Jump to content

డొల్ల కంపెనీలతో కొల్లగొట్టేశారు


snoww

Recommended Posts

డొల్ల కంపెనీలతో కొల్లగొట్టేశారు

 

మాయా సంస్థలతో 2000 కోట్ల లావాదేవీలు
చెల్లించని పన్నుకు  రూ. 224 కోట్ల ఐటీసీ
హైదరాబాద్‌లో ఎనిమిది డొల్ల కంపెనీల నిర్వాకం
విశాఖలో ఏకంగా 70 షెల్‌ కంపెనీల ఏర్పాటు
రూ. 400 కోట్ల విలువైన తప్పుడు రసీదుల సృష్టి
ఇద్దరు అరెస్టు.. హైకోర్టును ఆశ్రయించిన మరికొందరు
 ఈనాడు - హైదరాబాద్‌

12ap-main12a_1.jpg

డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి.. ఎలాంటి వ్యాపారం, లావాదేవీలు జరగకున్నా పెద్దయెత్తున వ్యాపారం జరిగినట్లు తప్పుడు రసీదులు (నకిలీ ఇన్‌వాయిస్‌లు) సృష్టించి భారీ మొత్తంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకున్న భారీ కుంభకోణాలను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అధికారులు వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్‌, విశాఖ కేంద్రాలుగా జరిగిన రెండు వేర్వేరు కుంభకోణాల్లో కోట్లాది రూపాయల జీఎస్టీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో 8, విశాఖలో ఏకంగా 70 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడటం గమనార్హం. హైదరాబాద్‌ కేంద్రంగా జరిగిన వ్యవహారంలో రూ. 1,284 కోట్ల వ్యాపారం జరిగినట్లు చూపి ప్రభుత్వం నుంచి రూ. 224 కోట్లు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందినట్లు తెలుస్తున్నా.. ఇది మరింత అధికంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిలో ఒక షెల్‌ కంపెనీ ద్వారా రూ. 17.62 కోట్ల మేర జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు, మరో కంపెనీలో రూ. 57 కోట్ల లావాదేవీలు జరిపి పన్ను, ఐటీసీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. జీఎస్టీ చట్టం ప్రకారం రూ. 5 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినవారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసే అధికారం ఉంది. దీంతో భరణి కమాడిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, భరణి కమాడిటీస్‌ ఇండియా భాగస్వామి, డైరెక్టర్‌ శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లి ఆర్థికనేరాల కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అలాగే ఈబీసీ బేరింగ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, బీఆర్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ట్రేడింగ్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరెస్టుకు ఉత్తర్వులు జారీ చేయగా హైకోర్టును ఆశ్రయించారు. వీటితో పాటు ఈ కుంభకోణానికి పాల్పడిన మొత్తం ఎనిమిది కంపెనీలకూ ఒక బడానేతకు చెందిన చెందిన గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌తో అనుబంధం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విచిత్రమేమిటంటే.. జీఎస్టీ రిటర్న్‌లను చూపి షెల్‌ కంపెనీలకు బ్యాంకుల నుంచి రూ. 700 కోట్ల మేర రుణాలు పొందినట్లు గుర్తించారు. అనంతరం ఈ కంపెనీలు నష్టాలతో మూతపడ్డాయని పేర్కొనడం విశేషం.

