vatsayana Posted April 10, 2019 Report Share Posted April 10, 2019 https://www.ap7am.com/flash-news-645747-telugu.html ఆమ్ స్టర్ డామ్ లో ఘటన గురువారం ముంబయి బయల్దేరాల్సిన విమానం కొనసాగుతున్న జెట్ ఎయిర్ వేస్ కష్టాలు భారత్ లో విమానయాన సంస్థల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పడానికి జెట్ ఎయిర్ వేస్ కడగండ్లు సరైన నిదర్శనం. కొన్నాళ్లుగా పైలట్లకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎదుర్కొంటోంది జెట్ ఎయిర్ వేస్. రుణభారం తీవ్రతరం కావడమే కాకుండా, నడుపుతున్న రూట్లలో ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడం జెట్ ఎయిర్ వేస్ కష్టాలను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన 90 శాతం విమానాలు విమానాశ్రయాలకే పరిమితం అయ్యాయి. అరకొర నిధులతో కొన్ని విమానాలు నడుపుతున్నా అవెప్పుడు నిలిచిపోతాయో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు కూడా జెట్ ఎయిర్ వేస్ పై పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా, జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానాన్ని నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో ఓ కార్గో సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆ విమానం ముంబయి నుంచి మంగళవారం ఆమ్ స్టర్ డామ్ చేరుకుంది. ఆ సర్వీసు తిరిగి గురువారం ముంబయి రావాల్సి ఉంది. కానీ, తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందేనంటూ ఆమ్ స్టర్ డామ్ విమానాశ్రయంలో కార్గో సేవలు అందించే ఓ సంస్థ గట్టిగా పట్టుబడుతోంది. దీనిపై జెట్ ఎయిర్ వేస్ వర్గాలు స్పందించాయి. ఆమ్ స్టర్ డామ్-ముంబయి సర్వీసును కార్యకలాపాలకు సంబంధించిన కారణాలతో రద్దు చేస్తునట్టు ఓ ప్రకటనలో తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.