Jump to content

Sri NCBN speaks with the NDTV team during one of his elections rallies


psycopk

Recommended Posts

56575826_10219520271736893_3706913078344

TDP Manifesto TOP 13 Points:
1) #పెన్షన్: పెన్షన్ దారులందరికి ప్రస్తుతం నెలకు ఇస్తున్న 2000 రూ||లు పెన్షన్ ను 3000 రూ||లు కు పెంచుతాం. వృద్ధాప్య పెన్షన్ దారుల వయస్సు 65 సం|| నుండి 60 సం||లకు తగ్గిస్తాం. 
2) #ఉచితవిద్యుత్: వ్యవసాయానికి 12 గంటలు ఉచిత విద్యుత్ పగటిపూట సరఫరా చేస్తాము. 
3) #అన్నదాతసుఖీభవ: రైతులకు అన్నదాత సుఖీభవ పధకం రానున్న 5 ఏళ్ళు కూడా అమలు చేస్తాము. వచ్చే ఖరీఫ్ నుండి కౌలు రైతులకు కూడా ఈ పధకాన్ని అమలు చేస్తాం. 
4) #పసుపుకుంకుమ: డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పధకాన్ని 5 Years కొనసాగిస్తూ ఆర్ధిక పరిపుష్టిని సమకూరుస్తాం. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందిస్తాము.
5) #చంద్రన్నభీమా: చంద్రన్న ప్రమాద భీమా సహాయం 5 లక్షల రూ||లు నుంచి 10 లక్షల రూ||లు పెంపు.
6) #అన్నకాంటీన్లు: గ్రామీణ ప్రాంతాల్లో 20,000 జనాభా దాటిన మేజర్ గ్రామ పంచాయితీల్లోనూ, మండల కేంద్రాల్లోనూ అన్న కాంటీన్లు ఏర్పాటు చేస్తాము 
7) #పోలవరంప్రాజెక్టును 2019 లో పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాము.
8 #చంద్రన్నపెళ్లికానుక మొత్తాన్ని లక్ష రూపాయలుకు పెంచుతాం. 
9) #NTRHousing: రానున్న ఐదేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి NTR గృహ నిర్మాణం చేపడతాం. పట్టణ ప్రాంతాలలో గృహనిర్మాణం తోపాటు రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, పార్కులు, స్కూళ్ళు లాంటి సదుపాయాలు ఏర్పాటుచేసి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో గృహనిర్మాణం చేస్తాం. 
10) #EBCCorporation: అగ్రవర్ణ పెద్ద కుటుంబాలను ఆదుకునేందుకు విద్య, వైద్యం, గృహనిర్మాణం మొదలైన అన్ని సంక్షేమ పధకాలను అమలు చేస్తాం. అగ్ర కులాలలోని పేదల చదువులకు స్వయం ఉపాధికి EBC కార్పొరేషన్ ద్వారా చేయూత అందిస్తాం.
11) బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కార్పొరేషన్లకు అవసరమైన మేరకు నిధులు సమకూరుస్తాము.
12) రానున్న ఐదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయిస్తాం. నిర్మాణంలో వున్న కాపు భవనాలన్నింటిని పూర్తి చేస్తాం.
13) #Yuvanestham: నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి.

#రైతులకు:
👉 వ్యవసాయానికి 12 గంటలు ఉచిత విద్యుత్ పగటిపూట సరఫరా చేస్తాము 
👉 అన్నదాత సుఖీభవ పధకం రానున్న 5 ఏళ్ళు కూడా అమలు చేస్తాము. వచ్చే ఖరీఫ్ నుండి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పధకాన్ని అమలు చేస్తాం.
👉 ఉచిత పంటల భీమా పధకం అమలు చేస్తాము.
👉 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాము.
👉 వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర లభించే విధంగా మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేస్తాం.
👉 చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని 2019 లో పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాము.

#మహిళలకు
👉 డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పధకాన్ని కొనసాగిస్తూ ఆర్ధిక పరిపుష్టిని సమకూరుస్తాం.
👉 డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందిస్తాము.
👉 వడ్డీలేని రుణాలు పధకాన్ని కొనసాగిస్తూ అర్హత పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతాం.
👉 మహిళా ఉద్యోగినులకు స్కూటర్ కొనుగోలుకు సబ్సిడీ ఇస్తాం.

#SC/STలకు:
👉 ఎస్సీ లకు 100 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్టీ లకు 50 రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించడం జరుగుతుంది.
👉 విదేశీ విద్యకు స్కాలర్ షిప్ రూ. 25 లక్షలకు పెంచుతాము.
👉 ఖాళీగా వున్న ఎస్సీ/ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం.
👉 ఎస్సీ, ఎస్టీ లకు సాధ్యమైనంత ఎక్కువ మంది లబ్ది దారులకు భూమి పంపిణీ చెయ్యటం జరుగుతుంది.
👉 మాదిగల సంక్షేమం కోసం లిడ్ క్యాప్ ను సాంఘిక సంక్షేమ పరిధిలోకి తీసుకొచ్చాం. ప్రతి జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ భవనాలు నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తాం.

#BCలకు:
👉 ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సులు చదివే అన్ని వర్గాల పెద్ద విద్యార్థులందరికీ పూర్తిగా ఫీజు రీయంబర్సుమెంటు చేస్తాం.
👉 200 రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించడం జరుగుతుంది.
👉 బ్యాంకులతో సంబంధము లేకుండా బి.సి లకు కార్పొరేషన్స్ ద్వారా 1 లక్ష వరకు ఋణాలు మంజూరు చేస్తాము.
👉 ఆధునిక టెక్నాలజీ తో షాపులు/షోరూములు పెట్టుకునే బి.సి కులాల వారికి 5 లక్షల వరకు ఋణాలు మంజూరు చేస్తాము. ఉదా|| రజకులకు వాషింగ్ మెషిన్/డ్రై క్లీనింగ్ షాపుల ఏర్పాటుకు, నాయీ బ్రాహ్మణులకు మోడరన్ సెలూన్స్/బ్యూటీ థెరపీ క్లీనిక్ ఏర్పాటుకు ఋణాలు.
👉 ప్రతి చేనేత కుటుంబానికి రూ. 4 వేల వేతన భృతిని ప్రతి సంవత్సరం అతని ఖాతాలో జమచేస్తాం.
👉 చేనేత కుటుంబాలకు ఉచిత ఆరోగ్య ఇన్సూరెన్స్ అమలుచేస్తాం.

#ముస్లిం మైనారిటీలు:
👉 ఇమామ్ లకు రూ. 5 వేల నుండి రూ. 7 వేలకు, మౌజన్ లకు రూ. 3 వేల నుండి రూ. 5 వేలకు పెంచుతూ వారి బ్యాంక్ ఖాతాలో వేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
👉 ఉర్దూను 2వ భాషగా పగడ్బందీగా అమలు చేస్తాం.
👉 త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం సోదరుల మనోభావాలను గౌరవిస్తాం.

#యువతకు:
👉 నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి.
👉 యువకులు రూ. 10 లక్షల లోపు పెట్టుబడితో స్థాపించే పరిశ్రమలకు వడ్డీని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది.
👉 రానున్న ఐదేళ్లలో ఐటీ రంగంలో 2.5 లక్షల IT ఉద్యోగాల కల్పన మరియు 3 లక్షల ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ కల్పించేందుకు కృషి చేస్తాం.

#TDPMission150

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...