గుట్టు రట్టు చేసిన విశాఖ డీజీజీఐ
ఈనాడు, విశాఖపట్నం: డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి తప్పుడు రసీదులు సృష్టించి భారీఎత్తున జీఎస్టీ అక్రమాలకు పాల్పడుతున్న వెన్నపూస వెంకటసుబ్బారెడ్డిని విశాఖలోని ‘జీఎస్టీ నిఘా విభాగం డైరెక్టర్‌ జనరల్‌’ కార్యాలయ (డీజీజీఐ) అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఐదు రోజులుగా గుంటూరు, భీమవరం, హైదరాబాద్‌లలో సుబ్బారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయగా భారీ కుంభకోణం వెలుగు చూసింది. అతడు ఏకంగా 70 డొల్ల కంపెనీలను పెట్టినట్లు గుర్తించారు. రూ. 400 కోట్ల విలువైన తప్పుడు రసీదులు సృష్టించి అక్రమ పద్ధతుల్లో రూ. 60 కోట్ల ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ను పొందినట్లు తేల్చారు. హైదరాబాద్‌ డీజీజీఐ అధికారుల భాగస్వామ్యంతో జరిగిన ఆయా దాడుల్లో సుబ్బారెడ్డికి చెందిన పలు అక్రమాలు వెలుగుచూశాయి. వస్తువుల సరఫరా, కొనుగోళ్లు లేకుండానే చాలా తెలివిగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కొట్టేసిన విషయాన్ని అధికారుల విచారణలో నిందితుడు సుబ్బారెడ్డి అంగీకరించాడు. అతడి కార్యాలయాల నుంచి సుమారు 30 డొల్ల సంస్థలకు చెందిన చెక్‌బుక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులోని ఓ బ్యాంకు బ్రాంచిలో వాటి ఖాతాలను గుర్తించారు. తనకు తెలిసినవారి ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులను సేకరించి ఈ డొల్ల కంపెనీలను స్థాపించినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఉన్న కొన్ని సంస్థలు ఆయా తప్పుడు రసీదులను వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2017 జులై నుంచి 2019 జనవరి వరకు ఆ కుంభకోణం జరిగినట్లు వెల్లడైంది. నిందితుడు సుబ్బారెడ్డిని అరెస్టు చేయగా ఈనెల 26 వరకు రిమాండు విధించినట్లు డీజీజీఐ సంయుక్త సంచాలకులు మయాంక్‌శర్మ తెలిపారు.

హైకోర్టును ఆశ్రయించిన పలు సంస్థలు
జీఎస్‌టీ చెల్లింపుల వ్యవహారంలో సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌ (హైదరాబాద్‌) ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరాజు, హిందుస్థాన్‌ ఇస్పాత్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ వెంకట సత్య ధర్మావతార్‌, ఇన్ఫినిటీ మెటల్స్‌ ఎండీ రమణారెడ్డి, మరో సంస్థ డైరెక్టర్‌ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. పిటీషనర్లను అరెస్ట్‌ చేయవద్దని అధికారులకు స్పష్టంచేసింది. దేశం విడిచి పోరాదని, అధికారుల ముందు హాజరై విచారణకు సహకరించాలని పిటీషనర్లకు తెలిపింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

Quote

వీటితో పాటు ఈ కుంభకోణానికి పాల్పడిన మొత్తం ఎనిమిది కంపెనీలకూ ఒక బడానేతకు చెందిన చెందిన గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌తో అనుబంధం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

eenadu lo leader name mention seyyaledu antey doubt lekunda pilla congress leader ee @3$%

Link to comment
Share on other sites

ఒకరి అరెస్టు, మరొకరి అరెస్టుకు ఆదేశాలు... 
జీఎస్టీ చట్టం ప్రకారం రూ. 5 కోట్లకు మించి పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని అరెస్టు చేసే అధికారం ఉండటంతో ఈ షెల్‌ కంపెనీల ఎండీలను అరెస్టు చేసే పనిలో జీఎస్టీ అధికారులున్నారు. అందులో భాగంగా భరణి కమాడిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఎండీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. బీఆర్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌ ఎండీని కూడా అరెస్టు చేయాలనే ఆదేశాలున్నా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సదరు టీడీపీ ఎంపీ జీఎస్టీ అధికారుల దర్యాప్తును అడ్డుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ షెల్‌ కంపెనీల్లో ఓ కంపెనీ డైరెక్టర్‌ను తన ఇంట్లోనే పెట్టుకొని అరెస్టు కాకుండా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Quote

సదరు టీడీపీ ఎంపీ జీఎస్టీ అధికారుల దర్యాప్తును అడ్డుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

mana Pandula fights organizer Sujana vuncle aa sCo_^Y

Link to comment
Share on other sites

1 hour ago, Msdian said:

40 yrs industry ante aa mathram chethivatam chupiyalsinde... 

Papam pappu gadi mandabuddi tho dorikipothunaru

Vote ki note case ayyaka kooda TG lo enduku donga danda lu sesthunnaro pilla congress leaders 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...