Jump to content

మోడీ ఎన్నిక‌ల ఖ‌ర్చు90,000 కోట్లు.. అట


vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tnews/32493/-90-000-

మోడీ ఎన్నిక‌ల ఖ‌ర్చు90,000 కోట్లు.. అట

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల గురించి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం తెరమీద‌కు వ‌చ్చింది. అధికార బీజేపీకి క‌ష్ట‌కాలంగా మారిన ఈ ఎన్నిక‌ల గురించి ఆ పార్టీ ఎత్తుగ‌డ‌లు ఏ విధంగా ఉన్నాయో తెలియ‌జెప్పే ప‌రిణామంలో ఊహించ‌ని అంశాన్ని సీనియ‌ర్ న్యాయ‌వాది ఒక‌రు వెల్ల‌డించారు. 

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ చేసే ఖర్చు రూ. 90 వేల కోట్లు అని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. 17వ లోక్‌సభకు దేశంలోని పార్టీలన్నీ కలిసి చేసే ఖర్చు దాదాపు లక్ష కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నదని అన్నారు. ఇందులో 90 శాతం బీజేపీదేనని ఆరోపించారు. 

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న  సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనదేశంలో ఎన్నికలనేవి పూర్తిగా డబ్బుతో కూడుకున్నవని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికలలో చేసే ఖర్చుకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని చెప్పారు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. 

రాజకీయ పార్టీలకు వచ్చే నిధులపై పారదర్శకత పాటించాలని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో కార్పొరేట్లు, విదేశాల నుంచి నిధులు అక్రమంగా అందుతున్నాయని అన్నారు. ఎన్నికలలో పోటీలో ఉండే మంచి అభ్యర్థుల కంటే గెలిచే అభ్యర్థులనే ప్రజలు ఎన్నుకుం టున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 

ఐదేళ్ల‌ బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రశాంత్‌ భూషణ్‌ తెలిపారు. న్యాయవ్యవస్థ, సీబీఐ, కాగ్‌, సీవీసీ, ఆర్బీఐ, ఎన్నికల కమిషన్‌ వంటి స్వతంత్ర సంస్థల స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల తేదీలను ప్రస్తుత సర్కారుకు అనుకూలంగా ప్రకటించడం జరిగిందన్నారు. 

గుజరాత్‌ నుంచి తమకు అనుకూలమైన అధికారులను తీసుకొచ్చి ఆ సంస్థ ప్రతిపత్తిని మంటలో కలిపారని విమర్శించారు. ఆయా సంస్థలలో సంఫ్‌ బావజాలం ఉన్న వ్యక్తులను నింపడం వాటి ఉనికికే ప్రమాదకరమని వెల్లడించారు. యూనివర్సిటీలలో వైస్‌ఛాన్స్‌లర్‌లను ఉపయోగించి ప్రశ్నించే విద్యావంతుల గొంతుకలను అణచివేస్తున్నారని చెప్పారు. మోడీ సర్కారు పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తున్నారని.. దళితులు, మైనారిటీలపై మూకదాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

10 minutes ago, snoww said:

inko 10k add chesi Jagan laa laksha kotlu ani round figure seyyalsindi 

Ayyi add cheste ayyindi anta 90000 cr 

leka pothe sagame anta 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...