Jump to content

భవిష్యత్‌లో 20 హైదరాబాద్‌లు నిర్మిస్తా: చంద్రబాబు


snoww

Recommended Posts

భవిష్యత్‌లో 20 హైదరాబాద్‌లు నిర్మిస్తా: చంద్రబాబు 
07-04-2019 21:31:34
 
636902694974670514.jpg
కాకినాడ: ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌కు పంపించి.. ప్రత్యేక హోదాను సాధించకుంటామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి కాకినాడలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు మంచి పాలన ఇచ్చానని ఏపీలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని బాబు చెప్పారు.
 
 
నా ఆంధ్రులను తిడితే ఖబడ్డార్ కేసీఆర్...
" నేరస్తులకు మోదీ కాపలా కాస్తున్నారు. కేసీఆర్‌ మనకు ద్రోహం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై తెలుగు వారి విగ్రహాలను కూల్చాడు. తెలుగుజాతి కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాను. నా ఆంధ్రులను తిడితే ఖబడ్దార్‌.. కేసీఆర్. కేసీఆర్‌ పారిపోయాడు.. కోడికత్తి పార్టీకి కేసీఆర్‌, మోదీ డబ్బులు ఇచ్చారు. నేను 2 వేలు పెన్షన్‌ ఇచ్చాం.. తెలంగాణ పెన్షన్ ఇచ్చేది వెయ్యి మాత్రమే. రేపే పసుపు కుంకుమ మూడో చెక్కు ఇస్తాం. చెక్కులు చెల్లవన్న వైసీపీ నేతలే చెల్లని కాసులు. ఐదేళ్లు ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ ఇస్తూనే ఉంటాను. 24500 కోట్లు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నా. రైతు రుణమాఫీకి మోదీ అడ్డుపడ్డారు. కేసీఆర్‌ దగ్గర డబ్బు తెచ్చుకొని ఊడిగం చేస్తారా?. వెయ్యి కోట్లు ఇచ్చి లక్ష కోట్లు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. పోలవరంను అడ్డుకోవడానికి కేసీఆర్‌ ఎవరు?. భద్రాచలం కూడా మనదే.. రాముడిని మేం కాపాడుకుంటాం. సాగర్‌, శ్రీశైలం కేసీఆర్‌కే ఇవ్వాలంట. కోడికత్తి పార్టీకి రోషం లేదు" అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 
20 హైదరాబాద్‌లు నిర్మిస్తా...!
"మనం వచ్చాక హైదరాబాద్‌ మసకబారిపోయింది. భవిష్యత్‌లో 20 హైదరాబాద్‌లు నిర్మిస్తాను. కాకినాడలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తాం. ప్రపంచం మొత్తం ఏపీకి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను. అభివృద్ధిని మధ్యలోనే ఆపేద్దామా? కుట్రలకు మనం బలైపోదామా? ఓట్లు కొంటామంటున్నారు? మీ కండకావరం ఏంటి?.. ఏమనుకుంటున్నారు? ఆంధ్రా జాతి డబ్బులు అమ్ముడుపోతుందా? మనమంతా తెలంగాణ ద్రోహులమంట. ప్రపంచంలోనే ఆంధ్రా వారిని కాపాడుకునే శక్తి నాకుంది. మాతో పెట్టుకుంటే హైదరాబాద్‌ బ్రాండ్ ఉండొద్దు. నేనే డెవలప్‌మెంట్ చేశా.. నీ గొప్పేం కాదు..?. మనకు ఆత్మగౌరవం లేదా?. రైతులకు ఒక్క పిలుపు ఇస్తే రాజధానికి 35 వేల ఎకరాలు ఇచ్చారు. అమరావతి, పోలవరం గురించి కోడి కత్తి పార్టీ మాట్లాడదు. డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తా. తూ.గో జిల్లాలో ప్రతి ఎకరాకు మూడు పంటలకు నీళ్లు ఇస్తా. రాష్ట్రంలోని ఐదు నదులను కలుపుతాను" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
 
 
కేసీఆర్ విర్రవీగుతున్నాడు..!
" బీజేపీ, కేసీఆర్‌తో లాలూచీపడి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు. 90 సీట్లు గెలిచానని కేసీఆర్‌ విర్రవీగుతున్నాడు. మన జీవితాలతో ఆడుకోవాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఏపీ ప్రజలకు విశ్వసనీయత లేదంటున్నారు. మీకు దొంగ లెక్కలు తప్ప.. నీతి నిజాయితీ తెలియవు" అని బాబు కాకినాడ సభలో వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Quote

మనం వచ్చాక హైదరాబాద్‌ మసకబారిపోయింది.

ala vadileyyakandi raa. evariki ina soopettandi raa

Link to comment
Share on other sites

2 minutes ago, DrBeta said:

He is going to lose ani DB already decided. No use of talking. 

I want him to win , But at the same time want Modi to win at Center with help of TRS and YCP then watch the fun for next 5 years @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...