Jump to content

విశాఖలో రేవ్‌ పార్టీ.


snoww

Recommended Posts

విశాఖలో రేవ్‌ పార్టీ.. ఆపై డ్రగ్స్‌ పూనకం

సాగర తీరంలో ఘటన 
ఆన్‌లైన్‌లో మాదకద్రవ్యాల కొనుగోలు 
పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న కోణాలు 
ఈనాడు - విశాఖపట్నం

16ap-main9a_4.jpg

విశాఖ సాగర తీరంలో శనివారం రాత్రి రేవ్‌ పార్టీ, అక్కడ నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో అనేక కీలకాంశాలు బయటపడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్సు దాడులు నిర్వహించినపుడు కొంతమంది యువకుల వద్ద నిషేధిత మాదకద్రవ్యాలు ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ దొరికాయి. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులిచ్చిన సమాచారం మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎం.సత్యనారాయణ అనే యువకుడిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పార్టీలో పాల్గొన్న సుమారు 15 మందిని పోలీసులు విచారించగా విస్మయకర అంశాలు వెలుగులోకొచ్చాయి. నగరంలో పలువురు యువతీయువకులు ఆన్‌లైన్లో నిషేధిత మాదకద్రవ్యాలను కొంటున్నారు. ఇలాంటి వారి కోసమే కొన్ని మాదకద్రవ్యాల విక్రేతల ముఠాలు అత్యంత రహస్యంగా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నట్లు తేలింది. వీటి నుంచి ఎం.డి.ఎం.ఎ.(మిథిలిన్‌ డైఆక్సీ మిథైన్‌ ఫిటామిన్‌), ఎల్‌.ఎస్‌.డి.(లైసర్జిక్‌ యాసిడ్‌ డైఇథలమైడ్‌) మాదకద్రవ్యాలను కొన్న నిందితులు రుషికొండలో జరిగిన రేవ్‌ పార్టీలో యువతకు గ్రాము రూ.4 వేల చొప్పున విక్రయించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. కొకైన్‌, హెరాయిన్‌లకన్నా ఇవి ఎక్కువ మత్తు కలిగించేవని తెలుస్తోంది. అరుదైన వీటిని విశాఖలో వినియోగించడం సంచలనం కలిగిస్తోంది. మాదకద్రవ్యాలతో బహిరంగంగా పార్టీలు చేసుకున్న ఉదంతాలు విశాఖ నగర చరిత్రలో ఇప్పటివరకూ లేవు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖమైనదిగా ఉన్న రుషికొండ బీచ్‌కు ఆనుకుని ఉన్న ఓ బీచ్‌లో బహిరంగంగా మాదకద్రవ్యాలతో పార్టీ చేసుకున్న అంశం తాజాగా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. నగరంలో మాదకద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న కొందరు వ్యాపారులు వాటిని రహస్య ప్రాంతాల్లో భద్రపరిచినట్లు పోలీసులకు సమాచారం అందింది. 
మద్యం సరఫరాకు క్షణాల్లో అనుమతులు 
రుషికొండ బీచ్‌లో రాత్రి విందు ఇవ్వడానికి, ఆ పార్టీలో మద్యం పంపిణీకి గాజువాక ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయ అధికారులు ఆగమేఘాలపై స్పందించడం గమనార్హం. నగరంలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరుడైన వ్యక్తి కుమారుడు దరఖాస్తు చేసిన వెంటనే అధికారులు క్షణాల్లో స్పందించారు. ఈనెల 13న దరఖాస్తు చేయడం, అదే రోజున ఎక్సైజ్‌ అధికారులు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. అదే రోజు రాత్రి ఇచ్చిన పార్టీ కాస్తా రేవ్‌ పార్టీగా రూపాంతరం చెందింది. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశానికి అనుకుని ఉన్న బహిరంగ ప్రదేశంలో మద్యంతో పార్టీ చేసుకోడానికి అనుమతివ్వడంపైనా విమర్శలున్నాయి.

Link to comment
Share on other sites

Quote

రుషికొండ బీచ్‌లో రాత్రి విందు ఇవ్వడానికి, ఆ పార్టీలో మద్యం పంపిణీకి గాజువాక ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయ అధికారులు ఆగమేఘాలపై స్పందించడం గమనార్హం. నగరంలోని ఓ ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరుడైన వ్యక్తి కుమారుడు దరఖాస్తు చేసిన వెంటనే అధికారులు క్షణాల్లో స్పందించారు. ఈనెల 13న దరఖాస్తు చేయడం, అదే రోజున ఎక్సైజ్‌ అధికారులు అనుమతులు మంజూరు చేయడం గమనార్హం.

