Jump to content

ఉద్యోగుల కష్టార్జితం ఉఫ్‌!

snoww

Recommended Posts

3 hours ago, snoww said:
TDP Govt has deducted Rs 66108 crores from GPF fund - Sakshi

జీపీఎఫ్‌ నిధి నుంచి రూ.66,108 కోట్లు మళ్లించిన టీడీపీ సర్కారు

మూడు కార్పొరేషన్ల ద్వారా రూ.6,350 కోట్లు మళ్లింపు  

కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులు ఎన్నికల తాయిలాలకు మళ్లింపు

ఫలితంగా ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో పౌరసరఫరాల సంస్థ

లబ్ధిదారులకు బిల్లులు చెల్లించని గృహ నిర్మాణ శాఖ

మంచినీటి కార్పొరేషన్‌ నిధులు వాడేయడంతో బిల్లులు బంద్‌

2018–19 ఆర్థిక ఏడాది చివరకు రూ.2,58,928 కోట్లకు చేరుకున్న అప్పులు  

సాక్షి, అమరావతి: గతంలో ఏ సర్కారు హయాంలోనూ జరగని విధంగా టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సైతం ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన పరిస్థితులను మాజీ సీఎం చంద్రబాబు కల్పించారు. అంతేకాదు.. ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా చంద్రబాబు సర్కారు వాడుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నిర్వహించిన సమీక్షలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇతర అవసరాల కోసం జీపీఎఫ్‌ డబ్బులు ..
ఉద్యోగులు ప్రతి నెలా వారి వేతనాల్లో కొంత మొత్తాన్ని భవిష్యనిధికి (జీపీఎఫ్‌) జమ చేస్తారు. ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం లేదా పదవీ విరమణ అనంతరం ఆ నిధినుంచి డబ్బులు తీసుకుంటారు. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధి నుంచి ఏకంగా రూ.66,108 కోట్లను ఇతర అవసరాలకు విచ్చలవిడిగా వినియోగించేసింది. జీపీఎఫ్‌ నిధి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఇతర అవసరాలకు వినియోగించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. జీపీఎఫ్‌ నిధి నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకున్నట్లు తేలింది. దీన్ని తిరిగి జీపీఎఫ్‌ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. 

చేతులెత్తేసిన పౌరసరఫరాల సంస్థ
మరోవైపు వివిధ కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న అప్పులను వాటి అవసరాల కోసం వినియోగించుకోనివ్వకుండా చంద్రబాబు సర్కారు ఎన్నికల తాయిలాలకు వినియోగించడం పట్ల విస్తుపోతున్నారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను ఎన్నికల ముందు పసుపు కుంకుమ తదితర రాజకీయ ప్రయోజనాల పథకాల కోసం వాడుకోవటంపై నివ్వెరపోతున్నారు. చంద్రబాబు పాలనలో రాజకీయ అవసరాల కోసం కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను వాడుకోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం ఆయా కార్పొరేషన్లకు బకాయి పడింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల కార్పొరేషన్‌ తీసుకున్న రూ.4,800 కోట్ల అప్పును చంద్రబాబు సర్కారు ఎన్నికల తాయిలాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు మళ్లించేసింది. దీంతో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయలేక చేతులెత్తేసింది. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా ఇవ్వలేకపోతోంది. 

ఇళ్ల నిధులు గుల్ల
గృహ నిర్మాణ అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుతో తీసుకున్న రూ.400 కోట్లను కూడా బాబు సర్కారు ఇతర అవసరాల కోసం వినియోగించేసింది. దీంతో పేదల ఇళ్లకు సంబంధించిన బిల్లులు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ మంచినీటి కార్పొరేషన్‌ పేరుతో తీసుకున్న రూ.900 కోట్లను కూడా టీడీపీ సర్కారు దారి మళ్లించడంతో మంచినీటి పనుల బిల్లులు ఆగిపోయాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేసినట్లు శనివారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీపీఎఫ్‌ అప్పుతో కలిపి టీడీపీ పాలనలో చేసిన అప్పులు (కార్పొరేషన్‌ల పేరుతో తీసుకున్న అప్పులు మినహా) 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,58,928 కోట్లకు చేరుకున్నాయి.

Loan ga ne ga teesukundi.. State GOvt will pay interest kada... not sure if there is something to really worry about.

