Jump to content

మోదీకి నాయకత్వ లక్షణాల్లేవ్‌!


snoww

Recommended Posts

మోదీకి నాయకత్వ లక్షణాల్లేవ్‌!
13-02-2019 02:47:25
 
636856228466756748.jpg
సరైన చదువు లేదు ఆయనకెవరూ లేరు.. భావోద్వేగాలు అర్థం కావు
షా.. వాట్‌ నాన్సెన్స్‌ యూ ఆర్‌ టాకింగ్‌..?.. మీ జాతకాలు నాకు తెలుసు
బయటపెడితే తలెత్తుకోలేరు.. నా ప్రజలకు అన్యాయం చేశారు
నేనెందుకు ప్రధానికి స్వాగతం పలకాలి.. బీజేపీకి వైసీపీ వంతపాట
ప్రజా కోర్టులో తేల్చుకుంటాం.. హామీల కోసం కోర్టులను ఆశ్రయిస్తాం
ప్రభుత్వం ధర్మాన్ని విస్మరిస్తే దేశాన్ని ఏకం చేసే బాధ్యత రాష్ట్రపతిదే: బాబు
  • సరైన చదువూ లేదు ఆయనకెవరూ లేరు..
  • దేశాన్ని ఏకం చేసే బాధ్యత రాష్ట్రపతిదే
  • ఢిల్లీలో మీడియాతో చంద్రబాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘మీకు ఎవరూ లేరు కాబట్టి మీకు భావోద్వేగాలు తెలియవు. కానీ ప్రజలకు భావోద్వేగాలు ఉంటాయని అర్థం చేసుకోండి’ అని ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని.. సరైన చదువు లేదని.. అభివృద్ధి ఎజెండా కూడా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రవిభజన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మంగళవారం వినతి పత్రం అందించిన తర్వాత ఆయన విజయ్‌ చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల భావోద్వేగ అంశమన్నారు. ఇప్పటికీ హామీలను నెరవేర్చకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
 
ప్రజా కోర్టులో తేల్చుకుంటామని, ప్రజల తీర్పుతో వచ్చే ప్రభుత్వం ద్వారా హామీలను అమలు చేయించుకుంటామని స్పష్టం చేశారు. ‘పాలకులు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వాలు ధర్మాన్ని విస్మరిస్తే బాధ్యతాయుతమైన వారు పోరాడి ఎండగట్టాలి. అదే మేం చేశాం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రజలు సంతృప్తిగా లేరని, దానివల్లే తమ రాష్ట్రానికి హామీలిచ్చారని గుర్తు చేశారు. బిడ్డను బ్రతికించి తల్లిని చంపేశారని గత ఎన్నికల ముందు మోదీ అన్నారని, విభజన హామీలన్నీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారని.. కానీ అమలు చేయలేదని గుర్తుచేశారు.
 
రాజధాని అమరావతికి శంకుస్థాపన సందర్భంగా యమునా జలాలు, పార్లమెంటు మట్టిని తమ ముఖాన కొట్టారని దుయ్యబట్టారు. విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చినా.. అన్యాయం చేసినందుకు 125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్ర ప్రజలు ఓడించారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని.. ఆంధ్ర ప్రజల భవిష్యత్‌తో, భావోద్వేగాలతో ఆడుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నిటినీ రాష్ట్రపతికి వివరించామని, రాజ్యాంగాధినేతగా రాష్ట్ర విభజన హామీలను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరామని వెల్లడించారు.
 
ధర్మాన్ని ప్రభుత్వం విస్మరించినప్పుడు, విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు దేశాన్ని ఏకం చేసే బాధ్యత రాష్ట్రపతిపై ఉంటుందని తెలిపారు. దేశాన్ని ఏకం చేసిన సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత మోదీకి లేదన్నారు. ‘ఆయన ప్రతి చోటా సమస్య సృష్టిస్తున్నారు. రాష్ట్రాల మధ్య, వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. రాజకీయ నేతలపై దాడులు చేస్తున్నారు. దేశానికి హానీ కలిగిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. విలేకరుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలివీ..
 
మీ విజ్ఞప్తిపై రాష్ట్రపతి ఏ విధంగా స్పందించారు..?
మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి రాజ్యాంగాధినేత. రాష్ట్రపతి భవన్‌ ద్వారా న్యాయం వర్ధిల్లుతుందని భావిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం.
 
