Jump to content

రవిప్రకాశ్‌ అరెస్టుకు రంగం సిద్ధం?


snoww

Recommended Posts

రవిప్రకాశ్‌ అరెస్టుకు రంగం సిద్ధం?
13-05-2019 02:48:35
 
636933125143858445.jpg
  • 41ఏ నోటీసుల జారీకి ఏర్పాట్లు
  • మూడో రోజు విచారణకు మూర్తి
హైదరాబాద్‌/సిటీ, మే 12 (ఆంధ్రజ్యోతి): సంతకాల ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఆదివారం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాకపోవడంతో పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
‘‘161 సీఆర్‌పీసీ ప్రకారం సాక్షుల నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తాం. ఫిర్యాదుదారు పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవముంటే.. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేస్తాం. ఈ సెక్షన్‌ ప్రకారం కోర్టు నుంచి ఎలాంటి వారెంట్‌ అవసరం లేకుండానే అరెస్ట్‌ చేయొచ్చు. కేసులో టీవీ9 మాజీ డైరెక్టర్‌ ఎంవీవీఎన్‌ మూర్తిని ఆదివారం కూడా ప్రశ్నించాం. ఆయన నుంచి కీలక ఆధారాలను సేకరించాం. అందులో భాగంగానే రవిప్రకాశ్‌, సినీ నటుడు శివాజీకి సీఆర్‌పీసీ 41ఏ కింద త్వరలో నోటీసులు జారీ చేస్తాం. మరుసటి రోజే విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తాం. ఒకవేళ పోలీసుల ఎదుట హాజరుకాకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
 
 
తాము ఇప్పటివరకు రవిప్రకాశ్‌, శివాజీ కోసం గాలించలేదని, 41ఏ నోటీసులకు స్పందించకుంటే.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదులతో రవిప్రకాశ్‌, శివాజీలతో పాటు మరికొందరిపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో మూర్తి కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారంతోనే రవిప్రకాశ్‌, శివాజీలను అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.
 
 
Link to comment
Share on other sites

Eedu and aa kulaaji gallani oka 14 years lopala 10gina tappu ledu.. Next aa ABN RK gaadu.. Telugu rashtrallo media prakshalana avvakapote kashtam..

Link to comment
Share on other sites

1 minute ago, JambaKrantu said:

Eedu and aa kulaaji gallani oka 14 years lopala 10gina tappu ledu.. Next aa ABN RK gaadu.. Telugu rashtrallo media prakshalana avvakapote kashtam..

Sakshi maha v6 a kcr supporting channels..anni lepeste better..only dooradharshan better..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...