vatsayana Posted April 3, 2019 Report Share Posted April 3, 2019 https://telugu.gulte.com/tnews/32563/YS-Jagans-Campaign-ends-by-7pm-Strategies-begin-then ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఐదు రోజులు. ఈ ఐదు రోజుల్లో ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క క్షణం మిస్సైనా దాని ఫలితం ఐదేళ్లపాటు వెంటాడుతుంది. అందుకే జగన్, చంద్రబాబు, పవన్ అస్సలు అవకాశం తీసుకోవడం లేదు. ఉదయం 7 గంటలకు బయటకు వస్తే.. రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఉదయం రావడం లేట్ అవుతుందేమో కానీ చంద్రబాబు మాత్రం అస్సలు లేట్ చేయడం లేదు. ఉదయాన్నే 8 గంటలకే మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత నాలుగు జిల్లాల్ని కవర్ చేసి.. సరిగ్గా రాత్రి 10 గంటలకు ప్రచారం ముగిస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరి ప్రచారం ఒకలా ఉంది. కానీ జగన్ ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాత్రి 7 గంటలకే తన ప్రచారాన్ని ముగిస్తున్నారు జగన్. 7 గంటల తర్వాత ఎవ్వరికీ అందుబాటులో ఉండడం లేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. జగన్ తన ప్రచారం ముగించుకున్న తర్వాత నేరుగా లోటస్ పాండ్‌కు వెళ్లిపోతున్నారు. లోటస్ పాండ్‌కు వెళ్లిన తర్వాత అక్కడ.. తనకు అందుబాటులో ఉన్న నేతలతో ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుంటున్నారు. అన్నింటికి మించి ఇప్పటివరకు వైసీపీకి ఉన్న టెంపోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అని సమాలోచన చేస్తున్నారు. లెక్కప్రకారం తన ప్రచారం ముగిసిన తర్వాత తాడేపల్లిలోని ఇంటికివెళ్లి చేసుకోవచ్చు. అయితే.. తన, తన అనుచరులు, నాయకుల ఫోన్లను అధికార పక్షం ట్యాప్ చేసే ప్రమాదం ఉందని భావించిన జగన్.. లోటస్‌పాండ్ నుంచే అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.