షా బహిరంగ లేఖపై మీ స్పందన ఏంటి..?
అందుకే వాయించిపెట్టాను కదా..! తప్పుడు ప్రచా రం చేయడం వాళ్లకు అలవాటైంది. వాట్‌ నాన్సెన్స్‌ యూ(షా) ఆర్‌ టాకింగ్‌.. మీ(మోదీ-షా) జాతకాలు నాకు తెలుసు. అవి బయటపెడితే మీరు తలెత్తుకుని కూడా తిరగలేరు. ప్రజలు ఛీకొట్టే పరిస్థితి వస్తుంది. ఈయన బహిరంగ లేఖ రాస్తారు. దానికి వైసీపీ నే తలు వంత పాడతారు. నేనేదో ప్రధానిని అవమానం చేశానంటా.. ప్రోటోకాల్‌ పాటించలేదంటా..! స్వాగతం పలకడానికి సీఎస్‌ వెళ్లారు.. డీజీపీ వెళ్లారు. నా ప్రజలకు అన్యాయం చేసినప్పుడు నేనెందుకు వెళ్లాలి? మీ రు వాళ్లకు ఊడిగం చేయాలనుకుంటే చేయండి. కలిసి పోటీ చేయాలనుకుంటే చేయండి. ఓట్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? స్వాతంత్య్ర పోరాటంలో కొంత మంది బ్రిటిష్‌ వారికి అమ్ముడుపోయారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది.
 
టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారు..
రాజీనామా చేసి వాళ్లెందుకు పారిపోయారు? మోదీ అంటే భయమా..? మేం ఆయన గుండెల్లో నిద్రపోతు న్నాం. టీడీపీ ఎంపీలు లేకపోతే ఢిల్లీలో, పార్లమెంటు లో మన గొంతుక ఉంటుందా..? రాజీనామా చేస్తే కు క్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లయ్యేది. మీరు అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్క పార్టీ అయినా మద్దతిచ్చిందా? అదే మేం పెడితే అందరూ కలిసి వచ్చారు.
 
తాము పోరాడుతున్నపుడు సీఎం బీజేపీతో ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు..!
నేను ఎవరి కోసం ఉన్నాను... ఆ రోజూ, ఈ రోజూ ప్రజల కోసమే ఉన్నాను. వాళ్లు కేసుల కోసం ఉన్నారు. ప్రజల కోసం 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి.. మోదీ క న్నా నేను సీనియర్‌నైనా.. రాష్ట్ర ప్రజల కోసం ఆయన దగ్గరకు వెళ్లాను. సార్‌.. సార్‌ అని కూడా సంబోధించా ను. వాళ్లు కేసుల కోసం లాలూచీపడి అడక్కపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారు.
 
ఓటుకు రూ.5 వేల వరకు ఇస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్‌ అంటున్నారు.
జగన్‌ తాను చేసే పనులు అందరికీ అంటగడుతున్నాడు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం తనకు మూటలిస్తాయని ఓటుకు రూ.5 వేలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయనే ఓట్లు తొలగించుకుని.. ప్రభుత్వం తీసేస్తోందంటున్నారు. ఆయన నేరస్థుడు కాబట్టి తప్పుడు అఫిడవిట్లు సృష్టిస్తారు. మొన్న ఒక సామాజికవర్గం గురించి మాట్లాడారు. రుజువు చేస్తారా..? సామాజిక న్యాయంలో టీడీపీ ముందుంటుంది. వాళ్లు చేసే తప్పుడు పనులన్నీ ఇతరులపై రుద్ది రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ప్రజలు అమాయకులు కాద ని గుర్తుంచుకోవాలి.
 
ధర్మ పోరాట దీక్షతో ఆశించిన ఫలితం వచ్చిందా..?
ధర్మ పోరాట దీక్ష 11 జిల్లాల్లో చేశాం. ఇప్పుడు ఢిల్లీలోనూ చేశాం.. పార్లమెంటులో పోరాటం చేస్తూనే ఉ న్నాం. ప్రజాసంఘాలు వాళ్లకు తోచిన విధంగా పోరాడుతున్నాయి. మరొక ధర్మ పోరాట దీక్షను అమరావతిలో పెట్టాలనుకుంటున్నాం. దీనికి అన్ని పార్టీల నేతలు ఆహ్వానిస్తాం.
 
