Jump to content

వైఎస్సార్సీపీలోకి మరో ప్రముఖుడు!


vatsayana

Recommended Posts

https://telugu.greatandhra.com/politics/political-news/dl-ravindra-reddy-to-join-ysrcp--98016.html

వైఎస్సార్సీపీలోకి మరో ప్రముఖుడు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా ప్రకటించారు మైదుకూరు మాజీఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి. గత కొన్నాళ్లుగా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉండి రెండువైపులా ప్రయత్నించిన డీఎల్ రవీంద్రారెడ్డి చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న విషయాన్ని ప్రకటించారు. వైఎస్ వ్యతిరేక శిబిరంలోని వ్యక్తిగా వ్యవహరించిన డీఎల్ ఇప్పుడు జగన్ పార్టీలోకి చేరబోతుండటం విశేషం.

కొన్నాళ్ల కిందటే డీఎల్ అనుచరులు కొంతమంది వెళ్లి జగన్ ను కలిశారు. మైదుకూరు టికెట్ ఆయనకు కేటాయించాలని వారు కోరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టడానికి ఇష్టపడని జగన్ వచ్చి  చేరాలని, వేరే అవకాశాలు ఏమైనా చూస్తామని చెప్పారట. అయితే డీఎల్ మాత్రం తను ఎమ్మెల్యేగానే పోటీచేయాలని అప్పుడు వెనక్కు తగ్గారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా సంప్రదింపులు జరిగాయి. అయితే చినబాబు అడ్డుపుల్ల వేసినట్టుగా టాక్. కేవలం ఆర్థికంగా కోటీశ్వరుడు అనే కారణం చూపి.. టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ కు మైదుకూరు టికెట్ కేటాయించారు. అక్కడ ఆయన నెగ్గే అవకాశం లేదని రిపోర్టులు వచ్చినా.. డబ్బును పరిగణనలోకి తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించారట చినబాబు. దీంతో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి డీఎల్ తో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. పార్టీలోకి చేరాలని జగన్ ఫోన్ చేసి అడగడంతో రవీంద్రారెడ్డి చేరడానికి రెడీ అయ్యారని సమాచారం. అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యతను ఇస్తామనే హామీతో డీఎల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. మైదుకూరు నుంచి మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు డీఎల్.

Link to comment
Share on other sites

ఏపీ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుదేశం పార్టీని వీడుతున్న వారి సంఖ్య అంతకంతకు ఎగబాకుతోంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త గోలి రామారావు, ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, మహారాణి సత్రం మాజీ చైర్మన్ కనకాల సుబ్రహ్మణ్యం, టీడీపీ కౌన్సిలర్లు ఆరేళ్ల వెంకట లక్ష్మి, విజ్ఙాపు రాజశేఖర్, గోకిన ప్రభాకర్‌తో పాటు 1000 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సమక్షంలో పార్టీ కండువాలతో వీరిని ఎమ్మెల్యే అభ్యర్ధి తోట వాణి, ఎంపీ అభ్యర్థి వంగా గీత, సమన్వయకర్త దవులూరి దొరబాబు వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

కృష్ణాజిల్లా అవనిగడ్డలో టీడీపీ నుంచి రాజేశ్వరస్వామి ట్రస్టు బోర్డు చైర్మన్‌ తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. తోకోడూరు మండలం పోటుమీధలో 100 కుటుంబాలు,  సాలేంపాలేం లో 50 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వచ్చాయి. అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థి సింహద్రి రమేష్ బాబు ఆద్వర్యంలో పార్టీ కండువాలతో వీరిని ఆహ్వానించారు. టీడీపీ కంచుకోట బందరులోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పేర్నినాని ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి.  పార్టీ కండువాలతో పేర్ని నాని సాదరంగా ఆహ్వానం పలికారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు తోట భోగయ్యతో పాటు పలువురు టీడీపీ నాయకులు, వెయ్యి మంది యువకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి
రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరికి స్వాగతం లభించింది.

Link to comment
Share on other sites

Hahaha

jagan & dlr... idharni choosthey navvu vasthundi.

2009-14 dlr was a big critic of jagan. Aadi corruption gurunchi ekkada paditheg akkada matladadu.

now joining ycp and shameless jagan taking him.

Link to comment
Share on other sites

2 minutes ago, Vaampire said:

Hahaha

jagan & dlr... idharni choosthey navvu vasthundi.

2009-14 dlr was a big critic of jagan. Aadi corruption gurunchi ekkada paditheg akkada matladadu.

now joining ycp and shameless jagan taking him.

Jagan antey ne shameless 🤓

ayina rajakeeyalo avanni pattinchukoru 

mokam meeda ummesima tuduchukuni potaru 

Link to comment
Share on other sites

1 minute ago, MiryalgudaMaruthiRao said:

Jagan antey ne shameless 🤓

ayina rajakeeyalo avanni pattinchukoru 

mokam meeda ummesima tuduchukuni potaru 

anthega mahanubavudu NTR ki chesina drohaniki valla pillallu eppatiki kshminchakudadu mana CBN ni..ayina egesukoni pillanichadu kada mana bala babu garu

Link to comment
Share on other sites

1 minute ago, cryptokababs said:

anthega mahanubavudu NTR ki chesina drohaniki valla pillallu eppatiki kshminchakudadu mana CBN ni..ayina egesukoni pillanichadu kada mana bala babu garu

Na post lo line 3 malli chaduvu 

Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

2014 lo tdp ki help chesadu mydukur lo as usual cbn vennupotu podichad  2019 ticket istha ani ycp lo join avthunadu

Abbo veedu tdp support cheste ycp gelichindi akkada 

Link to comment
Share on other sites

4 minutes ago, manadonga said:

Abbo veedu tdp support cheste ycp gelichindi akkada 

he worked for putta sudhakar yadav gelupu otami pakkana he worked for him ,check with local tdp folks .in return he expected ticket in 2019 last dakha try chesad andhuke antha kasi tho unnadu cbn meedha use n throw apply chesadu dl ravindra reddy meedha nenu em dl ni support chesthalenu fact chebthuna

Link to comment
Share on other sites

2 minutes ago, DaleSteyn1 said:

he worked for putta sudhakar yadav gelupu otami pakkana he worked for him ,check with local tdp folks .in return he expected ticket in 2019 last dakha try chesad andhuke antha kasi tho unnadu cbn meedha use n throw apply chesadu dl ravindra reddy meedha nenu em dl ni support chesthalenu fact chebthuna

Janala talk paiki alane cheppadu kani light tesukunnadu annaru 

only challa rama krishna reddy is great addition for ycp from tdp in seema migata anta scrap ne 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...