boeing747 Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 ‘దోశకింగ్’కు యావజ్జీవం చెన్నై: దోశకింగ్‌గా పేరు పొందిన శరవణభవన్ హోటల్స్ యజమాని పి.రాజగోపాల్‌కు ఒక హత్య కేసులో మద్రాస్ హైకోర్టు విధించిన జీవిత కారాగారశిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసింది. జులై 7 లోపల లొంగిపోవాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో అనారోగ్య కారణాల రీత్యా ఆయన 2001 నుంచి బెయిల్‌పై ఉన్నారు. జ్యోతిషంపై నమ్మకంతో.. తూత్తుకూడికి చెందిన రాజగోపాల్ 1979లో మద్రాసులోని కేకే నగర్‌లో కామాక్షి భవన్ అనే హోటల్‌ను తీసుకొని శరవణభవన్‌గా పేరుమార్చాడు. అనంతరం ఆహారపదార్థాల అంశంలో మంచి నాణ్యతను అమలు చేయడంతో వ్యాపారం విస్తరించింది. అనతి కాలంలోనే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హోటల్స్‌ను నెలకొల్పాడు. అయనకు అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. జ్యోతిషంపై నమ్మకంతో మరో పెళ్లి చేసుకుంటే మరింత బాగుంటుందని తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ మేనేజర్ కుమార్తె జీవజ్యోతికి ప్రతిపాదించాడు. అయితే జీవజ్యోతి అప్పటికే ప్రిన్స్‌శాంతకుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. జ్యోతి, శాంతకుమార్‌లు వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో రాజగోపాల్ తన దగ్గర ఉన్న కొందరితో శాంతకుమార్‌ను 2001లో హత్య చేయించాడు. దోషిగా.. శాంతకుమార్ హత్యపై జీవజ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో హంతకులు రాజగోపాల్ పేరును వెల్లడించడంతో అతనిపై హత్యాకేసును నమోదుచేశారు. న్యాయస్థానంలో లొంగిపోయిన కొన్నాళ్లకు బెయిల్ లభించింది. 2004లో స్థానిక న్యాయస్థానం అతనితో పాటు హంతకులకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 2009లో మద్రాసు హైకోర్టు సైతం ఆ శిక్షనే ఖరారు చేసింది. దీనిని సవాల్‌చేస్తూ రాజగోపాల్ సుప్రీం కోర్టులో పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేయడంతో రాజగోపాల్ జులై 7 లోపల లొంగిపోనున్నాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Gudiwada_Bidda Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 dosa king became doshi king aa ? Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted March 29, 2019 Author Report Share Posted March 29, 2019 1 minute ago, Gudiwada_Bidda said: dosa king became doshi king aa ? Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 2001 lo murder, 2019 lo తీర్పు ..జీవితం చివరి time లో చేసిన తప్పుకి శిక్ష .. next life లో అన్న అనుభవిస్తాడేమో లో Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.