Jump to content

ఏ పార్టీ గుర్తు నొక్కినా ఓట్లు భాజపాకు వెళ్తున్నాయని


snoww

Recommended Posts

సీఈసీతో ముగిసిన విపక్ష నేతల భేటీ

0402brkk145a.jpg

దిల్లీ: ఈవీఎంలలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. పోలైన ఓట్లలో కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని ఈసీని కోరినట్లు ఆయన చెప్పారు. ఈవీఎంలపై తయారు చేసిన నివేదికను సీఈసీకి విపక్షనేతలు అందజేశారు. భేటీ ముగిసిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలలో మరింత పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని ఈసీని కోరినట్లు ఆజాద్‌ చెప్పారు. ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌ స్లిప్పులను సురక్షితంగా ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి ఓట్లు ఎవరికి వెళ్తున్నాయనే అవగాహన పార్టీలకు తెలిసి ఉంటుందని.. పోలైన ఓట్ల విషయం సాంకేతిక కమిటీలకు తెలియదని చెప్పారు. ఈవీఎంలో ఏ పార్టీ గుర్తు నొక్కినా ఓట్లు భాజపాకు వెళ్తున్నాయని ఆజాద్‌ ఆరోపించారు.

ఈవీఎంలపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి: చంద్రబాబు

23 పార్టీలకు చెందిన ప్రతినిధులమంతా ఎన్నికల సంఘం అధికారులను కలిశామని తెదేపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. సాంకేతికంగా ముందున్న దేశాలు సైతం పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతే పాటిస్తున్నాయన్నారు. పోలైన ఓట్లలో వీవీప్యాట్‌ స్లిప్పులు ఒక్కశాతం మాత్రమే లెక్కిస్తున్నారని.. ఈవీఎంలలో అవకతవకలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని చెప్పారు. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకు ఉందని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌పటేల్‌, మల్లికార్జునఖర్గే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, సీపీఐ నేత రాజా, ఆమ్‌ ఆద్మీ నేతలు ఈసీతో భేటీకి హాజరయ్యారు.

Link to comment
Share on other sites

Quote

కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌పటేల్‌, మల్లికార్జునఖర్గే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, సీపీఐ నేత రాజా, ఆమ్‌ ఆద్మీ నేతలు ఈసీతో భేటీకి హాజరయ్యారు.

antha scrap batch ni pamparu meeting ki anni parties. CBN emo oopukuntadu poyadu okkade migatha parties main leaders evadu leka poyina . LOL. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...