మీ భవిష్యత్‌ కార్యాచరణ?
మా పోరాటం కొనసాగుతుంది. మా ఆకాంక్ష రాష్ట్రానికి న్యాయం జరగడం. ఇప్పుడు రాష్ట్రపతి వరకు వ చ్చాం. వివిధ సంఘాలు గతంలో వేర్వేరుగా పోరాటం చేశాయి. ఇప్పుడు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతిని కూడా కలిశాం. ఇక కోర్టులను ఆశ్రయించడం మిగిలి ఉంది. అలాగే ప్రజాతీర్పును కోరే అవకాశం త్వరలో వస్తోంది.
 
గతంలో ఉన్నత విద్యా మండలి విషయంలో మరోసారి కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా..?
58:42 నిష్పత్తిలో ఆస్తులను విభజించాలని కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం దానికి విరుద్ధంగా వ్యవహరించింది. స్థానికత ఆధారంగా విభజిస్తామని తెలిపింది. మరోసారి కోర్టుకు వెళ్తాం.
 
మీకు, మోదీ మధ్య వ్యక్తిగత విభేదాలు ఎందుకు వచ్చాయి...?
గోద్రా ఘటన సమయంలో రాజధర్మాన్ని పాటించనందున మోదీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని నాటి ప్రధాని వాజ్‌పేయిని డిమాండ్‌ చేశాను. వాజ్‌పే యి ప్రయత్నించారు కానీ చేయలేకపోయారు. ఈ విషయాన్ని మోదీ మనసులో పెట్టుకున్నారు.
 
రానున్న ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు ఉందా?
ప్రత్యేక హోదా, పోలవరం నిధులతో పాటు అన్ని చేస్తామని రాహుల్‌గాంధీ నుంచి అందరు నేతలు చె ప్పారు. వాళ్లు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రజల మనోభావాలు ముఖ్యం. అవన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటాం.జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం కోసం కలిసి పోరాటం చేస్తాం.
 
హోదా కోసం రాహుల్‌, ఇతర నేతలు రాష్ట్రానికి వస్తే కోడిగుడ్లు వేయించినందుకు క్షమాపణలు చెప్పాలని కేపీవీ డిమాండ్‌ చేస్తున్నారు..!
కేవీపీ ఎక్కడున్నారు.. ఆయన కాంగ్రె్‌సతో ఉన్నారో.. వేరే పార్టీతో ఉన్నారో తెలియదు. వాళ్ల అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటే ఆ పార్టీ లో ఉన్నట్లు లెక్క. అధిష్ఠానం ఒకవైపు, ఈయన ఒక వైపు ఉంటే ఆయన ఎక్కడున్నారో ఆయనే నిర్ణయించుకోవాలి. ఎవరికి మద్దతివ్వాలో ఆయనే నిర్ణయించుకోవాలి. దేశంలో ప్రజాస్వామ్య ఒత్తిడి వల్ల రాహుల్‌ ఇం టికి వెళ్లి నేనే కలిశాను. నా స్వార్థం కోసం కలవలేదు. ప్రజాస్వామ్యవాదులంతా మా ఉద్యమానికి మద్దతివ్వాలి. లేదంటే మోదీకి మద్దతిచ్చినట్లవుతుంది.
 
పౌరసత్వం చట్ట సవరణ బిల్లుపై మీ వైఖరి?
బీజేపీ చేస్తున్నది చాలా తప్పు. సున్నితమైన అంశాలను కూడా చర్చించడం లేదు. రాజఽధర్మాన్ని పాటించడం లేదు. వాళ్లకు ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారు. దేశానికి మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:
636856228466756748.jpg
Garuda Star with Boiling Star meeting president @3$%

Only 11 people ke permission unde anta some 40-50 people pothe..., aa 11 lo Lavada star gadni include chesandante whatta fowerful pack.... esionary anipinchukunnadu...

Link to comment
Share on other sites

Putaki okka maata marchey chekka gaadivi. Neeku unnayi leadership qualities. Modi pm gaa pramana sweekaram cheyyaganey poyi bj iyyaniki ready avuthav

Link to comment
Share on other sites

1 minute ago, Vaampire said:

Putaki okka maata marchey chekka gaadivi. Neeku unnayi leadership qualities. Modi pm gaa pramana sweekaram cheyyaganey poyi bj iyyaniki ready avuthav

Bolli likes D0ggy

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...