Jump to content

ఆశల కియ.. ఏడాదిగా నిరుద్యోగ యువత ఎదురుచూపు


snoww

Recommended Posts

ఆశల కియ.. ఏడాదిగా నిరుద్యోగ యువత ఎదురుచూపు 

6/2/2019 4:03:46 AM

636950450254359835.jpg
  • ఇచ్చింది 515 మందికే...
  • నైపుణ్యత అంటూ దాటవేత
  • రైతులకు దక్కని భరోసా
  • పరిశ్రమలో తమిళులే సింహభాగం
 హిందూపురం, జూన్‌ 1 : దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియ కార్ల పరిశ్రమ రావడం జిల్లాకు ఓ వరం. ఈనేపథ్యంలో జిల్లా వాసులకు పరిశ్రమలో ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణం ప్రారంభం నుంచి తమకు అవకాశం ఎప్పడోస్తుందని భూములిచ్చిన రైతు కుటుంబాలతో పాటు వేలాది మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తోంది. డిగ్రీ, పాలిటెక్నిక్‌, డిప్లమా, ఇంజనీరింగ్‌, టెన్త్‌, ఇంటర్‌ చేసి నైపుణ్యం కల్గిన యువత కియ అనుబంధ సంస్థల్లో ఉద్యోగం పట్టు కోసం ఎదురుచూస్తున్న వైనాలే కన్పిస్తున్నాయి. ఇక కియతో పాటు అనుబంధ సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2018లోనే కియలో ఉద్యోగ నియామకాల శిక్షణ మొదలై నియామకాలు మొదలైనా నేటికి పరిమిత సంఖ్యలోనే అవకాశాలు ఇచ్చారు. డిప్లమా, పాలిటెక్నిక్‌ చేసి ఆన్‌లైన్‌ అర్హత పరీక్షలు, ప్రాథమిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణతో తొలివిడత దరఖాస్తు చేసుకున్న వారిలోనే ఎంపిక చేస్తున్నారు. గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారినే పూర్తిస్థాయిలో నియమించకపోవడంతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఏడాదిన్నరగా శిక్షణ పేరుతో కాలయాపన చేశారు. కియలో తమకు అవకాశం వస్తుందోలేదో అన్న టెన్షన్‌ నెలకొంది. ఉద్యోగ నియామకాల్లో తొలి ప్రాధాన్యత జిల్లా వాసులకే అంటున్నా ... పరిశ్రమ వద్ద సింహభాగం తమిళులే కన్పిస్తున్న నేపథ్యంలో జిల్లా నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ట్రయల్‌ ప్రొడక్షన్‌
ఈ ఏడాది జనవరిలోనే కియ ప్రధాన ప్లాంటు ట్రయల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభించింది. ఇక అనుబంధ సంస్థల నిర్మాణ పనులు దాదాపుగా తుది దశకు వచ్చి తమ ఉత్పత్తుల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రధాన ప్లాంట్‌లో ఐదు సంస్థలు, దుద్దేబండ క్రాస్‌ అమ్మవారుపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, పేటకుంట వద్ద భూములు కియకు సంబంధించిన 20 అనుబంధ సంస్థలు సిద్ధం చేశాయి. ఇందులో కియ కార్ల విడిభాగాలు తయారు చేసే సంస్థలైన ప్లూరికా ఇంటీరియల్‌ సిస్టం, సంగ్‌పూ హైటెక్‌ ఏపీ లిమిటెడ్‌, సియోన్‌ ఈహెచ్‌ డబ్ల్యుఏ ఆటోమోటివ్‌ అనంతపురం లిమిటెడ్‌, యునైటెడ్‌ ఇండస్ర్టీస్‌ ప్లాస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కేఎస్‌హెచ్‌ ఆటోమోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హుండాయ్‌, మెటీరియల్‌ ఇండియా లిమిటెడ్‌, యూఈప్రెస్‌టూల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఆర్‌సీ ఆటోమోటివ్‌ ఇండస్ర్టీ ఇండియా లిమిటెడ్‌, ఈఎన్‌జీ ఆటో కంపోనెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డీచంగ్‌ సీట్‌ ఆటోమెటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బోగోక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎల్‌ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హాస్యుయంగ్‌ ఐఏ ఆటోమోటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దేహ ప్లాస్టిక్‌ కాంపోండ్‌ ఇండియా లిమిటెడ్‌, వూయంగ్‌ ఆటోమోటివ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మోదీష్‌ సంస్థల నిర్మాణాలు పనులు తుది దశకు వచ్చాయి.
 
