Jump to content

**** Master Thread for All Pilla Congress PPT's *****


snoww

Recommended Posts

13346518_1309650925715162_44937809670264

 

దేశంలోనే మొదటిసారిగా విశాఖపట్నం సముద్ర తీరంలో సాగర ఈత కొలను( sea pool)లను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సముద్ర స్నానానికని వచ్చి ఎంతోమంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు. గత పదేళ్ళలో 75మంది మహిళలతో సహా 465మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు నగరానికి ఉన్న 23 కిలోమీటర్ల బీచ్ రోడ్డు వెంబడి సాగర ఈత కొలనులను నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థల ఇంజనీర్లు చేపట్టనుండగా, రాష్ట్ర పర్యాటక శాఖ నిధులను సమకూరుస్తుంది.

Link to comment
Share on other sites

14370057_1405675376112716_76539077457317

 

రాష్ట్రం నుంచి 9 రకాల వ్యాధులను 100శాతం నిర్మూలించటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 5/23/2019 at 10:13 PM, snoww said:

 

నలభై ఏళ్ళ రాజకీయానుభవంలో ఇలాంటి మాయలు ఎన్ని చూడలేదు! తాటాకు చప్పుళ్ళలాంటి ఎగ్జిట్ పోల్స్ తో సింహాన్ని కలవరపెట్టాలనుకుంటారా? 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

65081332_2729402633739977_63426570309850

నవరత్నాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ గారు... తొలిరోజు నుంచే యూ టర్న్ లు తీసుకోవడం మొదలుపెట్టారు. మూడు వేల వరకు పింఛన్ వస్తుందని ఆశించిన వారికికేవలం 250 రూపాయలతో సరిపెట్టారు. ఇక రాష్ట్రమంతా కరెంటు కోతలతో సతమతవుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన కరెంటు బకాయిలపై తెరాస ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు జగన్. రైతులకు రుణమాఫీ ఇవ్వనన్నారు. అన్నదాత సుఖీభవను రద్దుచేశారు. దీంతో చేతిలో పెట్టుబడి లేక రైతు అల్లాడుతుంటే... మరోవైపు విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. డెల్టా రైతులకు పట్టిసీమ జలాలు వస్తాయన్న భరోసా లేదు. ఆంధ్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయి. నిరుద్యోగులకు భృతి నిలచిపోయింది. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోండి అన్నారు. ఇవి కాకుండా తెలుగుదేశం కార్యకర్తలపై 150కి పైగా భౌతిక దాడులు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పొతే నెలరోజుల్లోనే ఎన్నో కష్టాలకు గురవుతున్నారు ప్రజలు. ఇదేనా ప్రజలు కోరుకున్న పాలన?

Link to comment
Share on other sites

65123236_2735091853171055_12024932096834

పట్టిసీమ శుద్ధ దండగ. మేమూ మా పార్టీ పట్టిసీమకి వ్యతిరేకం అన్నారు. అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నారు. ''నాలుగు టీఎంసీల పట్టిసీమతో 180 టీఎంసీల కృష్ణా డెల్టాని ఎట్లా కాపాడతాం అధ్యక్షా??...'' అంటూ ఆరోజు ప్రతి పక్షనాయకులుగా మీ విషయ పరిజ్ఞాన లోపాన్ని చాటుకున్నారు. ''ఏ ఆగస్టులోనో గోదావరికి వరదలొస్తే జూన్ మాసంలోనే కృష్ణా డెల్టాకు నీరెలా ఇస్తారని'' ఆనాడు అయోమయంగా అడిగారు. నిన్నటికి నిన్న అసెంబ్లీలో అధికారపక్ష హోదాలోనూ పట్టిసీమ ఖర్చు వృధా ఖర్చు అన్నారు. ''అది నిజంగా వృధా ప్రాజెక్టు అని వారు భావిస్తే ఈ ఏడాది పట్టిసీమ మోటార్లు ఆన్ చేయొద్దని, డెల్టా రైతులకు నీరివ్వకుండా, వారి స్పందన ఏమిటో చూడాలని'' అచ్చెన్నాయుడు అని నెల కూడా కాకుండా పట్టిసీమ మోటార్లను ఆన్ చేశారా ముఖ్యమంత్రిగారు?
నాలుగు రోజులాగి "పట్టిసీమ ద్వారా ఈ యేడు డెల్టా రైతుకు ఇన్ని టీఎంసీల నీరిచ్చి, ఇన్ని ఎకరాల పంటను కాపాడాం, గతంలో ఎప్పుడూ లేనంత దిగుబడిని సాధించిన రైతు ప్రభుత్వం మాది'' అని మీ నోట నుండో, మీ నీటిపారుదల శాఖా మంత్రి నోటి నుండో వినాలని ఎదురుచూస్తున్నాం. 
దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏంటోగానీ మీరు వద్దన్న పట్టిసీమనే... మీరు వృధా అన్న పట్టిసీమనే... చంద్రబాబు ముందుచూపుతో ఆలోచించి, చెమటోడ్చి నిర్మించిన ప్రాజెక్టునే... ఈరోజు మీరు ఆన్ చేసేలా చేశారు. మీరొచ్చాక వర్షాలు రాక చివరికి పట్టిసీమే దిక్కయింది. జూన్ లో నీరెలా ఇస్తారని అన్నారు. జూన్ లోనే మీతో నీరు విడుదల చేసేలా చేసింది. వాహ్! చంద్రబాబు! గెలుపంటే మీదే మీదే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...