Link to comment
Share on other sites

3 hours ago, idibezwada said:

Its better if you stop posting sakshit and abn news uncle...edanna neutral paperdi unte vey

idhigo, Pilli gaddam saale gaadu chesina donga lekkalu from eenadu

ఆదాయంలో రూ.26,278 కోట్ల మేర నష్టం!
* 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ.11,962 కోట్లు వస్తుందని లెక్కించినా అది వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.
* విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,766 కోట్లు అంచనా వేసిన మొత్తం రాకపోవచ్చని లెక్కిస్తున్నారు. కేంద్రం నుంచి 90శాతం సాయం ఈ రూపేణా అందుతుందనుకున్నా తాజా పరిస్థితుల్లో అది 60శాతానికే పరిమితమవుతుందని అంచనా కట్టారు.
* రాష్ట్ర సొంత ఆదాయాల్లో రూ.5000కోట్ల వరకు లోటు ఉంటుందని, మొత్తం మీద రూ.26,728 కోట్ల ఆదాయం తగ్గుతుందనేది అధికారుల అంచనా.

కొత్త పథకాల అమలుకు రూ. 6,265 కోట్లు అవసరం
ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన కొత్త పథకాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,265 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు.
* పింఛన్లు రూ.2,250 వంతున చెల్లించాలని నిర్ణయించడం వల్ల ఆ రూపేణా రూ.2,557 కోట్లు అవసరమవుతాయి.
* ఆగస్టు 16 నుంచి గ్రామ వలంటీర్ల నియామకం రూపంలో రూ.1,500కోట్లు ఖర్చు కానుంది.
* అక్టోబరు 2 నుంచి గ్రామసచివాలయాల్లో 1.6లక్షల ఉద్యోగాల కల్పనకు రూ.2,208 కోట్లు అవసరం.
* వివిధ కార్పొరేషన్లకు ఇంతకుముందు బడ్జెట్‌లో కేటాయించని రూ.6,350కోట్ల మేర అవసరాలు ఉన్నాయి.
* ఇవన్నీ కలిపి రూ.12,615 కోట్లు అదనపు బడ్జెట్‌ అవసరమవుతోందని లెక్కలు తేల్చారు.

ఇతరత్రా ఆదాయ మార్గాలు..
* కేంద్రం మద్దతుతో రెవెన్యూ గ్రాంటు లోటు రూ.10వేల కోట్లు రాబట్టుకోవాలి.
* రూ.5000 కోట్లు తగ్గుతుందని అంచనా వేస్తున్న రాష్ట్ర ఆదాయాన్ని పకడ్బందీగా క్రమబద్ధీకరించుకుని రాబట్టుకోవాలి.
* ఇసుకపై సీనరేజి విధిస్తే రూ.2000 కోట్లు పొందవచ్చు
* నీటిపన్ను సవ్యంగా వసూలు చేయగలిగితే రూ.500 కోట్లు సాధించవచ్చు
* మొత్తం ఇలా రూ.17,500 కోట్ల వరకు లోటు పూడ్చుకునే ఆస్కారం ఉంది.

Source: https://www.eenadu  .net/ap/mainnews/2019/06/02/125748/

remove space between .net

Link to comment
Share on other sites

36 minutes ago, AndhraneedSCS said:

Loan ga ne ga teesukundi.. State GOvt will pay interest kada... not sure if there is something to really worry about.

Employees valla accounts nundi loans theesukovali antey they wont be able to since there is money in their accounts. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Employees valla accounts nundi loans theesukovali antey they wont be able to since there is money in their accounts. 

it is like your company talking loan from your 401k accounts 

Link to comment
Share on other sites

రూ.39,815 కోట్లుంటే గట్టెక్కే వీలు!

కొత్త ముఖ్యమంత్రికి ఆర్థికశాఖ నివేదన
ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలన్న అధికారులు
ఈనాడు - అమరావతి

1ap-main7a_3.jpg

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గట్టెక్కాలంటే నిధుల లభ్యతను  పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఖర్చులను కలిపి లెక్కించి ఇంకా అదనంగా రూ.39,815 కోట్లు అవసరమని ఆర్థికశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు ఆదాయ మార్గాలు సృష్టించుకోవాల్సి ఉంటుందని కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వారు నివేదించారు. ఇప్పటికే శాసనసభకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ రూపంలో ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌ను సమర్పించారు. నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ఆమోదం పొందినా ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.2,26,178 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ రూపొందించారు. ఇందులో అన్ని ఆదాయాలు, ఖర్చులు అంచనా వేసి ఈ లెక్కలు సిద్ధం చేశారు. తాజా పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని ఎక్కడ ఎంత మేర ఆదాయం తగ్గనుంది, ఎక్కడ ఖర్చు పెరగబోతుందనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక రూ.39,815 కోట్లు అదనంగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని తేల్చారు.

