Jump to content

జేడీ లక్ష్మీనారాయణ పోటీ ఇక్కడి నుంచేనా..?


Kool_SRG

Recommended Posts

break8a_9.jpg

అమరావతి: సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్‌ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక కేసుల్ని విచారించి, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన తొలిసారి ప్రజాజీవితంలోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అడుగులు ఏ పార్టీవైపు పడతాయనేది ఇన్నాళ్లూ స్పష్టత రాలేదు. చివరకు పవన్ కల్యాణ్‌ ఆహ్వానం మేరకు జనసేనలో చేరి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

విశాఖపట్నం నుంచి జనసేన తరఫున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్లు సమాచారం. అక్కడ  కాకపోతే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు. అయితే పవన్ కల్యాణ్‌ ఆయనను రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని కోరారు. దీంతో ఎక్కడ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉంటారనేది తేలలేదు. కర్నూలు లేదా నంద్యాల స్థానం నుంచి పోటీ చేయించాలనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మాత్రం విశాఖపట్నం వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అక్కడైతే ఉన్నత విద్యావంతులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్రాల వారు ఉంటారు కాబట్టి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి లక్ష్మినారాయణ పోటీ చేసే స్థానంపై స్పష్టత రానుంది. అలాగే పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు కూడా ఆయన చేపట్టనున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పవన్‌కు తోడుగా ప్రచారం నిర్వహించనున్నారు.

 

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

విశాఖపట్నం నుంచి జనసేన తరఫున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్లు సమాచారం. అక్కడ  కాకపోతే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు

 

2 minutes ago, Kool_SRG said:

అయితే పవన్ కల్యాణ్‌ ఆయనను రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని కోరారు. దీంతో ఎక్కడ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉంటారనేది తేలలేదు. కర్నూలు లేదా నంద్యాల స్థానం నుంచి పోటీ చేయించాలనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మాత్రం విశాఖపట్నం వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

Visakhapatnam best suited i feel....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...