Jump to content

దుబాయి సర్వీసు.. ఇప్పట్లో లేనట్టే


snoww

Recommended Posts

దుబాయి సర్వీసు.. ఇప్పట్లో లేనట్టే

ఆసక్తి చూపించని విమానయాన సంస్థలు
ఈనాడు, అమరావతి

amr-brk1a_101.jpg

గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసు కల ఇప్పట్లో సాకారమయ్యేలా లేదు. ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్‌) ఆధ్వర్యంలో దుబాయి సర్వీసు కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. దుబాయికి సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకురాలేదు. గన్నవరం నుంచి దుబాయికి సర్వీసులు నడిపేందుకు అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలు, అనుమతులు, సీట్ల వెసులుబాటు ఉన్న విమానయాన సంస్థలు ముందుకొచ్చేవరకూ ప్రక్రియ వాయిదా పడినట్టే. ఏపీఏడీసీఎల్‌ చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు ప్రయాణికుల నుంచి లక్షల సంఖ్యలో విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయ సేకరణకు వెబ్‌సైట్‌, ఈమెయిల్‌, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో 2.5లక్షల మంది  వరకూ మద్దతు పలికారు. గతంలో సింగపూర్‌ సర్వీసును ఆరంభించే సమయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన మద్దతు కంటే.. దుబాయికి ఎక్కువ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌) పద్ధతిలో దుబాయి సర్వీసు నడిపేందుకు ఏపీఏడీసీఎల్‌ విమానయాన సంస్థలను ఆహ్వానిస్తూ బిడ్లను పిలిచింది. గత జనవరి 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు సీల్డ్‌ కవర్‌ టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 11న బిడ్లను తెరిచి.. వీజీఎఫ్‌ను అతి తక్కువకు కోట్‌ చేసిన విమానయాన సంస్థకు సర్వీసులను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. సంస్థను ఎంపిక చేసిన తర్వాత నెల రోజుల్లోనే దుబాయి సర్వీసును గన్నవరం నుంచి నడపాలని భావించారు. కానీ.. విమానయాన సంస్థలు ముందుకురాకపోవడంతో.. బిడ్ల దాఖలుకు గడువును మరికొంత పొడిగించినప్పటికీ విమాయాన సంస్థలు పెద్దగా ఆసక్తిచూపించడం లేదని ఏపీఏడీసీఎల్‌ అధికారులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

42 minutes ago, psycopk said:

Yea looks like it

Antha chiraku aithe you can connect through JFK or IAD and get airindia which has flight from Delhi to vijayawada

Link to comment
Share on other sites

49 minutes ago, megadheera said:

Antha chiraku aithe you can connect through JFK or IAD and get airindia which has flight from Delhi to vijayawada

 

1 hour ago, tom bhayya said:

Jai air aindia, sfo-delhi-gnnavaram 19 hrs 

Tg lo digatame kastam ante inka delhi naa

Link to comment
Share on other sites

1 hour ago, tom bhayya said:

Jai air aindia, sfo-delhi-gnnavaram 19 hrs 

seattle nunchi SFO..

9 minutes ago, psycopk said:

 

Tg lo digatame kastam ante inka delhi naa

@3$%

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

 

Tg lo digatame kastam ante inka delhi naa

Basic ga hyd digithe intiki driving oka 5 hrs 

ade air india anuko one stop and intlo vuntavu 

dubai and qatar badulu delhi stop 

basic ga one stop is easy to reduce time 

Link to comment
Share on other sites

Just now, manadonga said:

Dubai lo digatame 

asalu seattle to dubai fligjt vunda cancel ayyinda 

appudeppudo cancel annadu 

Emirates undi kada......

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...