Jump to content

కిట్‌తో కిటకిట


snoww

Recommended Posts

కిట్‌తో కిటకిట

కాన్పులతో సర్కారు ఆస్పత్రుల్లో రద్దీ
రెండేళ్లలో 31 నుంచి 64 శాతానికి పెరుగుదల
అత్యధికంగా జననాలు హైదరాబాద్‌లోనే
మాతాశిశు మరణాలూ తగ్గుముఖం
కిట్‌తో తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ
ప్రసవాలకు చిరునామాగా మారిన సర్కారు దవాఖానాలు
ఈనాడు - హైదరాబాద్‌

hyd-main3a_21.jpg

కేసీఆర్‌ కిట్‌ పథకం పుణ్యమాని తెలంగాణలోని సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపునకు మించి పెరిగింది. రెండేళ్ల కిందట ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల శాతం 31 ఉండగా.. ఇప్పుడు 64 శాతాన్ని అధిగమించడం విశేషం. గతేడాది కాలంలోనే దాదాపు 6 శాతానికి పైగా పెరగడం గమనార్హం. సర్కారు దవాఖానాలకు వైభవం తీసుకొచ్చేలా, వాటిపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా చేసిన ఘనత కేసీఆర్‌ కిట్‌దే. ఈ పథకం కింద తల్లీబిడ్డల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో మాతాశిశు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం అమలు తీరుపై మహబూబ్‌నగర్‌, నల్గొండ, సిద్దిపేట తదితర ప్రభుత్వాసుపత్రులను పరిశీలించి ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కాన్పులు 95 శాతానికి పైగానే అవుతున్నా.. ఇందులో తెలంగాణ ఏర్పడేనాటికి ప్రభుత్వాసుపత్రుల్లో జరిగేవి కేవలం 31 శాతమే. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో దాదాపు 74 శాతం ప్రసూతి కోతలే (సిజేరియన్‌) ఉండటం గమనార్హం. ఒక్కో సిజేరియన్‌కు ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.30 వేల నుంచి రూ.లక్షన్నర వరకూ స్థాయిని బట్టి ఖర్చవుతోంది. ఇదే సమయంలో గర్భసంచి శస్త్రచికిత్సలను అడ్డగోలుగా ప్రైవేటులో నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలున్నాయి. ఈ విషయాలపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మాతాశిశు సంక్షేమంపై దృష్టి పెట్టారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేస్తున్న అడ్డగోలు కాన్పు కోతలను నివారించేందుకే ‘కేసీఆర్‌ కిట్‌’ పథకానికి శ్రీకారం చుట్టారు. 2017 జూన్‌ 3న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం అమలుకు ఏటా సుమారు రూ.600 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది.

hyd-main3g.jpg

కేసీఆర్‌ కిట్‌ పథకం కింద కేవలం ప్రభుత్వాసుపత్రుల్లోనే గత రెండేళ్లలో మొత్తంగా 5,81,782 ప్రసవాలు జరిగాయి. రాష్ట్రం మొత్తమ్మీద అత్యధికంగా గర్భిణులు నమోదైన జిల్లాల్లో హైదరాబాద్‌ (1,40,716) మొదటి స్థానంలో నిలవగా.. మేడ్చల్‌ (96,939), రంగారెడ్డి (84,948), మహబూబ్‌నగర్‌ (61,607), నిజామాబాద్‌ (61,284) జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ప్రసవాల్లోనూ హైదరాబాద్‌ 92,327 కాన్పులతో అగ్రభాగాన నిలవగా, మహబూబ్‌నగర్‌ (28,251), వరంగల్‌ అర్బన్‌ (27,321), సంగారెడ్డి (26,845), నిజామాబాద్‌ (24,523) జిల్లాలు గుర్తింపు పొందాయి.

hyd-main3f_1.jpg

నగదు ప్రోత్సాహకం విజయవంతం
*  కేసీఆర్‌ కిట్‌ విజయవంతం కావడం వెనుక ప్రధానంగా నగదు ప్రోత్సాహక పథకం పాత్ర ప్రముఖంగా ఉంది.
*  గర్భిణి దశ నుంచి శిశువుకు తొమ్మిదో నెల వచ్చే వరకూ నాలుగు విడతలుగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకే వేస్తుండటంతో మహిళల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
*  బాలిక జన్మిస్తే రూ.13 వేలు.. బాలుడు జన్మిస్తే రూ.12 వేల చొప్పున ప్రతి కాన్పునకు ప్రభుత్వం అందిస్తోంది.
*  గర్భం దాల్చగానే తమ వివరాలను బ్యాంకు ఖాతాతో సహా ఆన్‌లైన్‌లో ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం కింద నమోదు చేసుకోవాలి.
*  గర్భిణి 5-6 నెలల మధ్యకాలంలో పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చినప్పుడు తొలి విడతగా రూ.3 వేలు.
*  ప్రసవం సమయంలో బాలుడు జన్మిస్తే రూ.4 వేలు, బాలికయితే రూ.5 వేలు. ఇప్పుడు శిశువుకు అందించాల్సిన తొలిదశ టీకాలు ఇప్పించాలి.
*  ఈ సమయంలోనే తల్లీబిడ్డలకు ఉపయోగపడే రూ.2 వేల విలువైన 16 రకాల వస్తువులనూ అందించడం
*  శిశువుకు మూడున్నర నెలల వయసులో టీకాలు ఇప్పించినప్పుడు రూ.2 వేలు.
*  శిశువుకు 9 నెలల సమయంలో టీకాలు ఇప్పించగానే.. ఆఖరి విడత రూ.3 వేలు బ్యాంకు ఖాతాలో చేరతాయి.
*  కొన్నిచోట్ల కేసీఆర్‌ కిట్‌ పథకం కింద మహిళల ఖాతాల్లోకి డబ్బులు ఆలస్యంగా జమ చేస్తున్న సంఘటనలు ఎదురవుతున్నా.. వాటిని చక్కదిద్దడంపై దృష్టి పెట్టినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

