Jump to content

అమెరికాలో ట్యాక్స్ ఎగ్గొట్టిన ఎన్నారైలు.. వారికి ఏ శిక్ష విధించారంటే..


snoww

Recommended Posts

అమెరికాలో ట్యాక్స్ ఎగ్గొట్టిన ఎన్నారైలు.. వారికి ఏ శిక్ష విధించారంటే..

636875776217625003.jpg

న్యూయార్క్: ముగ్గురు భారతీయులు కలిసి న్యూజెర్సీ, నెవార్క్, న్యూయార్క్‌లు కేంద్రాలుగా ఓ ఫార్మసీ కంపెనీ స్థాపించారు. కష్టపడి కంపెనీని మంచి స్థానానికి తీసుకొచ్చారు. అయితే ఆదాయపన్ను ఎగ్గొట్టి ముగ్గురు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజయ్ బ్రాత్వాల్(43) అనే వ్యక్తి దిలీప్ నైక్, భావేష్ మిస్త్రీలతో కలిసి ఫార్మసీ కంపెనీని మొదలుపెట్టారు. వారి ఫార్మసీ కంపెనీ సేవలు విస్తరించాయి. దాంతో లాభాలు కూడా అధికంగానే వచ్చాయి. అయితే లాభాలను దాచిపెట్టి వారు ప్రభుత్వాన్ని మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. 2009 నుంచి 2011 మధ్య కాలంలో ఫార్మసీ కంపెనీ 9 మిలియన్ డాలర్లు లాభంతో నడిచింది. అయితే అజయ్ లాభాలను బిజినెస్ అకౌంట్‌లో చూపకుండా దాచి పెట్టారని పోలీసులు పేర్కొన్నారు. కేవలం 4 మిలియన్ డాలర్లు మాత్రమే లాభం వచ్చినట్లు చూపారని పోలీసులు చెబుతున్నారు. మిగతా మొత్తాన్ని చెక్‌ల రూపంలో వివిధ అకౌంట్లలో డిపాజిట్ చేశారన్నారు. నేరాన్ని కనిపెట్టిన ఆదాయపన్ను శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగుచూసిందన్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. కోర్టు వారికి అయిదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. 

Link to comment
Share on other sites

అమెరికాలో దొంగ కంపెనీలతో బురిడీ.. ఎన్నారై అరెస్ట్..

636875757536950754.jpg

 

భారతీయుడైన సిస్కో మాజీ డైరెక్టర్‌ అరెస్ట్‌
న్యూయార్క్‌: దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగం చేస్తున్న సంస్థను మోసం చేసిన భారతీయుడిని అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిస్కో సిస్టమ్స్‌ మాజీ డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌ భిఖాను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017 మధ్య వరకూ ఆ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న ఆయన మారుపేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి సిస్కోకు చెందిన కాంట్రాక్టులన్నీ వాటికే వెళ్లేలా చేశారని అభియోగాలు నమోదు చేశారు. ఈ మేరకు 93లక్షల డాలర్ల నష్టం జరిగినట్లు కంపెనీ కేసు పెట్టింది. దీంతో పృథ్వీరాజ్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మార్చి ఒకటో తేదీని అరెస్ట్‌ చేశారు. ఫెడరల్‌ కోర్టులో హాజరుపర్చగా 30లక్షల డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగుతుందని అమెరికా అటార్నీ డేవిడ్‌ ఆండర్సన్‌, ఎఫ్‌బీ స్పెషల్‌ ఏజెంట్‌ ఇన్‌చార్జి జాన్‌ బెన్నట్‌ తెలిపారు. ఈ కేసులో నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు, 2.5లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

లండన్‌లో తెలుగు ఎన్నారై మృతి.. సినీనటుడు బాలకృష్ణతో అనుబంధం

636876299582825676.jpg

ఎన్నారై డాక్టర్‌ నాగభైరు కన్నుమూత

చిలకలూరిపేట(గుంటూరు): జిల్లాకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్‌ నాగభైరు అప్పారావు (78) లండన్‌లో బుధవారం కన్నుమూశారు. చిలకలూరిపేట మండలం నాగభైరువారిపాలెం గ్రామానికి చెందిన అప్పారావు కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. చెన్నైలో కొంతకాలం వైద్యునిగా సేవలను అందించి 1972లో లండన్‌కు వెళ్లి స్థిరపడ్డారు. 48 సంవత్సరాలపాటు లండన్‌లో చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులుగా  ఆయన మంచి పేరు గడించారు. అక్కడే జనరల్‌ మెడిసిన్‌ కూడా చేశారు. ఆయన ఘంటసాల అభిమాని. విద్యార్ధి దశనుంచే ఘంటసాల పాటలను పాడేవారు. లండన్‌లో జరిగిన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన ఘంటసాల పాటలు పాడారు. లండన్‌ ఘంటసాలగా ఆయన పేరు గడించారు. ఎన్టీ రామారావు, భానుమతి తదితర అగ్రస్థాయి సినీ తారలు వచ్చినప్పుడు లండన్‌లో జరిగే స్వాగత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగేవి. సినీ నటుడు బాలకృష్ణతో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. లండన్‌ వెళ్లినప్పుడల్లా బాలకృష్ణ ఆయన వద్దకు వెళుతుంటారు. 
 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...