Jump to content

లైట్‌ మెట్రో డీపీఆర్‌కుతుది రూపు!


snoww

Recommended Posts

లైట్‌ మెట్రో డీపీఆర్‌కుతుది రూపు! 

3/4/2019 2:31:34 AM

636872634950407639.jpg
  • ఏఎంఆర్‌సీకి డ్రాఫ్ట్‌ అందజేత
  • నేడు ఏఎంఆర్‌సీ, కేఎ్‌ఫడబ్ల్యూల డ్రాప్ట్‌ డీపీఆర్‌ పరిశీలన
  • 80 కి.మీ, మూడు కారిడార్లకు ప్రతిపాదనలు ఫ వ్యయ ప్రతిపాదనలతో నివేదిక
రాజధానినికి అత్యంత ప్రతిష్టాత్మకమైన లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫైనల్‌ డీపీఆర్‌ను అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కు కన్సల్టెన్సీ సంస్థ ‘శిస్ర్టా’ డ్రాఫ్ట్‌ రూపంలో అందజేసింది. ఈ డ్రాఫ్ట్‌ రిపోర్టును సోమవారం ఏఎంఆర్‌సీ, కేఎ్‌ఫడబ్ల్యూ సంస్థలు పరిశీలిస్తాయి. గతంలో ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్టు పరిశీలించిన హైలెవల్‌ స్టీరింగ్‌ కమిటీ పలు మార్పులు, సూచనలను చేసింది. ఆ మేరకు ఫైనల్‌ డీపీఆర్‌ సిద్ధమైంది.
 
విజయవాడ, మార్చి3 (ఆంధ్రజ్యోతి): లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫైనల్‌ డీపీఆర్‌ను అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌కు ‘శిస్ర్టా’ డ్రాఫ్ట్‌ రూపంలో అందజేసింది. దీనిని సోమవారం ఏఎంఆర్‌సీ, కేఎ్‌ఫడబ్ల్యూ సంస్థలు పరిశీలిస్తాయి. ప్రిలిమినరీ రిపోర్టు పరిశీలించిన హైలెవల్‌ స్టీరింగ్‌ కమిటీ పలు మార్పులు, సూచనలను చేసింది. ఆ మేరకు ఫైనల్‌ డీపీఆర్‌ సిద్ధమైంది. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు.. ఫైనల్‌ డీ పీఆర్‌లో ప్రధానంగా విజయవాడతో పాటు చెంతనే ఉన్న అమరావతి రాజధాని నగరాన్ని అనుసంధానించేలా దాదాపుగా 80 కిలోమీటర్ల నిడివితో కూడిన ప్లాన్స్‌ను అందించిన ట్టు తెలుస్తోంది. విజయవాడ పోర్షన్‌లో సింహభాగం లైట్‌ మెట్రోరైల్‌ కారిడార్‌ నిడివి ఉంది. మొత్తంగా మూడు కారిడార్లను శిస్ర్టా ప్రతిపాదించింది. వీటిలో ప్రధానంగా ఏలూరు రోడ్డు (కారిడార్‌-1), బందరు రోడ్డు (కారిడార్‌-2), జక్కంపూడి (కారిడార్‌-3)లు ఉంటాయి. కారిడార్‌-1 నిడివి చాలా పెద్దగా ఉంటుంది. ఏలూరు రోడ్డు మీదుగా వెళ్ళే ఈ కారిడార్‌-1 నిడివి 53.5 కిలోమీటర్లు! మొదట్లో ఈ కారిడార్‌ను గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అనుకున్నారు. ఎయిర్‌పోర్టు కంటే ముందు నుంచే లైన్‌ తీసుకు వస్తే బాగుంటుందన్న ఆలోచనను ఏఎంఆర్‌సీ అధికారులు చేశారు. గన్నవరం ఆర్టీసీ బస్‌స్టేషన్‌నుంచి 16వ నెంబర్‌ జాతీయ రహదారి మీదుగా ఈ కారిడార్‌ ప్రారంభమౌతుంది. ఎయిర్‌పోర్టుకు భూగర్భమార్గంలో ఈ కారిడార్‌ వెళుతుంది. తిరిగి ఎయిర్‌పోర్టు నుంచి భూగర్భ మార్గంలోనే బయటకు వస్తుంది. ఇక్కడ ఇంటర్‌ సెప్టెర్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విమానాశ్రయంలోకి వెళ్ళిన రైలు అదే ట్రాక్‌పై వెనక్కు రావటం కష్టం కాబట్టి.. ఈ ట్రాక్‌కు అనుసంధానంగా ఇంటర్‌సెప్టెర్‌ ట్రాక్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
అమరావతిలోకి ఇలా..
కేసరపల్లి మీదుగా నిడమానూరు, రామవరప్పాడురింగ్‌ చేరుకుని అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌కు అక్కడి నుంచి బస్‌స్టేషన్‌కు చేరుకుంటుంది. బస్‌స్టేషన్‌ నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్‌ మీదుగా అమరావతిలోకి ప్రవేశిస్తుంది. రాజధానిలో లింగాయపాలెం వరకు ఈ కారిడార్‌ వస్తుంది. ఈ కారిడార్‌లో ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌ గ్రౌండ్‌ వస్తుంది. మిగిలిన చోట ఎలివేటెడ్‌ విధానంలో అంటే ఫ్లై ఓవర్‌పై ట్రాక్‌ వస్తుంది. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌నుంచి రాజధానిలోకి దాదాపుగా 24 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలోనే లైట్‌ మెట్రో ఉంటుంది. రెండవది పెనమలూరు కారిడార్‌ నిడివి మొత్తం 12 కిలోమీటర్లు. ఇది బందరు రోడ్డు మీదుగా పెనమలూరు సెంటర్‌ నుంచి బస్‌స్టేషన్‌ వరకు చేరుకుంటుంది. మూడవది జక్కంపూడి కారిడార్‌! జక్కంపూడికి రెండు ట్రాక్‌లు సమాంతరంగా వేయటానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. ఒకమార్గం 6.3 కిలోమీటర్లు, మరో మార్గం 8.2 కిలోమీటర్లుగా ఉన్నట్టు సమాచారం. ఈ కారిడార్‌లకు సంబంధించి దాదాపుగా 80 వరకు మెట్రోస్టేషన్లను ప్రతిపాదించినట్టు సమాచారం. రెండుచోట్ల ప్రధాన మెట్రో స్టేషన్లు వస్తాయి. విజయవాడలో పీఎన్‌బీఎ్‌స వద్ద ఒకటి, అమరావతిలోని లింగాయపాలెం దగ్గర మరొకటి చొప్పున ప్రధాన స్టేషన్లను నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

Quote

కృష్ణా కెనాల్‌ జంక్షన్‌నుంచి రాజధానిలోకి దాదాపుగా 24 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలోనే లైట్‌ మెట్రో ఉంటుంది.

Under Ground metro. First of a kind bl@st

Link to comment
Share on other sites

Just now, BloomingtonBullodu said:

Temporary metro na ??

Yeah brother .. bhoogarbam lo for now temporary anta. Amaravati finish ainaaka dhaani meedha pillars vesi paina permanent kadatahranta.. underground ki pipe lu koyadaniki undadhu so water b kaarav

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Yeah brother .. bhoogarbam lo for now temporary anta. Amaravati finish ainaaka dhaani meedha pillars vesi paina permanent kadatahranta.. underground ki pipe lu koyadaniki undadhu so water b kaarav

Good ... manaki kavalsindi kuda temporary ne ... 

Ade complete avvagane kulchesii permanent works cheskovachu .. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...