Jump to content

బాబాయి కొంప ముంచేలా ఉన్నాడు జ‌గ‌న్‌


vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tnews/32245/-

బాబాయి కొంప ముంచేలా ఉన్నాడు జ‌గ‌న్‌

ఏపీలో వైసీపీ బ‌లంగా ఉన్న ఉన్న జిల్లాల్లో క‌డ‌ప త‌ర్వాత ప్ర‌కాశ‌మే. ఆ జిల్లాలో ఉన్న ఒకేఒక ఎంపీ సీటు ఒంగోల్‌. ఇక్క‌డ 12 ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గాలుంటే ఐదు బాప‌ట్ల కింద‌కు వస్తాయి. 7 నియోజ‌క‌వ‌ర్గాలు ఒంగోలు కింద‌కు వ‌స్తాయి. పొలిటిక‌ల్‌గా జిల్లాకు ఒక సీటు కిందే లెక్క‌. 

అయితే, 2014లో ఇక్క‌డ వైసీపీ గెలిచింది. ఈ లోక్‌స‌భ స్థానం ఏర్ప‌డిన నాటి నుంచి రెండు సార్లు త‌ప్ప మిగ‌తా అన్ని సార్లు కాంగ్రెస్‌-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలే గెలిచాయి. గ‌త ఏడాది వైసీపీ త‌ర‌ఫున వైవీ సుబ్బారెడ్డి గెలిచాడు. ఈసారి కూడా టిక్కెట్ అత‌నికే. గెలిచేది కూడా అత‌నే అని క్యాడ‌ర్‌తో స‌హా అంద‌రూ ఫిక్స‌య్యారు. కానీ జ‌గ‌న్ త‌న బాబాయి అయిన వైవీకి భారీ షాక్ అండ్ స‌ర్‌ప్రైజ్ క‌లిపి ఇచ్చేశాడు.

మొన్న‌టివ‌ర‌కు తెలుగుదేశంలో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి సుబ్బారెడ్డి టిక్కెట్ పీకి మాగుంట‌కు ఇచ్చాడు. దీంతో సుబ్బారెడ్డి తీవ్రంగా హ‌ర్ట్ అయ్యాడు. ఆయ‌న ఇగో ఎంత‌గా దెబ్బ‌తిందంటే... ఆ రోజు నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆ జిల్లాలో అడుగు పెట్ట‌లేదు. జ‌గ‌న్ బాబాయి కావ‌డం వ‌ల్ల ఈయ‌న‌కు త‌ప్ప టిక్కెట్ వేరేవాళ్ల‌కు పోదులే అని వైకాపా వ‌ర్గం బాగా స్ట్రాంగ్‌గా ఫిక్స‌య్యి ఆయ‌న సింక్ అయిపోయారు. 

ఈ నేప‌థ్యంలో టిక్కెట్ ఆయ‌న‌కు రాక‌పోవ‌డంతో అనుచ‌ర వ‌ర్గం కూడా ర‌గిలిపోతుంది. ఎట్టి ప‌రిస్థితుల్లో మాగుంట‌కు స‌పోర్ట్ చేయం అని భీష్మించుకుని కూర్చున్నారు. పోనీ వైవీతో మాట్లాడ‌దాం అంటే ఆయ‌న ఫోను లో కూడా దొర‌క‌లేదు. రెండ్రోజులుగా అస‌లు ఫోనే ప‌నిచేయ‌డం లేదు. 

దీంతో క‌చ్చితంగా గెలిచే సీటు కూడా టీడీపీ త‌న్నుకుపోతుందా అని పార్టీ జిల్లావ‌ర్గాలు బాధ‌ప‌డ‌తున్నాయి. జ‌గ‌న్ మొండి. ఆయ‌న ఎలాగూ విన‌డు. టిక్కెట్ మార్చ‌డు. బుజ్జ‌గిస్తాడో లేదో కూడా తెలీదు. వైవీ వ‌ర్గం మాత్రం వైవీ వ‌చ్చి స్వ‌యంగా చెబితే గాని మాగుంట‌కు స‌హ‌క‌రించ‌దు. ఈ నేప‌థ్యంలో జిల్లా పార్టీ విభాగంలో అయోమ‌యం, గంద‌ర‌గోళం నెల‌కొంది. జ‌గ‌న్ మొండిత‌నానికి ఈ నిర్ణ‌యం ఒక మ‌చ్చుతున‌క‌. 

మ‌రి మెట్టుదిగి బాబాయిని బుజ్జ‌గించి దారికి తెచ్చుకుంటాడా? లేక వైవీ లేక‌పోతే గెలిపించుకోలేనా అని మొండికేస్తాడా అన్న‌ది ఇంకా తేల‌డం లేదు. 22వ తేదీ మాగుంట నామినేష‌న్ వేస్తాడు. ఆరోజు వైవీ క‌నిపించ‌క‌పోతే ఇక ఆయ‌న హ్యాండిచ్చిన‌ట్టే లెక్క‌. 

Link to comment
Share on other sites

19 minutes ago, Salam_Rocky_Bhai said:

ongole lo subba reddy ki antu em cadare ledu unadi anta ycp cadare

Adanta maku telvadu

Ma paper lo vachindi inga Ongole tdp de antunna pulkas

Link to comment
Share on other sites

Arey సుబ్బారెడ్డి silent gaa unduu ledu antee bathroom lo rest teskovalisi vastadhi 

Itlu

జ‌గ‌న్ మొండి

Link to comment
Share on other sites

4 hours ago, solman said:

Arey సుబ్బారెడ్డి silent gaa unduu ledu antee bathroom lo rest teskovalisi vastadhi 

Itlu

జ‌గ‌న్ మొండి

super-super-nagababu-bhajana-chidathalu-janasena-pspk.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...