ఆదాయంలో రూ.26,278 కోట్ల మేర నష్టం!
* 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ.11,962 కోట్లు వస్తుందని లెక్కించినా అది వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.
* విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి రూ.9,766 కోట్లు అంచనా వేసిన మొత్తం రాకపోవచ్చని లెక్కిస్తున్నారు. కేంద్రం నుంచి 90శాతం సాయం ఈ రూపేణా అందుతుందనుకున్నా తాజా పరిస్థితుల్లో అది 60శాతానికే పరిమితమవుతుందని అంచనా కట్టారు.
* రాష్ట్ర సొంత ఆదాయాల్లో రూ.5000కోట్ల వరకు లోటు ఉంటుందని, మొత్తం మీద రూ.26,728 కోట్ల ఆదాయం తగ్గుతుందనేది అధికారుల అంచనా.

కొత్త పథకాల అమలుకు రూ. 6,265 కోట్లు అవసరం
ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన కొత్త పథకాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,265 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు.
* పింఛన్లు రూ.2,250 వంతున చెల్లించాలని నిర్ణయించడం వల్ల ఆ రూపేణా రూ.2,557 కోట్లు అవసరమవుతాయి.
* ఆగస్టు 16 నుంచి గ్రామ వలంటీర్ల నియామకం రూపంలో రూ.1,500కోట్లు ఖర్చు కానుంది.
* అక్టోబరు 2 నుంచి గ్రామసచివాలయాల్లో 1.6లక్షల ఉద్యోగాల కల్పనకు రూ.2,208 కోట్లు అవసరం.
* వివిధ కార్పొరేషన్లకు ఇంతకుముందు బడ్జెట్‌లో కేటాయించని రూ.6,350కోట్ల మేర అవసరాలు ఉన్నాయి.
* ఇవన్నీ కలిపి రూ.12,615 కోట్లు అదనపు బడ్జెట్‌ అవసరమవుతోందని లెక్కలు తేల్చారు.

ఇతరత్రా ఆదాయ మార్గాలు..
* కేంద్రం మద్దతుతో రెవెన్యూ గ్రాంటు లోటు రూ.10వేల కోట్లు రాబట్టుకోవాలి.
* రూ.5000 కోట్లు తగ్గుతుందని అంచనా వేస్తున్న రాష్ట్ర ఆదాయాన్ని పకడ్బందీగా క్రమబద్ధీకరించుకుని రాబట్టుకోవాలి.
* ఇసుకపై సీనరేజి విధిస్తే రూ.2000 కోట్లు పొందవచ్చు
* నీటిపన్ను సవ్యంగా వసూలు చేయగలిగితే రూ.500 కోట్లు సాధించవచ్చు
* మొత్తం ఇలా రూ.17,500 కోట్ల వరకు లోటు పూడ్చుకునే ఆస్కారం ఉంది.

1ap-main7b_1.jpg

Link to comment
Share on other sites

Just now, ekunadam_enkanna said:

that's what leaks mean to be: provide copies of documents

No leaks will ever provide any official documents...

such proofs will only be speculative and will how ever be denied by the government neither will be accepted as proofs....ante Kirkland bath tissue is much more worth than such papers released with suck leaks...

Link to comment
Share on other sites

2 hours ago, AndhraneedSCS said:

eenadu lo liquor meeda state income 17,000 crores ani vesadu.. nijamena? 

Antha income pothada state ki by banning it? lekapothe just fake number?

It will not be 17000 .... Last year income was 7000 Cr.... Previous to that was 6800 Cr .. So it will be around that ... Unless people start drinking double being happy with Jagan Administration ... tenor.gif?itemid=8412189

Link to comment
Share on other sites

1 hour ago, Anta Assamey said:

It will not be 17000 .... Last year income was 7000 Cr.... Previous to that was 6800 Cr .. So it will be around that ... Unless people start drinking double being happy with Jagan Administration ... tenor.gif?itemid=8412189

:giggle:

Link to comment
Share on other sites

నీటిపన్ను సవ్యంగా వసూలు చేయగలిగితే రూ.500 కోట్లు సాధించవచ్చు

Idi jaragani pani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...