శిక్షణ ఇచ్చింది 515 మందికే..
కియతో పాటు అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్‌, డిప్లమా, ఇంజనీరింగ్‌, టెన్త్‌, ఇంటర్‌ చేసి నైపుణ్యం కల్గిన యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలిదశలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న డిప్లమా అభ్యర్థులకు అర్హత ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి కియ, ఏపీఎస్‌ఎస్‌బీసీ, జేఎన్‌టీయూ సంయుక్తంగా అవగాహన ఒప్పందంతో శిక్షణ ఇచ్చి నియామకాలు చేపడుతోంది. కియలో నియామకాల కోసం ఇప్పటికే 5400 మంది డిప్లమా, పాలిటెక్నికల్‌ అభ్యర్థులు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు 2018లోనే దరఖాస్తు చేసుకున్నారు. అర్హత పరీక్షల్లో ప్రతిభ సాధించిన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 12 బ్యాబ్‌ కియ పరిశ్రమ దుద్దేబండ క్రాస్‌ వద్ద కియ మోటార్‌ ఇండియా శిక్షణ కేంద్రంలో ఆటో మొబైల్‌ పరిశ్రమ కోసం ప్రాథమిక, సాంకేతిక కోర్సులకు కొరియన్‌ నిపుణులతో శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా అనంతపురం జేఎన్‌టీయూలో అర్హత పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన డిప్లమా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణలో నైపుణ్యత కనబరచిన 515 మంది అభ్యర్థులను కియలో వివిధ విభాగాల్లో తీసుకోనున్నారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారి పరిస్థితి ఏమైందో చెప్పేనాథుడే లేడని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కియ పరిశ్రమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వ ఒప్పుందంలో కియ స్పష్టం చేసింది. అదేవిధంగా కియ అనుబంధ సంస్థలు రూ.3500 కోట్ల నిర్మాణంతో రూ.7500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.
 
   ఇందులోను జిల్లా వాసులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కియ ప్రతినిధులు, ప్రభుత్వం చెప్పారు. ఇప్పటివరకు కేవలం వందల సంఖ్యలో కియలో అవకాశం కల్పించడంతో జిల్లా వాసులకు ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది జిల్లా యంత్రాంగానికే తెలియని పరిస్థతి నెలకొంది. పరిశ్రమల కోసం 640 మంది భూముల ఇచ్చిన రైతు కుటుంబాల్లో వారికి ఉద్యోగం కల్పిస్తామని హడావిడి చేసిన అధికార యంత్రాంగం పలుసార్లు సమావేశాలు పెట్టింది. అర్హత ఉన్న అభ్యర్థుల వివరాలు తీసుకున్నా నేటికి ఎంత మందికి ఇస్తారన్న స్పష్టత ఇవ్వలేదు. భూమి కోల్పోయి ఉద్యోగాలు రాక వచ్చిన పరిహారం సొమ్ము ఖర్చు చేసి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.
 
