Jump to content

నెల‌కు 6 వేలు గ్యారంటీ... రాహుల్ డీటెయిల్స్ సెన్సేష‌న్‌


vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tnews/32362/Rahul-Gandhis-Minimum-Income-Scheme-Details

నెల‌కు 6 వేలు గ్యారంటీ... రాహుల్ డీటెయిల్స్ సెన్సేష‌న్‌

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త‌మ‌కు రాబోయే ఎన్నిక‌ల్లో ఓట్లు రాల్చే ప‌థ‌కానికి సంబంధించిన ప‌థ‌కం వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రెండు నెలల క్రితం చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచారసభలో ఈ పథకాన్ని తాము తెస్తామని కనీస ఆదాయ హామి పథకం గురించి రాహుల్‌ గాంధీ  ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. సుదీర్ఘ క‌స‌ర‌త్తు అనంత‌రం న్యూఢిల్లీలో పార్టీ మేనిఫెస్టోను ఆ ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా కనీస ఆదాయ పథకం గ్యారంటీ పథకం వివ‌రాల‌ను రాహుల్ వెల్ల‌డించారు. నిరుపేదలకు ఏడాదికి కనీసం రూ. 72,000 అంటే నెలకు రూ. 6000 ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ త‌ర‌ఫున‌ స్పష్టం చేశారు.

రాహుల్ ఎన్నిక‌ల హామీ త‌ర్వాత మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ కూలంకషంగా చర్చించి... సాధ్యాసాధ్యాలను నిర్ణయించింది. దేశంలోని కనీసం 20 కోట్ల మంది నిరుపేదలుగా ఉన్నారని పార్టీ అంచనా వేసింది. వీరందరికి నెలకు రూ.6 వేలు చొప్పున ఏడాదికి రూ. 72,000 చెల్లించాలని పార్టీ నిర్ణయించింది. దీన్నే ప్రధాన నినాదంగా జనంలోకి తీసుకెళతామని పార్టీ పేర్కొంది. తాజాగా ఈ వివ‌రాల‌ను రాహుల్ వెల్ల‌డించారు.
నెలకు రూ.6,000 వరకు అందించే ఈ పథకానికి రాహుల్ గాంధీ 'న్యాయ్। అని పేరు పెట్టారు.ఐదు కోట్ల కుటుంబాలు, తద్వారా 25 కోట్ల మంది ప్రజలకు ఈ న్యాయ్ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రపంచంలో ఇలాంటిది ఇదొక్కటే పథకం అని చెప్పిన రాహుల్ 'ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఎవరూ ఇలాంటి పథకం అమలుకు ప్రయత్నించలేదని' తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భారతీయ ఓటర్లకు ఈ పథకం ద్వారా తిరిగి చెల్లించి రుణం తీర్చుకుంటామని రాహుల్ గాంధీ అన్నారు. క‌నీస ఆదాయం ప‌థ‌కం  కింద దేశంలోని సుమారు 25 కోట్ల మందికి ఈ మొత్తం అందజేస్తామన్నారు. ధనికులకు బీజేపీ డబ్బులు ఇస్తే.. తమ పార్టీ నిరుపేదలకు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏడాది నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. తాము పథకం ప్రకటించే ముందు అన్ని విధాలుగా ఆలోచించామని, కచ్చితంగా అమలయ్యే పథకం తమదని రాహుల్‌ గాంధీ అన్నారు. పేదరికం చివరి అస్త్రం తాము సంధిస్తున్నామని రాహుల్‌ అన్నారు. దేశ జనాభాలో వీరు 25 శాతం మంది ఉంటారని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది.

Link to comment
Share on other sites

3 minutes ago, Spartan said:

72,000 crore per year...

3,60,000  for 5 years...

ante 1 year Indian Budget ni free ga istada...lol

Indian Budget 23 lakh Cr kada....  CITI#H@

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

ee scheme lokesh babu 10-15 years back ee design sesadu kada. 

Vignan ratthayya mastaru daggara saduuvkunnapdu, loki babu dream machine lo main dream idhe. 

Link to comment
Share on other sites

5 minutes ago, shamsher_007 said:

Vignan ratthayya mastaru daggara saduuvkunnapdu, loki babu dream machine lo main dream idhe. 

Chinna bob studied in Uppal little flower college anukunta

Link to comment
Share on other sites

56 minutes ago, Anta Assamey said:

Indian Budget 23 lakh Cr kada....  CITI#H@

5 crs people ki 72k per year ante 3.6 L crores only poor people ki panchadaniki.. iga defense ki education ki aggri ki infra ki main ga politicians ki ekkadikelli aa remaining 19 L cr nundi a

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...