Jump to content

ఉప రాష్ట్రపతిని ఆకర్షించిన కరీంనగర్‌ పథకం


Paidithalli

Recommended Posts

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ నగరంలో నూతనంగా ప్రవేశపెట్టనున్న పథకం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆకర్షించింది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌..  పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పథకం వివరాలను తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్‌ ద్వారా స్పందించారు. కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌కు అభినందనలు తెలిపారు.  

కేటీఆర్‌ ప్రశంస

ఒక్క రూపాయికే అంతిమయాత్ర పథకాన్ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ప్రశంసించారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని  పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు.

కరీంనగర్‌లో నిన్న  రవీందర్‌సింగ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తేచాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహనసంస్కారాలు చేపడతామని తెలిపారు. వచ్చే 15లోగా పూర్తి కార్యాచరణతో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. పేదలకు భారం కలగకుండా దాతల సాయంతో నిధులు సమకూర్చుతామని తెలిపారు. నగర పాలక ద్వారా రూ.1.10కోట్లు కేటాయించామని, రూ.50లక్షలతో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపామని చెప్పారు. దాతల కోసం ప్రత్యేకంగా నగర పాలక కమిషనర్‌ పేరు మీద ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి సరిపడా భోజనం రూ.5కే అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...