తమిళులదే హవా
జిల్లా వాసులకే తొలిప్రాధాన్యత ఇచ్చి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న సమాచారంతో జిల్లాలో యువతంతా ఏడాదిన్నరగా వేచిచూస్తోంది. ఇప్పటికే కొందరు నైపుణ్యతతో పాటు కొరియన్‌ భాషపై శిక్షణ తీసుకుంటున్నారు. అయినా కియ వద్ద తమిళనాడు వాసులే అధికంగా కన్పిస్తున్నారు. తమిళనాడులో హూదాయ్‌ కార్ల పరిశ్రమ ఉన్న నేపథ్యంలో కియతో పాటు అనుబంధ సంస్థల్లో నిర్మాణ పనుల్లో అత్యధికంగా తమిళనాడు వాసులే చేపడుతున్నారు. కారు డ్రైవర్‌ నుంచి దాదాపుగా పరిశ్రమల పనులన్నీ వారే చేస్తున్నారు. తమిళనాడు వాసులకే సింహభాగం ఉద్యోగాలు పొందే అవకాశముందన్న భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వమే పరిశ్రమలకు అవసరమైన సదుపాలు కల్పిస్తున్నారు. కియ వద్ద కన్పిస్తున్న పరిస్థితి చూస్తే నీరుగారిపోయే పరిస్థితి కన్పిస్తోందన్న ఆందోళన జిల్లా వాసుల్లో కన్పిస్తోంది. ఇక కియ, అనుబంధ సంస్థల కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు భరోసా లభించలేదు. ప్రతి రోజు వందల సంఖ్యలో నిరుద్యోగులు కియ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కన్పిస్తోంది.
 
ఆశగా ఎదురుచూస్తున్నాం - శ్రీరామ్‌, కురుబవాండ్లపల్లి
 ఎంకాం పీజీ పూర్తిచేశా. పెనుకొండ, హిందూపురం నెట్‌ వర్క్‌ సెంటర్‌లో పనిచేస్తుంటా. మా ప్రాంతంలో కియ పరిశ్రమ ఏర్పడటంతో ఉద్యోగం వస్తుందని ఎంతో సంబరపడ్డా. దరఖాస్తు చేసుకున్న కియలో అవకాశం లభించలేదు. అనుబంధ సంస్థల్లోనైనా అవకాశం వస్తుందని చాలా మంది మాలాంటి యువత ఎదురుచూస్తున్నారు.
 
ఉద్యోగాలు లేక వలస పోతున్నాం - మోహన్‌, సోమందేపల్లి
 డిగ్రీ పూర్తి చేశా. కియ అనుబంధ సంస్థలు పెనుకొండ, సోమందేపల్లికి రావడంతో ఆనందంగా ఉంది. ఈ సంస్థల్లో అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే స్థానికంగా ఉద్యోగాలు లేక చాలా మంది యువకులు కర్ణాటక ప్రాంతాలకు వలస బాట పట్టారు. మా ప్రాంతంలో నిర్మించే సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తే వలసలు నివారించడానికి అవకాశం ఉంటుంది.
 
భూములిచ్చిన రైతు కుటుంబాలకు ప్రాధాన్యత ఏదీ? - సంపత్‌కూమార్‌, అమ్మవారుపల్లి
కియ పరిశ్రమ పక్కనే మా ఊరు ఉంది. ఈ పరిశ్రమ కోసం నాలుగు ఎకరాల భూమి పోయింది. నేను డిగ్రీ పూర్తి చేశా. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. కియలో ఉద్యోగ నియామకాలు ఏడాది గడిచినా నేటికీ అవకాశం కల్పించేదు. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగం ఎక్కడ. ఆర్డీఓ కార్యాలయం, కియ చుట్టూ తిగుతున్నాం. ఇస్తారోలేదో చెప్పేవారేలేరు. ప్రతి రోజు వందల సంఖ్యలో నిరుద్యోగులు తిరుగుతున్నారు.
Link to comment
Share on other sites

orey boothu kittu gaa elections ki mundu ide antey edo sollu vaagav kada raa.

No wonder pilla congress lost in Ananthapur badly. Ground level lo everyone knew this hype pilla congress and yellow media was showing. 

Link to comment
Share on other sites

Hehe...oka 1 year back chepina nenu ie vishayam...maha aithe ancillary jobs oka 1000-2000 locals ki potha yo, migilina I anni Hyundai factory lo train ayina vallu vastadi ante...okadu vachi 10k jobs antadu, inkokadu 15k antadu

car company 10-15k jeethalu isthe iga aadu chippa kudu tinalsinde Ana sangati etla marchinaro

Link to comment
Share on other sites

39 minutes ago, Veeraveera said:

Love da lo KIA. Mee mohal manda. Ee brand click avvakapothe India lo nundi within 5 years lo mingestharu eee Korean lanj sons

So you want a company that can give free doles without concomitant domestic market? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...