Jump to content

అమెరికాలో తెలంగాణ వ్యక్తి అనుమానాస్పద మృతి!


snoww

Recommended Posts

అమెరికాలో తెలంగాణ వ్యక్తి అనుమానాస్పద మృతి!

636900732370104152.jpg

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నాయకం కాశీ విశ్వనాథ్‌(26) నార్త్‌కరొలినాలోని షార్లెట్‌లో తన గదిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. విశ్వనాథ్‌ స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరిలోని నల్లపోచమ్మ వాడ. మూడున్నరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన విశ్వనాథ్‌ షార్లెట్‌లో ఇన్ఫోసిస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 10 గంటల వరకు విశ్వనాథ్‌ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు గది తలుపులు పగలగొట్టి లొపలికి వెళ్లారు. అక్కడ విశ్వనాథ్‌ అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులకు సమచారమిచ్చారు.

అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించారు. విశ్వనాథ్‌ మరణించాడని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, గతంలో తనకేమైన ఆరోగ్య సమస్యలున్నాయా? అని కాశీవిశ్వనాథ్‌ పెద్దనాన్న కుమారుడు ధన్‌శ్యాం నాథ్‌ను వైద్యులు అడిగారు. శరీర శాంపిల్స్‌ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కాశీ విశ్వనాథ్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతడి పెద్దనాన్న ఎన్‌.అశోక్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. విశ్వనాథ్‌ మృతిపై తమకు అనుమానాలున్నాయన్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపిస్తామని ఇన్ఫోసిస్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...