Jump to content

List of sitting MLAs MPs moving to YCP from TDP this week


JambaKrantu

Recommended Posts

  • Replies 254
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    76

  • Smallpappu

    37

  • JambaKrantu

    22

  • DaleSteyn1

    15

 
 
 
 
YSR Congress Party Is In Full Josh With Many Leaders Joining - Sakshi

శనివారం హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, వంగా గీత, బల్లి దుర్గాప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, బుట్టా రేణుక, గేదెల శ్రీనుబాబు (కుడి నుంచి ఎడమకు)

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:
 
 
 
 
YSR Congress Party Is In Full Josh With Many Leaders Joining - Sakshi

శనివారం హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, వంగా గీత, బల్లి దుర్గాప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, బుట్టా రేణుక, గేదెల శ్రీనుబాబు (కుడి నుంచి ఎడమకు)

E ycp tdp jendala contract teesukondiki entha enakesthado e month la

Link to comment
Share on other sites

  • 2 weeks later...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి మరో షాక్‌ తగిలింది. కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మణిగాంధీకి వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాల్మీకి పోరాట సమితి అధ్యక్షుడు సుభాష్‌ చంద్రబోస్‌ కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. కాగా ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్యనాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసెందే.

టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు పట్ల పలువురు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫారుఖ్‌ వర్గాన్ని భూమా బ్రహ్మానంద రెడ్డి పట్టించుకోవడంలేదని ఆ వర్గ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం దశాబ్దాలుగా సేవచేస్తున్న మమ్మల్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల కార్యక్రమానికి, నామినేషన్ కార్యక్రమానికి కనీస పిలుపు లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మండల పరిధిలోని 15 గ్రామాల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 15గ్రామాలకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో సమావేశమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి వ్యవహార తీరు నచ్చకపోవడంతో  పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం లోపు వాళ్ల నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి  గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ సీనియర్‌ నేత సాయిప్రతాప్‌ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్‌ వెల్లడించారు. కాగా రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ మరణాంతరం సాయిప్రతాప్‌ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే.

ఈ సందర్భంగా సాయిప్రతాప్‌ కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘దిక్కుతోచని స్థితిలో నా ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీలో చేరడం జరిగింది. రాయలసీమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు లేఖలు ఇచ్చాను. కానీ ఇంతవరకు చంద్రబాబు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. టీడీపీలో ఉన్న ఈ మూడేళ్లు అజ్ఞాతంతో పాటు, అరణ్య వాసంలో ఉన్నట్లు ఉంది. నన్ను రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉండమన్నారు. కానీ నా పార్లమెంట్ పరిధిలో జరిగే ఎటువంటి పార్టీ కార్యక్రమాలపై నాకు సమాచారం ఇవ్వరు. ఇన్‌ఛార్జ్‌కు పార్లమెంట్ సీటు ఇస్తారేమో అనుకున్నా. నా అల్లుడు సాయి లోకేష్‌కు రాజంపేట పార్లమెంట్ టికెట్ అడగటం జరిగింది. కానీ నాకు మొండిచేయి చూపించారు. 

ఈరోజు టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నన్ను అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు నన్ను చూసి పక్కకు మొహం తిప్పుకుని చూడనట్లు వ్యవహరించారు. టీడీపీలో సరైన విలువలు ఇవ్వలేదు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. డబ్బులు లేని వారికి టీడీపీలో స్థానం లేదు. వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీలో చంద్రబాబు అన్యాయం చేసారు. చంద్రబాబు తీరు వల్ల గత వారం రోజుల పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యను. టీడీపీలో స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేశారు. సీనియర్ నాయకులకే విలువ లేని టీడీపీలో యువతరానికి విలువలు ఉంటాయా...? రెండు రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లేది భవిష్యత్ కార్యాచరణ తెలుపుతాను’ అని అన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...