From Saakshi :

ఎక్సైజ్‌ అధికారుల అత్యుత్సాహం..
ఇక ఈవెంట్‌ పేరిట నిర్వహిస్తున్న ఈ రేవ్‌ పార్టీకి ఎక్సైజ్‌ శాఖ అధికారులు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈనెల 13వ తేదీ రాత్రి తమ ఈవెంట్‌లో మద్యం సరఫరా చేసేందుకు అనుమతించాలని.. ఆ రోజు ఉదయం కాశీ విశ్వనాథ్‌ కుమారుడు నరేంద్రకుమార్‌ అడగ్గానే అనుమతులిచ్చేశారు. వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడానికి ఎక్సైజ్‌ శాఖ అనుమతించకూడదు. లిక్కర్‌ షాపుల మాదిరిగానే ఈవెంట్లలో సైతం రాత్రి 11 గంటలకే మద్యం సరఫరా ముగించాలి. కానీ తెల్లవారుజాము వరకు కూడా యువతీయువకులు తాగి ఊగినా పట్టించుకోవడం మానేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

Rave Party At Rushikonda - Sakshi

రుషికొండలో విశ్వనాథ్‌ బీచ్‌ఫ్రంట్‌ నిర్మించిన కట్టడాలు. రేవ్‌పార్టీ జరుగుతున్న దృశ్యం

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతలు తమ కాసుల కక్కుర్తితో యువతను పెడదారి పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈవెంట్ల పేరుతో రేవ్‌ పార్టీలు నిర్వహిస్తూ విశాఖలో విష సంస్కృతికి బీజం వేస్తున్నారు. తాజాగా రుషికొండ ఇసుక తిన్నెలపై ఈవెంట్‌ పేరుతో రేవ్‌ పార్టీ నిర్వహించారు. అయితే వీటిని ఈవెంట్ల కింద చూపిస్తూ.. కాశీ విశ్వనాథ్‌(జిల్లా మంత్రి అనుచరుడు)కు చెందిన ‘విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ పర్యాటక శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంది. వాస్తవానికి సాగరతీరంలో పర్యావరణ అనుమతులు లేకుండా ఈవెంట్ల నిర్వహణకు లైసెన్స్‌ ఇవ్వకూడదని గతేడాది హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ మంత్రి అనుచరుడు కావడం, ముడుపులు ముట్టడంతో ఎలాంటి అడ్డు చెప్పకుండా.. పర్యాటక శాఖ అనుమతులిచ్చేసింది.
 
రేవ్‌ పార్టీతో బోణీ..
రుషికొండ సాగరతీరం సర్వే నంబర్‌ 61లో బీచ్‌ సంబంధిత క్రీడలు, ఈవెంట్ల నిర్వహణ పేరిట విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నుంచి 15 ఏళ్లకు గానూ లీజు అనుమతులు తెచ్చుకుంది. నెలకు రూ.2 లక్షల చొప్పున ఏడాదికి రూ.24 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత స్థాయిలో అధికార బలాన్ని ఉపయోగించి ఆగమేఘాలపై లైన్‌ క్లియర్‌ చేయించుకుంది. ఏపీటీడీసీలో ప్రాజెక్ట్సు చూసే ఓ ఉన్నతాధికారి ఇందుకు సహకరించడంతో అనుమతులు తేలిగ్గా వచ్చేశాయి. విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ ఏపీటీడీసీతో లీజు ఒప్పందం కుదుర్చుకుందన్న సంగతి ఆ శాఖలో చాలామంది అధికారులకు తెలియకపోవడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రికి విశ్వనాథ్‌ ప్రధాన అనుచరుడిగా ఉండడం వల్ల లీజు పని సులువైనట్లు తెలిసింది. ఈ సంస్థ ఈవెంట్లకు అవసరమైన రెస్టారెంట్లు, ఇతర ఏర్పాట్లను కూడా పూర్తి చేయలేదు. కానీ ఈ సంస్థ రెండ్రోజుల క్రితం రేవ్‌ పార్టీతో ‘ఈవెంట్‌కు’ బోణీ కొట్టింది. మద్యంతో పాటు మాదకద్రవ్యాలను సేవించిన పలువురు యువతీ, యువకులు ఒళ్లు మరిచి చిందులేశారు. మసక చీకట్లో ఇసుక తిన్నెలపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ విశాఖ ఖ్యాతిని మంటగలిపారు.  

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

From Saakshi :

ఎక్సైజ్‌ అధికారుల అత్యుత్సాహం..
ఇక ఈవెంట్‌ పేరిట నిర్వహిస్తున్న ఈ రేవ్‌ పార్టీకి ఎక్సైజ్‌ శాఖ అధికారులు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈనెల 13వ తేదీ రాత్రి తమ ఈవెంట్‌లో మద్యం సరఫరా చేసేందుకు అనుమతించాలని.. ఆ రోజు ఉదయం కాశీ విశ్వనాథ్‌ కుమారుడు నరేంద్రకుమార్‌ అడగ్గానే అనుమతులిచ్చేశారు. వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడానికి ఎక్సైజ్‌ శాఖ అనుమతించకూడదు. లిక్కర్‌ షాపుల మాదిరిగానే ఈవెంట్లలో సైతం రాత్రి 11 గంటలకే మద్యం సరఫరా ముగించాలి. కానీ తెల్లవారుజాము వరకు కూడా యువతీయువకులు తాగి ఊగినా పట్టించుకోవడం మానేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలిసింది.

All nalla fuks, no thanks

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...