Jump to content

ఏపీ జలవనరులశాఖలో ఐదుగురు ఇంజినీర్లపై చర్యలు

snoww

Recommended Posts

ఏపీ జలవనరులశాఖలో ఐదుగురు ఇంజినీర్లపై చర్యలు 
31-05-2019 18:16:49
 
636949234114361389.jpg
అమరావతి: ఏపీలో కొత్తగా ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి పాల్పడ్డారంటూ జలవనరుల శాఖలోని ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జలవనరులశాఖలో ఐదుగురు ఇంజినీర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కడప జిల్లాలో హంద్రీ-నీవా పనుల్లో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శ్రీనివాసపురం రిజర్వాయర్‌ నిర్మాణం, కాలువల తవ్వకాలు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఇంజినీర్లను బదిలీ చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ సత్యనారాయణతో విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. ఏపీటీడీసీ ఎండీగా ఉన్న ఆయన్ని ప ర్యాటకశాఖ నుంచి ఉపసంహరించి, కొత్త పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాకుండా సీఎం స్పెషల్‌ సీఎస్ గా ఉన్న సతీష్ చంద్ర, ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్‌, కార్యదర్శులు ఎం.గిరిజాశంకర్‌, అడుసుమిల్లి రాజమౌళిలు బదిలీ అయ్యారు. వీరిలో రాజమౌళి ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన అధికారి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత డెప్యుటేషన్‌పై ఆయన ఏపీలో పనిచేస్తున్నారు. కాగా ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ పదవికి మాజీ సీఎస్‌ ఎస్పీ టక్కర్‌ రాజీనామా చేశారు. సీఎ్‌సగా రిటైరైన తర్వాత ప్రభుత్వం ఆయన్ను నియమించింది. ప్రభుత్వ మార్పుతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.
Link to comment
Share on other sites

ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మార్పు
31-05-2019 21:42:36
 
636949357585423462.jpg
అమరావతి: మధ్యాహ్న భోజనం పథకం పేరును వైఎస్‌ఆర్‌ అక్షయపాత్రగా మార్పు చేశారు. అంతేకాదు మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీలకు గౌరవవేతనం రూ.3వేలకు పెంచారు. అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో మధ్యాహ్న భోజన పథకంపై సమీక్షించిన సీఎం జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని చెప్పారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని, సౌకర్యవంతమైన వంటశాలలు నిర్మించాలని తెలిపారు. ఇది ప్రాథమిక సమావేశమని, తర్వాత సమావేశం నాటికి పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని జగన్‌ ఆదేశించారు.
Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

Good Decision 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...