Jump to content

ఏపీలో 80శాతం పోలింగ్‌కు అవకాశం: ద్వివేది


snoww

Recommended Posts

ఏపీలో 80శాతం పోలింగ్‌కు అవకాశం: ద్వివేది

11dwivedi1a_1.jpg

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 80శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది అంచనా వేశారు. ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అవకాశం ఉందని చెప్పారు.  పలుచోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని.. కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. గురువారం రాత్రి ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్‌ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్టు చెప్పారు.  సాయంత్రం 5 గంటల వరకు 65శాతం పోలింగ్‌ నమోదైనట్టు  ద్వివేది వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25చోట్ల చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. పోలింగ్‌ తర్వాతి రోజు ఆర్వో, పరిశీలకులు పోలింగ్‌ సరళిని పరిశీలిస్తారని చెప్పారు. ఫారం 17A పరిశీలించి రీపోలింగ్‌ చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారన్నారు. ఆర్వో, పరిశీలకుల నివేదికలను ఈసీకి పంపుతామన్నారు. పాక్షికంగా పోలింగ్‌ ఆగిన చోట అడ్జర్న్‌ పోలింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే రీపోలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. కొన్ని ఈవీఎంలు మాక్‌ పోలింగ్‌ తర్వాత పనిచేయలేదన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒక్క హింసాత్మక ఘటనా జరగలేదన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన హత్య ఘటనల నేపథ్యంలో ఓటింగ్‌ కాస్త ఆలస్యమైందని చెప్పారు. స్థానిక ఆర్వో పరిశీలన అంశాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. రాయలసీమలో ఘర్షణ వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్పారు.
పూతలపట్టులో రీపోలింగ్‌కు అవకాశం
చిత్తూరు జిల్లా పూతలపట్టులో రీపోలింగ్‌కు అవకాశం ఉందని ద్వివేది చెప్పారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ ఆలస్యమైందని.. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరతానని తెలిపారు. సాయత్రం 6 గంటల లోపు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ సజావుగానే జరిగిందన్నారు. రాష్ట్రంలో సుమారు 80శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని తాము అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో సాయంత్రం 5గంటల వరకు 70.67 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల అధికారి ఉమేశ్‌ సిన్హా వెల్లడించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...