Jump to content

బస్తీ బీమార్‌


kevinUsa

Recommended Posts

పట్టణ వలస జీవులకు ‘జీవన శైలి’ వ్యాధుల కాటు 
పల్లె నుంచి పట్నమొచ్చిన నాలుగైదేళ్లలోనే చుట్టుముడుతున్న రుగ్మతలు 
63 శాతం పేదల మరణాలకు అవే కారణం 
ఔషధ భారం మోయలేక జీవనం దుర్భరం 
వైద్యానికి రోగి సొంత వ్యయం చేస్తున్న దేశాల్లో భారత్‌ది 182వ స్థానం 
సత్వరమే నివారణ చర్యలు చేపట్టాలంటున్న వైద్య నిపుణులు 
ఈనాడు - హైదరాబాద్‌

Link to comment
Share on other sites

11gh-main1a.jpg

జీవనోపాధిని వెతుక్కొంటూ పట్నమొస్తే.. నగర జీవన ప్రభావంతో వలసవాసులు తమకు తెలియకుండానే వ్యాధుల బారిన పడుతున్నారు. పల్లె నుంచి నగరానికొచ్చిన నాలుగైదేళ్లలోనే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జీవనశైలి వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొత్తం మరణాల్లో ఈ వ్యాధుల బారినపడి మరణిస్తున్న వారు 63 శాతం ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గుండె వైద్యనిపుణులు, భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షులు ఆచార్య డాక్టర్‌ శ్రీనాథరెడ్డి ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సత్వరమే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అందులోని ముఖ్యాంశాలు ఇవి...  స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 11gh-main1c.jpgఇప్పటికి మన దేశంలో జీవిత కాలం 32 ఏళ్లు పెరిగింది. ఇప్పుడు మన సగటు ఆయుష్షు 68.2 సంవత్సరాలు.  ఇందులో ముఖ్యంగా 1990-2016 ఏళ్ల మధ్యన పదేళ్లు ఆయుర్దాయం పెరిగింది. 
దక్షిణాసియా దేశాల్లో మనకంటే ఆయుర్దాయాల్లో దిగువనున్నది పాకిస్థాన్‌ మాత్రమే. భారత్‌కన్నా భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, చైనాలు అధిక ఆయుర్దాయం ఉన్న దేశాలుగా ఉన్నాయి. 
ప్రతి లక్ష ప్రసవాలకు 1980లో 677 సగటు ప్రసూతి మరణాలు ఉండగా.. 1990లో 556కు, 2011-13లో 167కు, 2014-16కి వచ్చేసరికి 130కి తగ్గాయి. 
దేశంలో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌, అసోం.. మొత్తం 9 రాష్ట్రాల్లోని జనాభా మొత్తం దేశ జనాభాలో 50 శాతం ఉండగా.. ఈ రాష్ట్రాల్లోనే 59 శాతం శిశు జననాలు జరుగుతున్నాయి. 
70 శాతానికి పైగా నవజాత శిశువులు, అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. 
92 శాతం ప్రసూతి మరణాలు కూడా ఈ 9 రాష్ట్రాల్లోనే నమోదవడం ఆందోళనకర అంశం. 
రోగ నిరోధక టీకాలు 2006-16లో 18 శాతం పెరిగాయి. 
పోలియోను పూర్తిగా నిర్మూలించగలిగాం. 
పట్టణాల్లో ప్రపంచ స్థాయిలో అత్యాధునిక స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ జిల్లాలు, డివిజన్‌ కేంద్రాల్లో ఇప్పటికీ ఆ స్థాయి ఆధునిక వైద్యం లేదు. 
ఔషధాల ఉత్పత్తికి భారత్‌ పుట్టినిల్లుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇక్కణ్నుంచి ప్రపంచ దేశాలకు ఆధునిక ఔషధాలు ఎగుమతవుతున్నాయి. కానీ మన దేశంలోనే వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 
2014 గణాంకాల ప్రకారం.. ఔషధాలు కొనలేక, ధరల భారం మోయలేక 3.8 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుతున్నారు. 
మన పొరుగునున్న శ్రీలంకలో తక్కువ ధరలో ఔషధాలు లభ్యమవుతున్నాయి. 
మొత్తం ఆరోగ్యానికయ్యే ఖర్చులో రోగి తన జేబుల్లోంచి ఖర్చు పెట్టుకుంటున్న దేశాల జాబితాలో.. మొత్తం 191 దేశాలకు గాను భారత్‌ 182వ స్థానంలో ఉంది.

