Jump to content

ఆడియో టేపు వ్యవహారం.. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు!


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-645364-telugu.html

  • ఈ ఆడియో టేపు ఏబీఎన్ ఛానల్ లో నిన్న ప్రసారం 
  • జూబ్లీ హిల్స్ పోలీస్ కు వైసీపీ ఐటీ వింగ్ ఫిర్యాదు
  • ఈ కుట్రలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణ

వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన పార్టీ నేతలతో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో లీకై కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ఏబీఎన్ ఛానల్ లో నిన్న ప్రసారం చేసింది. అయితే, ఆ ఆడియోలో మాటలు తనవి కాదని విజయసాయిరెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సహా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విజయసాయిరెడ్డి తరపున వైసీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ చల్లా మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డిని వాయిస్ ని డబ్బింగ్ చేసి ఆయన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ఛానెల్ లో అసత్య కథనాలు ప్రసారం చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆ ఛానెల్ లో ప్రసారం చేసిన వీడియో, ఆడియో టేపులతో పాటు, ఈ సందర్భంగా నిర్వహించిన చర్చా కార్యక్రమాల వీడియోలను సాక్ష్యాలుగా అందజేశారు. ఈ కుట్ర వెనుక రాధాకృష్ణతో పాటు చంద్రబాబు కూడా ఉన్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. కాగా, ఈ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో దీన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి బదిలీ చేసినట్టు సమాచారం.


ఏపీలో వైసీపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అంతమాత్రాన గెలిచినట్లు కాదని ఆ ఆడియోలో విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఉంది. ఈ అనుకూల పరిస్థితిని విజయంగా మార్చుకోవాలంటే జాగ్రత్తగా పనిచేయాలి. మన ప్రత్యర్థి చాలా భయంకరుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటలకు ఆఖరి ఓటు పడేవరకూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నట్టు వినపడుతుంది.  ‘మీరేం టెన్షన్ పడకండబ్బా.. మనం గెలుస్తున్నాం. అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. వీళ్లే జగన్ మోహన్ రెడ్డిని మిస్ లీడ్ చేసేది’ అన్న వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి చేసినట్టుగా ఆ ఆడియో టేపులో ఉంటుంది. దీనిపై నిన్న స్పందించిన విజయసాయిరెడ్డి ఆ గొంతు తనది కాదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...