Jump to content

ఓటుకు నోటు కేసులో 7 గంటలపాటుఈడీ ప్రశ్నల వర్షం


snoww

Recommended Posts

ఆ పైసలెక్కడివి? 

 

రూ. 50 లక్షలు ఎవరిచ్చారు 
మిగతా రూ.4.50 కోట్లు ఎవరు సమకూరుస్తానన్నారు? 
ఓటుకు నోటు కేసులో 7 గంటలపాటుఈడీ ప్రశ్నల వర్షం 
వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడి విచారణ 
ఈనాడు - హైదరాబాద్‌

టుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డిని మంగళవారం ఈడీ  అధికారుల బృందం దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు గానూ నామినేటెడ్‌ తెరాస ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు, అప్పటి శాసన సభ్యుడు రేవంత్‌రెడ్డి రూ.50 12gh-main3a.jpgలక్షలు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకోవడం, అవినీతి నిరోధక చట్టం కింద ఆయన్ని అరెస్టు చేయడం తెలిసిందే. 2015 మే, 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించి అనిశా అధికారులు ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేశారు. ‘‘మొత్తం రూ.5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని బయానాగా రూ.50 లక్షలు చెల్లించారు. ఆ సొమ్మును వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డి మెట్టుగూడ వద్ద రేవంత్‌రెడ్డికి అందజేశాడు’ అని అభియోగపత్రంలో అనిశా పేర్కొంది. ఈ సొమ్ము ఎక్కడిదనే కోణంలో ఆదాయపన్ను శాఖ  కూడా దర్యాప్తు జరుపుతుండగా.. ‘అక్రమ నిధుల ప్రవాహం, దాని ద్వారా సమకూర్చుకున్న ఆస్తుల చట్టం (పి.ఎం.ఎల్‌.ఎ.)’ కింద ఈడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టి, ఆయన తరఫున రేవంత్‌రెడ్డి రాయబారం నడిపారనే అభియోగాల నేపథ్యంలో ఈడీ అధికారులు నరేందర్‌రెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులు, రేవంత్‌రెడ్డికి ఇదివరకే నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈడీ అధికారులు వీరిద్దర్నీ తొలుత వేర్వేరుగా, తర్వాత కలిపి విచారించారు. అనిశా దాఖలు చేసిన అభియోగపత్రం, ఆదాయ పన్ను శాఖ అధికారుల విచారణ తాలూకు వివరాలు, నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నులు, ఇతర వివరాల ఆధారంగా ప్రశ్నలు సంధించారు. ‘‘రూ.50 లక్షలు ఎలా సమకూర్చుకున్నారు? మిగతా రూ.4.50 కోట్లు ఎవరు సమకూరుస్తానన్నారు?’’ అనే కోణంలో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వెళ్లిన వాళ్లు, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. సదరు రూ.50 లక్షలు రేవంత్‌రెడ్డి తనకు ఇవ్వలేదని నరేందర్‌రెడ్డి ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. 
19న హాజరుకానున్న రేవంత్‌రెడ్డి 
ఇదే కేసులో ఈ నెల 19న రేవంత్‌రెడ్డి, 18న ఆయన సన్నిహితుడు ఉదయసింహ ఈడీ అధికారుల ఎదుట హాజరవుతారని సమాచారం. 
పిల్లల్ని వేధిస్తున్నారు: నరేందర్‌రెడ్డి 
ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని తన పిల్లల్ని ఈడీ అధికారులు వేధిస్తున్నారని నరేందర్‌రెడ్డి వాపోయారు. ఈడీ విచారణ అనంతరం మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘నా కుమారుల్లో ఒకరు డాక్టర్‌, మరొకరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. సోమవారం ఒక కుమారుడ్ని విచారించారు. మంగళవారం మరొకర్ని విచారణకు రప్పించారు. రాజకీయంగా నాకు ఇలాంటి వేధింపులు సహజమే. వాటిని ఎదుర్కొనేందుకు నేను సిద్ధమే. కేసులో సంబంధం లేని నా కుమారుల్ని వేధించడమే బాధేస్తుంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

10 hours ago, Indiatoday2030 said:

em peekaleru . ED officers time sheet fill cheyyataniki use avthayi ganthe.

adenti ED office daaka poyi vacharu ante next CM post ki try cheyachu mana india lo..antha popularity vasthadhi

Link to comment
Share on other sites

2 minutes ago, JAPAN said:

adenti ED office daaka poyi vacharu ante next CM post ki try cheyachu mana india lo..antha popularity vasthadhi

kaalam maripoindi kaka...ED office ante izzat lekunda potundi...jail ki poi vachina kuda CM ayitaru anna nammakam ledu kaka...rojulu kharab ayinayi...

okappudu CBI case la oka 1 week remand peru mida lopaliki pothe sure shot CM vuntunde...ipudu months together vunna kuda koi bharosa nahi hain, laksha kotlu dobbina kuda CM avutaru ani nammakam leni rojulu ivi

Link to comment
Share on other sites

12 minutes ago, Android_Halwa said:

kaalam maripoindi kaka...ED office ante izzat lekunda potundi...jail ki poi vachina kuda CM ayitaru anna nammakam ledu kaka...rojulu kharab ayinayi...

okappudu CBI case la oka 1 week remand peru mida lopaliki pothe sure shot CM vuntunde...ipudu months together vunna kuda koi bharosa nahi hain, laksha kotlu dobbina kuda CM avutaru ani nammakam leni rojulu ivi

social media leni rojule haayi...em chepthe adhe nammevallam

but now too bad too worst Related image om namah sivaya

monna CM Ramesh gaadi whatsapp block ayithe modi kutra anta..:giggle:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...