11gh-main1b.jpg
 

పాతికేళ్లుగా పెరుగుతున్న రోగాలు 
మన దేశంలో 1990కి 2016కు మధ్యన జీవనశైలి వ్యాధుల భారం మరింతగా పెరిగింది.  
1990లో అంటువ్యాధులు 60.9 శాతం ఉండగా.. జీవనశైలి వ్యాధులు 30.5 శాతంగా ఉన్నాయి. 
2016లో అంటువ్యాధులు 32.7 శాతానికి తగ్గిపోగా, జీవనశైలి వ్యాధులు 55.4 శాతానికి పెరగడం గమనార్హం. 
మరణాలకు కారణాల్లో జీవనశైలి వ్యాధులు 63 శాతం కాగా, ఇందులోనూ గుండెపోటు కారణంగా 27 శాతం మంది చనిపోతున్నారు.  
1990ల్లో ఆరో స్థానంలో ఉన్న గుండెపోటు మరణాలు 2016లో మొదటి స్థానానికి చేరుకున్నాయి. 
దీర్ఘకాలంగా ఊపిరికి అడ్డుతగిలే వ్యాధి (సీఓపీడీ) కూడా 1990ల్లో 8వ స్థానంలో ఉండగా.. 2016లో రెండో స్థానానికి ఎగబాకింది. 
70 ఏళ్లలోపు మరణాల్లో 56 శాతం జీవనశైలి వ్యాధుల కారణంగా జరుగుతున్నాయి. 
65 ఏళ్లలోపు వారిలో 40 శాతం మరణాలు జీవనశైలి వ్యాధుల ముప్పుతోనే కావడం గమనార్హం.
Link to comment
Share on other sites

lifestyle diseases 

 people dont understand it 

diabetes, Bp and  lung  disorders.

 my parents live in a village less exposure to pollution.

 

 

 

 

Link to comment
Share on other sites

4 minutes ago, kevinUsa said:

lifestyle diseases 

 people dont understand it 

diabetes, Bp and  lung  disorders.

 my parents live in a village less exposure to pollution.

 

 

 

 

Yes baa 

City lo pollution lo unde daniki outskirts lo unde daniki chala differ undi

Prashantam ga sleeping and kasta peaceful ga untundi

Link to comment
Share on other sites

physical exercise undadu.  

these are all part of no physical exercises issues .

 ma cousin ku pelli ayindi 

 My cousin is  a prof in a college  makes around 12l 

his wife is a victim of IT and  both leave at same time 

he comes home at 6Pm she at 8pm  

aa time ku   who will have time to do exercise 

aa traffic and pollution ki people will not  have any interest in working out  

Byfar   I have seen India has   worst work culture.

 the peer pressure one has due to all this is hard to manage at at of 27.

 

 

Link to comment
Share on other sites

Just now, kevinUsa said:

physical exercise undadu.  

these are all part of no physical exercises issues .

 ma cousin ku pelli ayindi 

 My cousin is  a prof in a college  makes around 12l 

his wife is a victim of IT and  both leave at same time 

he comes home at 6Pm she at 8pm  

aa time ku   who will have time to do exercise 

aa traffic and pollution ki people will not  have any interest in working out  

Byfar   I have seen India has   worst work culture.

 the peer pressure one has due to all this is hard to manage at at of 27.

 

 

Uthigane4 vastaya endi lachalu lachalu salary lu vastai

Link to comment
Share on other sites

Just now, kevinUsa said:

manaku ravadam leda baa 

ikkada  

Both are different man

Us lo inti rent ke lacha pedutav

Adhe india lo aa lacha ki inko rendu add cheste down payment tho illu vastadi

Aa lacha tho 5 middle class family lu month mottam gadapochu

Link to comment
Share on other sites

16 minutes ago, Smallpappu said:

Both are different man

Us lo inti rent ke lacha pedutav

Adhe india lo aa lacha ki inko rendu add cheste down payment tho illu vastadi

Aa lacha tho 5 middle class family lu month mottam gadapochu

agreed kani  look at work culture except  Govt emp almost andaru too  much workpressure  

India 

ma tammudu edo chesi  oka govt job techukunnadu   salary takkuva ayina kani he is happy and peaceful

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...