Jump to content

YS Vivek's is Murder: PostMortem report reveals


maidhanam1

Recommended Posts

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన హత్యకు గురైనట్టు  పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. కొద్ది సేపటి క్రితమే కడపలోని రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేయడంతో ఆయన భౌతికకాయాన్ని పులివెందులకు తరలించారు. ఆయన శరీరంలో ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్టు  వైద్యులు వెల్లడించారు. తలలో రెండు వైపులా కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని, అలాగే,  ఛాతి, చేతిపైనా కత్తిపోట్లు ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా శరీరంపై ఏడు చోట్ల కత్తి పోట్లు ఉన్నాయని స్పష్టంచేశారు. 

వేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని తన నివాసంలో రక్తపు మడుగులో పడి ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. హత్య కోణంలోనే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పులివెందులలో వివేకా నివాసానికి వెళ్లిన ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సుమారు రెండు గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దీన్ని హత్యగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, వివేకా మరణం హత్యగా తేలడం సంచలనంగా మారింది. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? దీనిలో కుట్ర కోణాలేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో దృష్టిసారిస్తున్నారు.  

పులివెందులలోని వివేకా నివాసానికి వైఎస్‌ విజయమ్మ చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె బోరున విలపించారు. ఇప్పటికే వైకాపా కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైకాపా అధినేత జగన్‌ ఈ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Sreeven said:

As usual tdp valle chesaru ani ycp..ycp valle chesaru ani tdp

Tdp minister adinarayana reddy statement ichad ys avinash cheyinchadu ani ycp vallu inka vadalaru jagan case lo kooda ilage tdp vallu ststements icharu

Link to comment
Share on other sites

'వివేకా హత్య రాత్రి 11:30 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది'

కడప: మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మృతిపై నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్టుమార్టం రిపోర్టులో వైద్యులు వివేకాది హత్యేనని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. అయితే వివేకా మృతిపై కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ పలు కీలక విషయాలు మీడియాకు వివరించారు. వివేకానందరెడ్డిది హత్యేనని ఆయన వెల్లడించారు. తలపై మూడు, ఒంటిపై రెండు గాయాలున్నాయని తెలిపారు. వివేకా గదిలో ఫింగర్‌, ఫుట్‌ ప్రింట్స్‌ సేకరించామని, ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని ఎస్పీ చెబుతున్నారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఘటన రాత్రి 11:30కి జరిగినట్లు తెలుస్తోందన్నారు. రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల మధ్యలో.. ఇంటికి ఎవరెవరు వచ్చారు అనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదికలు ఇంకా రాలేదని రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు.

కొద్దిసేపటి క్రితం వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాన్ని అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. తలకు బలమైన గాయం, ఒంటిపై గాయాలు ఉండటంతో.. పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. వివేకానందరెడ్డి ఇంట్లో డాగ్‌ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. వివేకా ఇంటి ఆవరణలో తిరిగి పోలీస్‌ డాగ్‌ లోపలికి వెళ్లింది. వివేకా మృతి హత్య కేసుగా పోలీసులు నమోదు చేశారు. ఐపీసీ 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని సిట్‌ ఇన్‌చార్జ్‌ అమిత్ గార్గ్ పరిశీలించారు.

Link to comment
Share on other sites

18 minutes ago, DaleSteyn1 said:

Tdp minister adinarayana reddy statement ichad ys avinash cheyinchadu ani ycp vallu inka vadalaru jagan case lo kooda ilage tdp vallu ststements icharu

mana party vallu eami statements iicharu mari ?

Link to comment
Share on other sites

16 minutes ago, DaleSteyn1 said:

Tdp minister adinarayana reddy statement ichad ys avinash cheyinchadu ani ycp vallu inka vadalaru jagan case lo kooda ilage tdp vallu ststements icharu

ravindranth reddy started blaming adinarayana reddy, satish reddy, cbn, lokesh daani counter veedu statement ichinattu unnadu 

 

 

Link to comment
Share on other sites

2 minutes ago, timmy said:

ravindranth reddy started blaming adinarayana reddy, satish reddy, cbn, lokesh daani counter veedu statement ichinattu unnadu 

 

 

Posted new thread check

Link to comment
Share on other sites

11 minutes ago, Kontekurradu said:

mana party vallu eami statements iicharu mari ?

jagan annani CM ga choodaali ani viveka thapana pade vaadanta, and this unfortunate incident happened just before of months of jagan becoming CM

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...