Jump to content

నన్నెందుకు కన్నారు... తల్లిదండ్రులపై కొడుకు కేసు!


solman

Recommended Posts

ముంబై: తన అనుమతి లేకుండా తనను ఎందుకు పుట్టించారంటూ ఓ యువకుడు ఏకంగా కన్నవాళ్లనే కోర్టుకీడ్చేందుకు సిద్ధమైన వైనమిది. తల్లిదండ్రులతో తనకు ‘మంచి సంబంధాలే’ ఉన్నాయంటున్న అతగాడు... పిల్లల్ని కనడమంటే ‘కిడ్నాప్ చేసి, బానిసత్వంలో ఉంచడమే’నని వాదిస్తున్నాడు. ముంబైకి చెందిన 27 ఏళ్ల రఫాయిల్ శామ్యూల్... తనను తాను ‘యాంటి నాటలిస్టు’గా (పుట్టుకను వ్యతిరేకించేవాడు) చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల సుఖం కోసం పిల్లలను ఇష్టంలేకున్నా ‘జీవిత చక్రబంధనం’లోకి తీసుకురావడం తప్పు అన్నది అతడి వాదన. పిల్లల్ని కనాలని ఒత్తిడి చెయ్యెద్దంటున్న యువతరం పెరుగుతున్న తరుణంలో ఈ యాంటీ నాటలిస్టు ఉద్యమం ఊపందుకోవడం గమనార్హం.
 
 
ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో శామ్యూల్ మాట్లాడుతూ... ‘‘మా తల్లిదండ్రులంటే నాకు చాలా ఇష్టం. మా మధ్య గొప్ప సంబంధాలే ఉన్నాయి. కానీ వాళ్లు తమ సుఖ, సంతోషాల కోసమే నన్ను కన్నారని నేను భావిస్తున్నాను. నా జీవితం అద్భుతంగా ఉంది. కానీ స్కూళ్లు, కెరీర్ పేరుతో నన్ను మరో జీవితంలో ఎందుకు నెట్టారో నాకు అర్థంకాదు. ప్రత్యేకించి పిల్లలకు ఊహ తెలియక ముందే వారేంకావాలో నిర్ణయించడమేమిటి?’’ అని అతడు ప్రశ్నించాడు. నిహిలానంద్ పేరుతో శామ్యూల్ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీలో వందలాది మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. ఈ తరహా యాంటీ నాటలిస్టు నినాదాలను అతడు తన పేజీలో నిత్యం పోస్టు చేస్తున్నాడు.
 
‘‘నేను ఎందుకు ఈ బాధలు పడాలి? నేను ట్రాఫిక్‌లో ఇరుక్కోవాలి? నేను ఎందుకు పనిచేయాలి? నేను ఎందుకు యుద్ధాలు చేయాలి? నేను ఎందుకు బాధలు పడాలి? నాకు ఇష్టం లేకుండా, అవసరం లేకుండా ఏదైనా ఎందుకు చేయాలి? అనేక ప్రశ్నలకు ఒక్కటే సమాధానం: ఎవరో తమ సుఖం కోసమే నిన్ను కన్నారు...’’ అంటూ శామ్యూల్ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకున్నాడు. ‘‘మీ పిల్లలు సమస్యలు ఎదుర్కోవడానికి ఒకే ఒక కారణం.. మీరు వాళ్లను కనడమే...’’ అని మరో పోస్టులో పేర్కొన్నాడు. ఇదే అదనుగా మరికొంతమంది ‘యాంటీ నాటలిస్టులు’ పిల్లల్ని కనడం వల్ల  ప్రకృతి వనరులు నాశనమైపోతున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. ‘చైల్డ్ ఫ్రీ ఇండియా’ పేరుతో ఇదే తరహాలో మరో ఫేస్‌బుక్ పేజీ ఈ ‘యాంటీ నాటలిస్టులకు’ వేదికగా మారింది.
 
636850671256848352.jpg
Link to comment
Share on other sites

నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

Link to comment
Share on other sites

3 minutes ago, sinthakaai said:

నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

panipoori

Link to comment
Share on other sites

22 minutes ago, sinthakaai said:

నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

very true...

Link to comment
Share on other sites

36 minutes ago, Vaampire said:

Vammoo. Inka em em choodalo

Vaadu annadaantlo thappu ledu kaka... 

entha mandi parents and society pressure tho kids ni kantunnaru and claim that samsara sagara madhanam lo chikkukunna ani..

nobody says positive stuff unless they get benefited in some way through that...

Link to comment
Share on other sites

6 minutes ago, FJ40 said:

LOL Comedy case: Parents don't need your consent before you turn 18.

They can make decisions for you.

Case closed.

I don't know if you're talking about your own case or generalizing everyone!

He has a point though

panipoori

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...