆ ఖాతాదారుల్లా నటిస్తూ బ్యాంకులకు వెళ్లేవాడు. తాను ఏటీఎం ద్వారా డబ్బు జమ చేశానని, కానీ అది ఖాతాలో నమోదు కాలేదని ఫిర్యాదు చేసేవాడు. బ్యాంకుల అధికారులు ‘నమోదుకాని జమ’గా దాన్ని గుర్తించి.. తాత్కాలికంగా ఆ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసేవారు. ‘నమోదుకాని జమ’పై దర్యాప్తు ప్రారంభించేవారు. ఆలోగా కిశోర్‌ అసలు ఖాతాదారులకు ఫోన్‌ చేసి.. వారి ఖాతాల్లో పడిన డబ్బు తనదేనని, పొరపాటున వేశానని చెప్పేవాడు. ఆ మొత్తాన్ని తనకు తిరిగి బదిలీ చేయాలని కోరేవాడు. మొత్తం కాకున్నా కొంతైనా పంపమని విన్నవించేవాడు. దీంతో ‘పీర్‌-టు-పీర్‌’ విధానంలో ఖాతాదారులు కిశోర్‌కు డబ్బు పంపేవారు. ‘నమోదుకాని జమ’ ఏదీ లేదని దర్యాప్తులో తేలిన అనంతరం, తాము తాత్కాలికంగా జమ చేసిన మొత్తాన్ని ఆయా ఖాతాల నుంచి బ్యాంకులు వెనక్కి తీసుకునేవి. ఫలితంగా అసలు ఖాతాదారులు నష్టపోయేవారు. ఈ విధానంలో 400 మందికిపైగా బాధితుల నుంచి కిశోర్‌ రూ.5.6 కోట్లకుపైగా స్వాహా చేసినట్లు పోలీసులు ఆరోపించారు.

Link to comment
Share on other sites

1 minute ago, mustang302 said:

Antha money avasaram untae gofundme create chesukovalsindhi ga..y this kind of mosams doing..not good..not at all good man..!

Gofund lo esthe use yemundhi, evadu ivadu ...this is not the right way nor gofund, asalu visa ichi cancel chesina 

how he is staying in us ardam kala ....great basu vadu.

Link to comment
Share on other sites

Just now, whatsapp said:

Gofund lo esthe use yemundhi, evadu ivadu ...this is not the right way nor gofund, asalu visa ichi cancel chesina 

how he is staying in us ardam kala ....great basu vadu.

Nindamuniginodiki no cold feeling..!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...