hyd-main3b_14.jpg

 

hyd-main3c_6.jpg

కాన్పు గదుల ఆధునికీకరణ

hyd-main3d_1.jpg

కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతమవ్వడంతో ప్రభుత్వాసుపత్రులకు ప్రసవాల కోసం వచ్చేవారి సంఖ్య పెద్దఎత్తున పెరిగింది. తొలినాళ్లలో పాత కాన్పు గదుల్లోనే ప్రసవాలు జరుగుతుండటం, ఒకే శస్త్రచికిత్స గదిలో ఇతర విభాగాల శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి రావడంతో ఇన్‌ఫెక్షన్ల సంఖ్య పెరిగింది. దీని నివారణకు కాన్పు గదుల ఆధునికీకరణపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని జిల్లా ఆసుపత్రుల దాకా అన్ని స్థాయిల్లోనూ కాన్పు గదులను ఆధునికీకరించడానికి చర్యలు చేపట్టింది. మొత్తం 305 కాన్పు గదుల ఆధునికీకరణలో భాగంగా ఇప్పటి వరకూ దాదాపు 200కి పైగా ప్రసవ గదులను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దింది. ప్రసూతి ఆసుపత్రుల్లో ఇప్పటికే పేట్లబురుజు, గాంధీ, నిలోఫర్‌ తదితర దవాఖానాల్లో ప్రసవానంతర అత్యవసర చికిత్సల కోసం ప్రత్యేకంగా ఒక్కో దాంట్లో 10 పడకలతో ఐసీయూలను ఏర్పాటు చేసింది. రిమ్స్‌ ఆదిలాబాద్‌, వనపర్తిల్లోనూ ప్రసూతి ఐసీయూలను నెలకొల్పడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకొని అనిస్థిటిస్ట్‌, పిడియాట్రిషియన్‌, గైనకాలజిస్టు పోస్టులను మంజూరు చేసింది.

తల్లీబిడ్డల ఆరోగ్యంలో పురోగతి

hyd-main3e_1.jpg

*  నవజాత శిశు మరణాల రేటు ప్రతి వేయి జననాలకు 28కి తగ్గింది. ఐదేళ్ల కిందట ఇది 39గా ఉండేది.
*  బాలింత మరణాల రేటు ప్రతి లక్ష ప్రసవాలకు 70కి తగ్గింది. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం ఇది 90గా ఉండేది.
*  సమగ్ర టీకాల అమలు 60 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది.
*  నవజాత శిశు సంరక్షణ కేంద్రాల(ఎస్‌ఎన్‌సీయూ)ను 21 నుంచి 31కి పెంచింది. ఎస్‌ఎన్‌సీయూల్లో అత్యుత్తమ సేవలకు దేశంలోనే రెండో అత్యుత్తమ పురస్కారం తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది.
Link to comment
Share on other sites

this is one amazing scheme...institutional deliveries have gone up like crazy. also saves a lot of money to the exchequer otherwise arogyasri ani private hospitals dandukunevi with C-sections

next major program is to slated to get the vitals of every citizen, that will be a game changer in health reforms in my opinion, also that will save thousands of lives

Link to comment
Share on other sites

8 minutes ago, snoww said:

Education is another sector which needs focus

free chaitanya parayana mafia povali. 

chala residential schools kattinaru but inka chala jaragali esp higher education and professional studies, complete reform tesukoni ravali, mana needs taggatu mana education system undali, monna hyderabad ki velte carpernters, tile pani chese vallu mottamu rajastan, up, bihar nunde unnaru.so many high rises in the western corridor but specialized workers chala mandi vere states nunde unnaru. aa skilled education provide chesevi chala takkuva unnayi 

Link to comment
Share on other sites

32 minutes ago, hyperbole said:

chala residential schools kattinaru but inka chala jaragali esp higher education and professional studies, complete reform tesukoni ravali, mana needs taggatu mana education system undali, monna hyderabad ki velte carpernters, tile pani chese vallu mottamu rajastan, up, bihar nunde unnaru.so many high rises in the western corridor but specialized workers chala mandi vere states nunde unnaru. aa skilled education provide chesevi chala takkuva unnayi 

Agreed. If TG residents are better trained then they don't need to go to middle east countries and get exploited there. 

Link to comment
Share on other sites

47 minutes ago, kittaya said:

Na lanti bachelor's ki eelanti kits aeppudu upayogam

Navvuthunna chandranna bommunna “NTR rakshak” thodugulu vaaddam oka nela aapey.. 9 months lo nee number b osthahdi 

Link to comment
Share on other sites

22 minutes ago, TOM_BHAYYA said:

Navvuthunna chandranna bommunna “NTR rakshak” thodugulu vaaddam oka nela aapey.. 9 months lo nee number b osthahdi 

Adi apesi KCR kits tisukunte saripodsaripodi

!Q

 

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

Education is another sector which needs focus

free chaitanya parayana mafia povali. 

Neither Dora, nor CBN, nor Jaggu can do anything about that. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...